కృష్ణ

మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 26: మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీని మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు బానిసలై ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని, డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య) మాట్లాడుతూ మాదకద్రవ్యాల కారణంగా నేటి యువత పెడత్రోవ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడేందుకు తగిన అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యాప్తిని ప్రభుత్వం ఓ సవాల్‌గా తీసుకుని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ డా. ఎం మనోహా, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.