కృష్ణ

శాంతి, సామరస్యానికి ప్రతీక రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూన్ 26: శాంతి, సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన స్థానిక హాజపేటలోని మక్కామసీదును సందర్శించి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు సర్వదా ఆచరణీయమన్నారు. ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మసీదుల పునర్నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు. మైలవరంలోని ఈద్గా అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరు చేయించటం జరిగిందని, త్వరలో పనులు మొదలు పెట్టటం జరుగుతుందన్నారు.
నెలాఖరులోగా చింతలపూడి టెండర్లు పూర్తి
ఈనెలాఖరులోగా చింతలపూడి ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తి చేయటం జరుగుతుందని, వచ్చేనెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఏడాదిలోగా చింతలపూడి ద్వారా గోదావరి జలాలను ఈప్రాంతానికి రప్పించటం జరుగుతుందన్నారు. గోదావరి జలాలతో ఈప్రాంతంలోని మెట్ట్భూములన్నీ సస్యశ్యామలం కాగలవన్నారు. ఈకార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ముస్లిం నేతలు సుభాని, ఖాజా, కరీమ్‌దాదా తదితరులు పాల్గొన్నారు.