విశాఖ

వైభవంగా జగన్నాథ స్వామి తొలి రథాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూన్ 25: జగన్నాథ స్వామి రథోత్సవం తొలి రథయాత్ర ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా సాగింది. ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, దేవస్థాన ఉత్సవకమిటీ, గోవాడ సుగర్స్ మల్లునాయుడులు రథయాత్రలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, విశిష్ఠ అర్చనలు నిర్వహించారు. జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా ఉదయం నుండి స్వామివారికి విష్ణుసహస్రనామ పారాయణంతోపాటు ప్రత్యేక అర్చనలు, విశిష్ఠ పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఆకాశం మబ్బుపట్టి జల్లులు కురుస్తున్నా భక్తులు క్యూలు కట్టి మరీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
సాయంత్రం సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ ప్రదక్షిణ అనంతరం రథంపై ఉంచి తొలి రథయాత్రను ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు ప్రారంభించారు. ఈ రథయాత్ర స్థానిక కేశవ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథయాత్ర శివాలయం ఆర్చి, కొత్తూరు జంక్షన్, కోర్టుల సముదాయం, ఆర్టీసి కాంప్లెక్స్, కోఆపరేటీవ్ కాలనీ జంక్షన్, పాతబస్టాండ్‌ల మీదుగా బోళ్లవీధి వద్ద ఏర్పాటుచేసిన ఇంద్రజ్యుమ్న హాలుకు చేరుకుంది. ఇంద్రజ్యుమ్న హాలు వద్ద సోమవారం నుండి జూలై 5వరకు జగన్నాథ స్వామివారిని దశవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాద వితరణ కల్పిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ అలమండ బంగారయ్య తెలిపారు. అంతకుముందు విఘ్నేశ్వరాలయ కమిటీ చైర్మన్ చేకూరి శ్రీరామ్మూర్తి రాజు సుభద్రా బలభద్రా సమేత జగన్నాథ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పూజల్లో గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, కలగర్ల శేషు, అల్లుతాతం నాయుడు, దేవాదాయ శాఖ ఇవో సత్యనారాయణ,, సకలా సూరిబాబు, రాజు, ఆలయ అర్చకులు సీతారామాచార్యులు, కృష్ణమాచార్యులు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.