కృష్ణ

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్), జూన్ 26: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం స్థానిక ఉల్లింగిపాలెం ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి రవీంద్రతో పాటు శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య)లు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో వివక్షతకు గురైన ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ఆనందోత్సాహాలతో రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలన్న ఆకాంక్షతో గత మూడేళ్ళుగా చౌక ధరల దుకాణాల ద్వారా రంజాన్ తోఫాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మసీదుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. త్వరలో పేద ముస్లింలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ పవిత్ర ఆశయంతో నెల రోజులు దీక్ష చేసి ప్రేమ, త్యాగం అనే సందేశం అందరూ అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఖాజీ మొహ్మద్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాజా, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.