విశాఖ

అధికారులు మన్యం విడిచి వెళ్ళిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూన్ 25: ఆదివాసీ ప్రాంతంలో అడ్డగోలుగా ఖనిజ సంపదను దోచుకుంటున్న పెట్టుబడిదారులకు సహకరిస్తున్న అధికారులు మన్యం విడిచిపోవాలని , లేకుంటే తదనంతరం జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆదివాసీ అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ప్రజల డబ్బుతో జీత భత్యాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆదివాసీల ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీరందరూ మన్యం విడిచిపెట్టి వెళ్ళాలని ఆయన హెచ్చరించారు. గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం క్వారీ నుండి విలువైన ఎర్రమట్టిని సేకరిస్తున్నారని, ఇందులో కొంత మంది బినామీలను సృష్టించి విశాఖ జిల్లా ఎస్పీగా గతంలో పని చేసిన కోయా ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్వారీ యజమాని వెంకటేష్, నల్లగొండ జిల్లాకు చెందిన పిల్లి వెంకటేశ్వర్లు ఈక్వారీలో పెట్టుబడులు పెట్టి తవ్వకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తవ్వకాలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు క్వారీని వ్యతిరేకించినప్పటికీ అధికార బలంతో తవ్వకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. 65 శాతం ఐరన్ ఓర్, 35 శాతం సిలికాన్ కలిగి ఉన్న ఈ ఎర్రమట్టిని నర్సీపట్నం నుండి రాజమండ్రి వరకు రవాణా అవుతుందని , ఐరన్ ఓర్ రాజమండ్రికి వెళ్తుండగా , సిలికాన్ సిమ్మెంట్ ప్యాక్టరీలకు పంపిస్తున్నారన్నారు. నర్సీపట్నం నుండి రవాణా అవుతుందంటే మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ రోజుకు ఒక్కొక్క లారీకి 250 రూపాయలు చొప్పున వంద లారీల వరకు కమీషన్ వసూలు చేస్తున్నారని కైలాసం ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు విషయం ఏమిటంటే ఆదివాసీలు మేధావులుగా గుర్తింపు తెచ్చుకుని వారి హక్కులు, చట్టాలు చెబుతున్న ప్రొపెసర్ జర్రా అప్పారావు ఈతవ్వకాలకు క్షేత్ర స్థాయి ఏర్పాట్లు చేస్తూ తన వంతు వాటాలు పొందుతున్నారన్నారు. ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులు, ప్రజలకు మంచి పాలన అందించాల్సిన ప్రతినిధులు చైతన్యవంతులను చేయాల్సి ఉండగా ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 15 ఏళ్ళ క్రితం చాపరాతిపాలెంలో క్వారీని తవ్వడం కోసం ప్రయత్నాలు జరిగాయని, తెలంగాణా, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు కలిసి పొత్తూరు దేముడు, జంబి ప్రసాద్‌లను చాపరాతిపాలెం క్వారీనికి బినామీలుగా సృష్టించి వెలికి తీత చర్యలు ప్రారంభించారన్నారు. 2004లో గ్రామ పెద్దలు సభ నిర్వహించి ఆధిపత్య శక్తులను ఎండగట్టామని , క్వారీ వలన ఎదురయ్యే అనర్ధాలను వివరించామని తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.