రివ్యూ

సౌండ్ తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** దువ్వాడ జగన్నాథమ్

తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళీశర్మ, వెనె్నల కిశోర్, సుబ్బరాజు తదితరులు
సినిమాటోగ్రఫి: అయానంక బోస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: హరీశ్ శంకర్.ఎస్

సమాజంలో మన చుట్టూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనలో కోపం.. ఆవేశం తన్నుకొస్తుంది. కానీ కొద్దిసేపటికి ఆ ఫీలింగ్ మారిపోయి మరో వ్యాపకంతో దాన్ని మరిచిపోతాం.. అయ్యో పాపం అనడం తప్ప మనం ఎలాంటి ప్రయత్నం చేయడానికి ముందుకు రాము. కానీ అలాంటి ఫీలింగ్ అంటే నిర్భయ లాంటి ఘటన జరిగిన తరువాత ఇలాంటి దురాగతం చేసిన వాళ్లను అడ్డంగా నరికెయ్యాలి అంటూ మనలో వున్న మరో వ్యక్తి వందల కత్తులతో బయటికి వస్తాడు.. అలాంటి వ్యక్తి నిజంగా బయటికి వచ్చి సమాజంలో జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకు నడుంకడితే.. అదే -దువ్వాడ అలియాస్ డీజే.
వరుస విజయాలతో టాలీవుడ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. జోడీగా పూజా హేగ్డే నటించిన సినిమాలో బన్నీ ఓ బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన 25వ సినిమా కావడంతోపాటు గబ్బర్‌సింగ్ లాంటి హిట్‌ని అందించిన హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి డీజేగా అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.
విజయవాడలోని అగ్రహారంలో అన్నపూర్ణ క్యాటరింగ్ నడుపుతూ ఉంటాడు తనికెళ్ల భరణి. అతని కొడుకు దువ్వాడ జగన్నాథ శాస్ర్తీ (అల్లు అర్జున్). వెనె్నల కిశోర్ పెళ్లిలో హీరోయిన్ పూజా హెగ్డేను చూసి ప్రేమలో పడతాడు. కానీ, ఆమె శాస్ర్తీ ప్రేమను తిరస్కరిస్తుంది. హోం మినిస్టర్ (పోసాని) అయన పూజా తండ్రి ఆమెకు రొయ్యల నాయుడు (రావు రమేష్) కొడుకు సుబ్బరాజుతో పెళ్లి చేయాలనుకుంటాడు. సుబ్బరాజును కలిసిన పూజా అతడి ప్రవర్తనతో షాక్ అయ్యి చివరకు శాస్ర్తీనే చేసుకోవాలని ఫిక్సవుతుంది.
సమాజంలో జరిగే అన్యాయాలపై చిన్నప్పటినుంచి పోలీస్ ఆఫీసర్ మురళీశర్మతో కలిసి ఫైట్ చేస్తుంటాడు డీజే. మురళీశర్మ, బన్నీ కలిసి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా అన్యాయాలు చేసేవాళ్లను చంపేస్తుంటారు. అగ్రి డైమండ్ కంపెనీ ప్రజలను మోసం చేసి 9 వేల కోట్లు దోచుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న డీజే ఈ కుంభకోణం వెనక వున్న రొయ్యల నాయుడును టార్గెట్ చేస్తాడు. నాయుడిని చంపేందుకు డీజే వేసిన ప్లాన్ ఏంటి? అసలు డీజేకు దువ్వాడ జగన్నాథమ్‌కు ఉన్న లింక్ ఏంటి? అన్నది మిగతా సినిమా.
సాధారణంగా అల్లు అర్జున్ క్యారెక్టర్స్ అన్నీ మాస్, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అతని డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్, ఫైట్స్ మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా వుంటాయి. దానికి భిన్నంగా ఈ సినిమాలో బన్ని బ్రాహ్మణుడి గెటప్‌లో కనిపిస్తాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ మార్చుకొని ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. కామెడీని, ఎమోషన్‌ని, సెంటిమెంట్‌ని పర్‌ఫెక్ట్‌గా పలికించగలిగాడు.
హీరోయిన్ పూజా హెగ్డేని పాటలకే పరిమితం చేయకుండా అక్కడక్కడా ఆమె క్యారెక్టర్‌కి ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు. తన అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంది. రావు రమేష్ చేసిన రొయ్యల నాయుడు పాత్ర ఇవివి డైరెక్షన్‌లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో రొయ్యల నాయుడు పాత్రతో దింపేశారు. తండ్రికి ఏ మాత్రం తీసిపోనని విలనీ క్యారెక్టర్‌తో రావు రమేష్ ప్రూవ్ చేసుకున్నాడు. తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మురళీశర్మ, వెనె్నల కిశోర్, శత్రు, సుబ్బరాజులు పాత్రలకు న్యాయం చేశారు.
ఈ చిత్రంలో కథ విషయం పక్కనపెడితే.. సినిమాటోగ్రఫీకి, సంగీతానికి, ఫైట్స్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. అయానంకా బోస్ అద్భుతమైన ఫొటోగ్రఫీ అందించాడు. పర్‌ఫెక్ట్ లైటింగ్‌తో ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించాడు. పాటలు కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అల్లు అర్జున్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. ఇందులోనూ ఆ స్థాయకి తగ్గట్టే ఉంది. ఆ రేంజ్‌ని మించి పాటల్ని పిక్చరైజ్ చేశారు కొరియోగ్రాఫర్లు. రామ్‌లక్ష్మణ్, వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఆడియెన్స్‌ని హండ్రెడ్ పర్సెంట్ థ్రిల్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ హరీశ్ శంకర్ కథ, కథనంలో కొత్తదనం చూపించలేకపోయాడు. పాత్రలను వైవిధ్యంగా మలచిన తీరు ఒకింత ప్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. అర్జున్ హీరోగా చేసిన జెంటిల్‌మెన్ చిత్రంలో బ్రాహ్మణుడిగా కనిపించిన అతని పోకడ డిజె పాత్రలో కనిపించటం ఒకింత ఇబ్బంది అనిపిస్తుంది. అయతే, హీరో పాత్రతో ఎంటర్‌టైన్‌మెంటే ధ్యేయంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టూ అంటూ హీరో పదే పదే చెప్పడం మొదట్లో బాగానే అనిపించినా, అది శృతిమించి బోర్ కొట్టింది.
ఇక సమాజాన్ని బాగుచేయాలనే ఆదేశంతో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా వుండాలన్న ఉద్దేశ్యంతో చిన్నతనం నుంచే మర్డర్లు చేయించాడు డైరెక్టర్. ఓ పిల్లవాడు రివాల్వర్‌తో ఐదుగుర్ని కాల్చి చంపడం, దాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ ఎంకరేజ్ చేయడం ఏమాత్రం సహేతుకంగా అనిపించలేదు. దువ్వాడ జగన్నాథమ్‌గా వంటలు చేస్తూ.. మరోపక్క డీజేగా హత్యలు చేసే ప్రాసెస్‌లో ఎన్నో లాజిక్కులు మిస్సవుతాయ. ముఖ్యంగా ఆ పాత్రలోని గాంభీర్యత ఎక్కడా కనిపించదు.
ఆర్టిస్టులనుంచి తనకు కావాల్సిన పర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో సక్సెస్ అయనా, పాత మోతాదు కథను కొత్తగా నడిపించే ప్రక్రియలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తానికి రొటీన్ కథతో దువ్వాడ జగన్నాథమ్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుందంతే.

-త్రివేది