కృష్ణ

ఆర్‌ఎస్‌ఎస్ ఆటలు సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: కేరళలో సి పిఎం ప్రభుత్వ పాలన ప్రపంచీకరణ కు ప్రత్యామ్నాయంగా ఉందని, అం దువల్లే బిజెపి తమపై కక్ష కట్టి తప్పు డు ప్రచారం చేస్తోందని కేరళ ఆర్ధికశాఖ మంత్రి డాక్టర్ థామస్ ఐజాక్ అ న్నారు. దాన్ని దెబ్బతీసేందుకు అక్కడ మతోన్మాద పూరిత చర్యలకు దిగుతోందన్నారు. దీన్ని కేరళ ప్రజలు అంగీకరించరన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆ ధ్వర్యంలో ఆదివారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మతోన్మాదం-సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో థామస్ ఐజాక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ బిజెపి పచ్చి కా ర్పొరేట్ అనుకూల విధానాల్ని అనుసరిస్తోందని, వాటి దోపిడీపై ప్రజల్లో ఆలోచన రాకుండా ఉండేందుకు రకరకాల పేర్లతో మతోన్మాద చర్యలకు దిగుతోందన్నారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నయా ఉదారవాద విధానాలను కాంగ్రెస్ కంటే వేగంగా బిజెపి అమలుచేస్తోందని, అందుకనే కార్పొరేట్ శక్తు లు బిజెపికి అనుకూలంగా మారాయన్నారు. గతంలో పెట్టుబడిదారులు కొ ద్ది మొత్తంలో వచ్చే ఆదాయంతో లాభపడేవారని, ప్రస్తుతం లక్షల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని, వారికి బిజెపి అండగా ఉంటోందన్నారు. ఇటీవల ప్ర వేశపెట్టిన జిఎస్టీ కూడా అందులో భాగమేనన్నారు. దీనివల్ల ఒకే ఏడాదిలో కా ర్పొరేట్ శక్తులకు లక్షన్నర కోట్ల లబ్ది చే కూరిందన్నారు. అదే సమయంలో సం క్షేమం నుండి తప్పుకుంటోందన్నారు. కేరళ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అక్కడున్న సంప్రదాయ వృత్తిల్ని అభివృద్ధి చేసేందుకు ఆయా రంగాల్లో సుమారు రూ.50వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించామన్నారు. ఇవన్నీ గిట్టని సంఘ్ పరివార్ శక్తులు కేరళలో సిపిఎంని టార్గెట్ చేసుకుని త ప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బిజె పి చర్యలకు తాము భయపడేది లేద ని, ధైర్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేరళ ప్రజ లు కూడా బిజెపి ఉన్మాద చర్యల్ని అ ర్ధం చేసుకుంటున్నారని, స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందన్నారు. బ్రిటీష్ పాలకులు వారి స్వార్ధం కోసం ప్రజలను విభజించి పాలించే పద్ధతిని అనుసరించారని, అప్పుడే ముస్లిం లీగ్, హిందూ మహాసభలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. హిందూ మహాసభలో ఉన్న నాయకులెవరికీ భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. ఆయా సంస్థలను ప్రోత్సహించి బ్రిటీష్ వాళ్ళు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. దేశం లో హిందూ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే హిట్లర్, ముస్సోలినీ వంటి వారి విధానాలను అనుసరించాలని బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ పేర్కొన్నారన్నారు. జన సంఘ్ పేరుతో ముందుకొచ్చినా ప్రజలు వారిని ఆదరించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కోల్పోయిన సమయంలో జనతాపార్టీ పేరుతో ముందుకొచ్చారన్నారు. అందులోనూ విడిపోయి బిజెపిగా అవతరించారని ఆయన పేర్కొన్నారు. సంఘ్ పరివార్ పేరుతో బిజెపిని, ఇతర మతోన్మాద సంస్థలను ఆరెస్సెస్ నడిపిస్తోందన్నారు. బిజెపి ఏర్పాటైన తరువాత తొలుత వాజ్‌పేయి విధానాలు పాటించారని, అవి విజయవంతం కాకపోవడంతో అద్వానీ రథయాత్ర పేరుతో దేశం మొత్తం పతపరమైన విద్వేషాల్ని రెచ్చగొట్టారన్నారు. వాటినీ తలదనే్న విధంగా ఇప్పుడు మోదీ ముందుకొచ్చి అత్యంత పాశవికంగా ఫాసిస్టు పద్ధతుల్ని అనుసరిస్తున్నారన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై బిజెపి, దాని అనుబంధ సంఘాలు ఉద్దేశపూర్వక దాడికి దిగుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుంటూరులో ఐజాక్ సభను అడ్డుకోవాలని పోలీసులకు హిందూ సేన పేరుతో వినతిపత్రమిచ్చారని, వారికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. దీన్ని చూస్తూ ఊరుకోబోమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరారవు మంత్రి థామస్ ఐజాక్‌ను వేదిక మీదకు ఆహ్వానించారు.
వైసిపి కూడా బిజెపికి తొత్తుగా మారింది: సిపిఐ కార్యదర్శి రామకృష్ణ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపితోపాటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా బిజెపికి తొత్తుగా మారడమేమిటో అర్ధం కావడం లేదన్నారు.