విజయవాడ

పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 25: పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుందని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం రోటరీ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో స్థానిక మినర్వా గ్రాండ్ హోటల్‌లో ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో అతిథులుగా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, సినీ నటుడు, తెలంగాణ ఎమ్మెల్యే పి బాబూమోహన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ టెస్ట్ మ్యాచ్‌లా ఎక్కువ చెప్పనని, టి-20లా తక్కువ సేపు మాట్లాడతానన్నారు. తాను అండర్-15 క్రికెటర్‌గా వచ్చానని, హైదరాబాద్‌లో మెడికల్ స్టూడెంట్‌గా కళాశాలలో రిజిష్టర్ అయినప్పటికీ క్రికెట్ మీద ఇష్టంతో టోర్నీలకు వెళ్లడం జరిగిందన్నారు. క్రీడలతో పాటు చదువు ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించాలన్నారు. 1996లో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాననన్నారు. అవసరం ఉన్నవారికి రోటెరీయన్స్ సూపర్‌స్టార్స్ లాంటి వారని కొనియాడారు. అంతకుముందు సినీ నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపన రోటరీ క్లబ్‌కు ఉందని, కష్టజీతం నుండి కొంత వెచ్చించి ప్రజాసేవ చేయడం అభినందనీయమన్నారు. బతికున్న కాలంలో కొంత ఖర్చు చేసి సేవ చేస్తే పుణ్యం దక్కుతుందన్నారు. పోతూపోతూ ఏమీ తీసుకుపోలేమని గుర్తుచేశారు. స్కూల్ రోజుల్లో తాను క్రీడల్లో టాపర్ అని, ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగోలేక క్రీడల్లో ప్రాతినిధ్యం వహించకపోతే టీచర్ డ్రస్ నీట్‌నెస్ అన్న పేరుతో ఫ్రైజ్ ఇచ్చారని అది ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ గుర్తుండి పోయే చిన్న పర్సు అని అన్నారు. క్రికెట్‌లో తనకు సచిన్ అంటే ఇష్టమని, లక్ష్మణ్ హైదరాబాదీ అని తెలిసిన తరువాత క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు లక్ష్మణ్ బ్యాటింగ్ అయ్యేంత వరకు మ్యాచ్ చూడడం జరిగేదన్నారు. మావాడు అన్న గర్వం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అనంతరం లక్ష్మణ్‌కు ఒకేషనల్ ఎక్సెలెన్సీ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ డా ఎస్‌విఎస్‌రావు, అధ్యక్ష, కార్యదర్శులు టి కిషన్‌బాబు, ఎం కృష్ణప్రభు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.