విశాఖపట్నం

అమెరికా తెలుగు సంబురాలకు వైఎల్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో చికాగోలో నిర్వహించే తెలుగు సంబురాల్లో భాగంగా తెలుగు ప్రేమికుల విభాగం సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర హిందీ సలహా సంఘం సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఆహ్వానం అందింది. కార్యక్రమంలో భాగంగా జూలై 1న జరిగే ‘తెలుగు పునరుజ్జీవనం’ చర్చా గోష్ఠికి ఆయన అధ్యక్షత వహిస్తారు. జూలై 2న ‘మన తెలుగు వికాసం’పై ఆచార్య లక్ష్మీ ప్రసాద్ ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అలాగే జూలై 8న న్యూజెర్సీలో అమెరికా హిందీ సంఘం, ఫ్రాంక్లిన్ స్టార్‌లాక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ‘హిందీ భాష, సంస్కతి’ అంశంపై జరిగే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు. కార్యక్రమంలో అమెరికా పార్లమెంట్ సభ్యుడు ఫ్రాంక్ ఎల్లోన్, భారతీయ రాయబారి రివా గంగూలీ దాస్, అమెరికా అసెంబ్లీ సభ్యుడు రాజ్ ముఖర్జీ పాల్గొంటారు.