హైదరాబాద్

యఙ్ఞయాగాదులతోనే రాష్ట్రం సుభిక్షం: మంత్రి నాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, జూన్ 25: యఙ్ఞ యాగాదులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈనెల 23న ఎన్‌టిఆర్ స్టేడియం లో ప్రారంభమయిన శ్రీమహాలక్ష్మి యాగం మూడవరోజైన ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాయిని మాట్లాడుతూ ఎక్కడ వేద పారాయణ జరుగుతూ ఉంటుందో అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, అందుకే ముఖ్యమంత్రి తరచుగా యఙ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ఉంటారని గుర్తుచేశారు. ఆచార్య సేతు ఆధ్వర్యంలో మూడు రోజులుగా మన నగరంలో నిర్వహిస్తున్న యాగంతో తెలంగాణకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. గణేశ పీఠాధిపతి విద్యా గణేశానంద భారతీ స్వామి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎన్నో శిఖరాలు అధిరోహించినప్పటికీ రాను రాను మన సనాతన సాంప్రదాయాలకు దూరమవుతున్నారని అన్నారు. మరచిపోతున్న భారతీయ సాంప్రదాయాలను తిరిగి అందించేందుకు ఆచార్య సేతు కృషి చేయటం అభినందనీయమని అన్నారు. ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మనది వేద భూమి అని, ఎక్కడ వేదాలు వల్లిస్తూ ఉంటారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని అన్నారు. ప్రపంచ శాంతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఇటువంటి యఙ్ఞ యాగాదులు నిర్వహించటం హర్షించదగిన విషయమని అన్నారు. నిర్వాహకుడు, ప్రముఖ ఆర్టిస్ట్ లోహిత్ మాట్లాడుతూ సంప్రదాయ విలువలను పునరుద్ధరించి ప్రతి ఒక్కరికీ చేరువచేయాలనే లక్ష్యంతో ఆచార్య సేతు పనిచేస్తోందని అన్నారు. శాసనసభ్యుడు సతీష్, ముఖ్యమంత్రి పిఆర్‌ఓ నరసింహారావు, రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల సతీమణి జమున, ఆచార్య సేతు అధ్యక్షుడు ప్రసాద్, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, చిదం శ్రీనివాస్, రాజారెడ్డి, పూజా చౌదరి పాల్గొన్నారు.