రివ్యూ

పూర్తిగా వెలగలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * ట్యూబ్‌లైట్

తారాగణం:
సల్మాన్‌ఖాన్, సొహైల్ ఖాన్, ఓంపురి, మొహమ్మద్ జీషాన్ అయూబ్, యష్‌పాల్ శర్మ, జుజు తదితరులు
నిర్మాత:
సల్మాన్‌ఖాన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కబీర్ ఖాన్

‘ఈద్’ పండుగ వస్తోందంటే- బాలీవుడ్‌లో ‘ఖాన్ ఖాన్‌దాన్’ ఓ మెరుపు సృష్టిస్తుందని అంతా అనే మాట. భావావేశాలకూ - మానసిక సంఘర్షణనూ.. వేదిక చేసేందుకు ‘ఖాన్’ ఏదో ఒక మాయ చేస్తాడన్నది తాజాగా ‘్భజరంగీ భాయిజాన్’తో నిరూపితమైంది. అంతగా ఎవరూ స్పృశించని ‘సరిహద్దు’ గొడవల్ని కథ కెత్తుకొని... భావతీవ్రతలోనూ.. మనోభావాల జోలికి వెళ్లకుండా.. ఎంతో సామరస్య పూర్వకంగా కథని తీసుకెళ్తాడని ‘్భజరంగీ’తో మరోసారి రుజువైంది. అదే పంథాలో వెళ్దామనుకొని.. సల్మాన్ ఈసారి కాస్త తొట్రుపాటు పడిన మాట వాస్తవం. 2015లో రిలీజైన హాలీవుడ్ మూవీ ‘లిటిల్ బాయ్’కి ఇది రీమేక్.
1962- ఇండో-చైనా యుద్ధం. ఈ నేపథ్యంలోకి వెళ్లబోయే ముందు.. కథ చూద్దాం.
లక్ష్మణ్ (సల్మాన్), భరత్ (సొహైల్) అన్నదమ్ములు. లక్ష్మణ్ అమాయకుడు. చిన్నపిల్లాడి మనస్తత్వం. కల్మషం ఎరుగడు. తమ్ముడు భరత్ అంటే ప్రాణం. భరత్ కూడా అన్నని కంటిరెప్పలా చూసుకుంటూంటాడు. లక్ష్మణ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చుట్టూ ఉన్న వాళ్లు అతణ్ణి ‘ట్యూబ్‌లైట్’ అని పిలుస్తూంటారు. అన్నదమ్ముల మధ్య ‘ఇండో-చైనా’ యుద్ధం అగాధాన్ని సృష్టిస్తుంది. దేశం తరఫున యుద్ధం చేసేందుకు భరత్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. తమ్ముడు యుద్ధానికి వెళ్లటంతో లక్ష్మణ్ ఒంటరివాడై పోతాడు. తమ్ముణ్ణి విడిచి ఉండలేని పరిస్థితి వస్తుంది. స్థానికులు కూడా లక్ష్మణ్‌ని భయపెడతారు. తమ్ముడు ఇక తిరిగి రాడనీ.. యుద్ధంలో చనిపోతాడనీ చెప్పటంతో - లక్ష్మణ్ ఆ యుద్ధాన్ని ఆపేందుకు బయల్దేరతాడు. అమాయకుడు - ఏమీ చేతకానివాడు.. సరిహద్దుల్లో యుద్ధాన్ని ఆపటం అతడి తరమా? అనేది కూడా ఆలోచించడు. ఆ ప్రక్రియలో లక్ష్మణ్ ఎదుర్కొన్న సవాళ్లేమిటి? యుద్ధాన్ని అతడు ఆపగలిగాడా? భరత్ ఏమయ్యాడు? - ఇత్యాది అంశాలతో కథ క్లైమాక్స్ చేరుతుంది.
సల్మాన్ అంటే పక్కా కమర్షియల్ హీరో అని అభిమానుల ఆలోచన. క్షణానికో అరక్షణానికో ఫైట్స్ చేస్తూ.. పచ్చి కామెడీని పండిస్తూ.. హీరోయిన్‌తో చిలిపి పనులు చేస్తూంటే ‘సల్మాన్’ని చూట్టానికి రెండు కళ్లూ చాలవంటారు. ఆ ధోరణి నుంచి కాస్తంత ‘్భజరంగీ భాయిజాన్’ లాంటి పక్కా సెంటిమెంట్ కథల వైపు మళ్లినప్పటికీ.. ‘కమర్షియల్’ టచ్‌ని ఎక్కువగా పండించటంతో.. ఆ కథలన్నీ నడిచిపోయాయి. ఇక -‘ట్యూబ్‌లైట్’కి వచ్చేప్పటికి.. అభిమానులు సైతం ఎక్కడో ఏదో మిస్సయినట్టు కథ చెప్పకనే చెబుతూ వచ్చిందని అంటారు. వార్ నేపథ్యానికి ‘్ఫక్షన్’ కలిపినప్పుడు ‘లాజిక్’ పోకూడదు. దాన్ని కన్విన్స్ చేయగలగాలి. లేదూ! యుద్ధం తాలూకు ప్రభావాన్ని ప్రేక్షకులపై పడేట్టు చేయాలి. అదీ కాదంటే?! భావోద్వేగాలను తెర పైకి తెచ్చి.. పండించాలి. ఈ మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్.. దేన్నీ ‘్ఫల్’ కలిగించలేక పోయింది.
సల్మాన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథలో తన అమాయకత్వాన్నీ.. సెంటిమెంట్లనూ చక్కగా పండించాడు. అతనికి తగ్గట్టు ఆరేళ్ల కుర్రాడు కథలో మమేకమై పోయాడు. గాంధియన్ ఫిలాసఫీ అంటే ఇష్టపడే పాత్రలో ఓంపురి.. చైనా నటి జు జు చక్కటి పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంది.
‘విశ్వాసం’ ప్రాధాన్యత గురించి లక్ష్మణ్‌కీ.. జు జు-కీ మధ్య జరిగిన సంభాషణ ‘డెప్త్’గా ఉండి ఆకట్టుకొంటుంది. ‘జాతి’పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ‘్భరత్ మాతా కీ జై’ అంటూన్న సన్నివేశం.. ఇలా కొన్నికొన్ని సన్నివేశాలు మంత్రముగ్ధుల్ని చేసినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఈ సినిమా అభిమానులను సైతం అలరించలేక పోయింది.

-బిఎనే్క