శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పేదలకు దూరమవుతున్న ప్రభుత్వ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 25: ప్రభుత్వం ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వైద్యాన్ని క్రమేపి పేదలకు దూరం చేస్తోందని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండవల్లి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ శేషారెడ్డి 9వ స్మారక రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవి రమణయ్య, అమిత్ గుహ తదితరులు మాట్లాడుతూ పతనం అంచున ప్రభుత్వ వైద్యం ఉందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం (పిపిపి) అంటూ రాష్ట్రంలోనే ప్రథమంగా చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అపోలో యాజమాన్యానికి కట్టబెట్టిందన్నారు. క్రమేపి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఇలాగే ఉండబోతోందని ఆరోపించారు. అందులో భాగంగానే గుంటూరులో ఎన్‌ఆర్‌ఐ భాగస్వామ్యం అంటూ ఆ జిల్లా ప్రధాన వైద్యశాలను ఎన్‌ఆర్‌ఐలకు అప్పగించారన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే వైద్యం బాధ్యతల నుండి తప్పుకుంటోందన్నారు. వైద్యం నిత్యావసర వస్తువు కాదని పౌరులందరికి ఆరోగ్యం, వైద్యం అందించటం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఇకనైనా ప్రభుత్వం అందరికి ఉచిత వైద్యం అందించేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జక్కా వెంకయ్య, ప్రజా వైద్యశాల వైద్యులు రమేష్‌బాబు, అజయ్‌కుమార్, రాజేశ్వరరావు, శ్రీనునాయక్, దత్తాత్రేయులు, రఘురామిరెడ్డి, శేషురెడ్డి, రామమ్మ, 13 జిల్లాల జనవిజ్ఞాన వేదిక, ప్రజాసైన్స్ వేదిక ప్రతినిథులు పాల్గొన్నారు.