కరీంనగర్

ప్రతి పైసా లెక్క చూపాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 25: ప్రతి పైసాకు లెక్క చూపాల్సిన సమయం రానే వస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ (వస్తు సేవల పన్ను) విధానం అమలు చేయబోతోంది. దీంతో ఇప్పటిదాకా తప్పుడు లెక్కలతో సర్కార్ ఖజానాకు బొక్క పెట్టిన బడాబడా వ్యాపారుల్లో అయోమయం, ఆందోళన మొదలు కాగా, జీరో దందాకు ఇక చెల్లుచీటే. అటు చిరు వ్యాపారులకు ఊరట, ఇటు వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ఏదిఏమైనా నాలుగు రోజుల్లో జిఎస్టీ అమలు కాబోతున్న దరిమిలా అందరి నోటా జిఎస్టీ పలుకే వినపడతోంది. నూతనంగా అమలు కాబోతు న్న జిఎస్టీ విధానంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా కాకుండా దేశాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో వస్తు సేవల చట్టం ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రకారం పన్నులు నేరుగా ఆయా రాష్ట్రాల ఖజానాకు జమ కావడంతోపాటు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండనుంది. ఇప్పటివరకు దేశంలో ఒక్కో విధమైన ధరలు, రాష్ట్రంలో మరో విధమైన ధరలు అమలు చేస్తుండటంతో వినియోగదారుడికి పెను భారంగా మారింది. మరోవైపు ఈ విధానంలోని లోపాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు తప్పుడు లె క్కలు చూపుతూ సర్కార్‌కు చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతూ నల్ల ధనాన్ని వెనకేసుకుంటున్నారు. దీనిని అరికట్టడంతోపాటు చిరు వ్యాపారులకు ఊరట కలిగించడం, వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. జిఎస్టీ విధానంపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం సమావేశమై చర్చించింది. చివరకు జిఎస్టీకి ఆమోదముద్ర పడటంతో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే ప న్ను విధానం చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 29 రాత్రి వరకే పాత పన్నులు ఉంటాయ ని, ఆ తరువాత కొత్త పన్నులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. జిఎస్టీ అమలుతో వస్తు కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత పెరిగే ఛాన్స్ ఉండగా, ప్రతీ పైసాకు కూడా లెక్క చూపాల్సి ఉంటుంది. వ్యాపారులు వారి రిటర్న్‌లు ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉం టుంది. దీంతో వ్యాపారులు చూపించే తప్పుడు లెక్కలు ఇక చెల్లబోవు. ఇప్పటివరకు వ్యాట్ పరిధిలో ఉన్న వ్యాపారులు తమ సంస్థకు సంబంధించిన పత్రాలు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాన్ కార్డ్ తదితర వివరాలను సమర్పించి జిఎస్టీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో కొందరు వ్యాపారులు జిఎస్టీలోకి మారగా, ఇంకా 2,631 మంది వ్యాపారులు, డీలర్లు వ్యాట్ పరిధిలోనే ఉన్నారని, వారంతా ఈ నెల 30తేదీలోగా మైగ్రేట్ కావాలని వాణిజ్య పన్నుల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యాట్ నుంచి జిఎస్టీ పరిధిలోకి మారగానే వ్యాపారి చేసే ప్రతీ లావాదేవీల లెక్కలు చూపాల్సి ఉంటుండగా, జిఎస్టీ పరిధిలోకి రాని వారు చట్టబద్ధత కోల్పోయి భవిష్యత్‌లో ఏలాంటి లావాదేవీలు నిర్వహించే పరిస్థితి ఉండదు. ఇకపోతే జిఎస్టీ అమలుతో జీరో దందా పూర్తిగా నిలిచిపోనుంది. పొరుగు రాష్ట్రాల నుంచి కొన్ని ర కాల వస్తువులు తెచ్చి వ్యాపారులు ఇక్కడ విక్రయిస్తూ, వీటిపై చెల్లించాల్సిన 5శాతం వ్యాట్ ఎగ్గొట్టే వారి ఆటలు ఇక సాగవు. కొత్త పన్ను విధానంతో వ్యాపార లావాదేవీల పారదర్శకత పెరగనున్న దరిమిలా జీరో దందా చేయడం కష్టం. ఒకవేళ జీరో దందా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనుంది.
ఏడు రెట్లు జరిమానా విధించడంతోపాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి వ్యాపారాల్లో అధిక లాభాలు గడించి దొంగ లెక్కలతో అవకాశం ఉన్నంత మేర నష్టాలనే చూపిస్తూ సర్కార్ ఖజానాకు బొక్క పెడుతూ ధనాన్ని వెనకేసుకుంటున్న వ్యాపారులను జూలై నుంచి అమలుకాబోతున్న జిఎస్టీ విధానం అయోమయం, ఆందోళనకు గురిచేస్తుండగా, ప్రస్తుతం అందరి నోటా జిఎస్టీ మాటే పలుకుతోంది.