విజయవాడ
నగరంలో ప్రశాంతంగా అధికారుల నియామక పరీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 June 2017
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 25: నగరంలో ఆదివారం జరిగిన సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, బిసి సంక్షేమ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖాధికారుల నియామక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కెబిఎన్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిబి సిద్ధార్ధ కళాశాల, మారిస్ స్టెల్లా కళాశాలలో జరిగిన ఈపరీక్షకు 3236 మంది అభ్యర్థులకు గాను 1193 మంది హారయ్యారు. ఆదివారం ఉదయం పిబి సిద్ధార్థ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి, ముడా విసి ఎం వేణుగోపాలరెడ్డి ఉన్నారు.