విజయవాడ

వర్షపు నీటి పారుదలకు చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 25: వర్షం నీటి పారుదలకు సత్వర చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికే ముంపునకు గురైన పలు రోడ్లను మేయర్ పరిశీలించారు. తొలుత మొగల్‌రాజపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం జంక్షన్ రోడ్ల దుస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్లమీదకు వర్షం నీటి ప్రవహిస్తూ వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న తీరుపై మండిపడ్డ శ్రీ్ధర్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల సక్రమంగా ఉంటే ప్రస్తుత సమస్య ఉత్పన్నమైయ్యేది కాదని, కేవలం పక్కామురుగు కాల్వల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతోనే అనేక సమస్యలు ఎదురవుతున్న విషయానికి శాశ్వత పరిష్కార మార్గం చూపాలన్నారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు.