విశాఖపట్నం

సమస్యల పరిష్కారం కోరుతూ అర్చకుల భిక్షాటన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 26: అర్చక, ఆలయ సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ జిల్లా (ఉత్తరాంధ్ర) అర్చక సంఘం, నవ్యాంధ్ర అర్చక సంఘం దేవాదాయ,్ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమం సోమవారానికి ఆరో రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా అర్చకులు సిబ్బంది వినూత్నరీతిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు, వాహనదారులు, ముస్లిం సోదరులనుంచి భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ ప్రధానకార్యదర్శి అయిలూరి శ్రీనివాసదీక్షితులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారంతోపాటు దేవాదాయశాఖలో సెక్షన్ 65ఏను అమలు చేయాలన్నారు. హిందు,సంస్కృతి సాంప్రదాయాలు ఆలయాలు, ఆగమాలు రక్షించింపబడాలని ఆయన కోరారు. ఈ నెల 30వ తేదీన అర్జిత సేవలు నిలుపదల చేస్తూ ప్రత్యేక నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు రంగనాధాచార్యులు, మురళీమోహన్, రామచంద్రరావు పలువురు పాల్గొన్నారు.