మహబూబ్‌నగర్

చదువుతోనే సమాజంలో గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 25: చదువు ఉంటేనే సమాజంలో గౌరవమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జాతీయ ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆద్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌లో విద్యార్థులకు ప్రతిభా పురస్కార్ అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో మంచి గౌరవం లబిస్తుందని సమాజంలో జరుగుతున్న విషయాలన్నింటిని తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కలలను నేరవేర్చాలని ముఖ్యంగా వెనుకబడిన వర్గాలలో చదువు అంటేనే భారంగా బావించే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో చదువు బారం కాదనే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులలను తీసుకువచ్చారని తెలిపారు. బడుగుబలహీన వర్గాలు ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం చదువు అన్నారు. ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే అందరు చదువుకోవల్సిరన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించాల్సిన భాద్యత ఉందన్నారు.
ప్రతి మండలంలో ఓ గురుకుల పాఠశాల వచ్చేసిందని ఇప్పటికే నియోజకవర్గాలలో ఒక్కొ గురుకుల పాఠశాలను ప్రారంబించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు విద్యార్థులను ప్రొత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయని వారు కేవలం తమ సమస్యలపై పోరాటలు చేస్తుంటారని జాతీయ ఎస్పీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మాత్రం ఇతర సంఘాల మాదిరిగా కాకుండా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లడం అభినందించదగ్గ విషయమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితులకు, ఇతర వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఓ గొప్పవరం అన్నారు. ఈ రిజర్వేషన్లను దుర్వినియోగం కాకుండా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు అంబేద్కర్ ఇచ్చినటువంటి వరాన్ని కాపాడుకుంటూ దళితుల్లో చైతన్యం తీసుకువస్తున్నారని తెలిపారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైన ఉందని అందుకు ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం మాట్లాడుతూ విద్యార్థులను ప్రొత్సహించడానికే తమ సంఘం ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి ఎంతో అవసరమని దేశభక్తి ఉన్న విద్యార్థి క్రమశిక్షణతో ఉంటారని క్రమశిక్షణ గల విద్యార్థి చదువులో రాణించడమే కాకుండా భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర నాయకులు వెంకటేష్, ఎమ్మార్పి ఎస్ నాయకులు మల్లెపోగు శ్రీనివాస్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.