హైదరాబాద్

ఒక్కోచోట ఒక్కో వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: మహానగరంలో సోమవారం పలు చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి నగరం మొత్తం మేఘాలు కమ్ముకుపోయినా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి నగరంలో బషీర్‌బాగ్, ఉప్పల్, రామంతాపూర్, సైదాబాద్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. అలాగే సికిందరాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసి చల్లటి గాలులు వీశాయి. చిరుజల్లుల కారణంగా మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాహనదారులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలని పోలీసులు బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. క్షేత్ర స్థాయిలో నేరుగా ట్రాఫిక్‌ను నియంత్రించే వారు లేకపోవటంతో వాహనదారులు మాత్రం ఇష్టారాజ్యంగా ప్రయాణించటం వల్ల ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు.