Others

విక్టరీ ఇంటి పేరు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా దర్శకుల గురించి పుస్తకం రాస్తే అందులో వీరమాచనేని మధుసూదనరావు గురించి ప్రత్యేకంగా రాయాలి. మొదటి చిత్రం సతీతులసి (1959). అది విజయవంతం కాకపోయినా, తర్వాత వచ్చిన విజయాల పరంపరతో తన ఇంటిపేరునే ‘విక్టరీ’గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తూనే, దర్శకత్వ శాఖలో తన అసిస్టెంట్లుగా పనిచేసిన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.చంద్రశేఖరరెడ్డి, నిట్టల గోపాలకృష్ణ.. ఇలా ఎందరినో గొప్ప దర్శకులుగా తీర్చిదిద్దారు. వీరాభిమన్యు, రక్తసంబంధం, ఆత్మీయులు, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, కళ్యాణమండపం.. ఇలా అనేకానేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మధుసూదనరావు సతీమణి సరోజనిది మరో కొత్త పంథా. ఆమె మాతా ఫిలింస్ సంస్థను స్థాపించి పూర్తిగా మహిళా సాంకేతిక నిపుణులతో ‘చిన్నారి పాపలు’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ద్వారా మహానటి సావిత్రి దర్శకురాలిగా, రాజసులోచన నృత్య దర్శకురాలిగా, నేపథ్యగాయని పి.లీలను సంగీత దర్శకురాలిగా తెలుగు సినిమాకు పరిచయం చేశారు.
ఇక ఎందరో విజయవంతమైన దర్శకులను తీర్చిదిద్దినా, తన శిక్షణలో రాబోయే తరంలో మరెందరో నటీనటులు, సాంకేతిక నిపుణులను సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలని పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లాగా హైదరాబాద్‌లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు మధుసూదన రావు. అలా ఎందరో నటీనటులు ఈ సంస్థ ద్వారా శిక్షణపొంది నేడు తెలుగు సినిమా రంగంలో ప్రముఖులుగా రాణిస్తున్నారు. అందుకే మధుసూదనరావు తెలుగు సినిమా రంగానికి అందించిన సేవలు ఎన్నటికీ మరువలేనిది. మధుసూదనరావు కృషి ఫలించి నేడు ఎందరో నటులు సాంకేతిక నిపుణులు తెలుగు సినిమాలో విజయబావుటాలో పయనిస్తున్నారు.

-పర్చా శరత్‌కుమార్, 9849601717