హైదరాబాద్

పాఠ్యాంశంగా ఎమర్జెన్సీ రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూన్ 26: భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఏర్పడ్డ ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా చేర్చాలని ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం మదీనగూడలో ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సుకు ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన పదవిని కాపాడుకోవడానికి న్యాయస్థాన ఉత్తర్వులను ధిక్కరించి ఎమర్జెన్సీ విధించిందని విమర్శించారు. ఇందిరాగాంధీ 1975 జూన్, 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించి భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను కాలరాసిందని ధ్వజమెత్తారు. జాతీయవాదులైన మహా నేతలు మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణన్, అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కె అద్వానీతో పాటు అనేక నేతలను ఇందిర జైల్లో పెట్టించిందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలు సృష్టించిన అరాచకాలు చరిత్ర పుటల్లో లేకుండా చేశారని ఎమ్మెల్సీ తెలిపారు. ఇందిర పాలనలోని ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రజాస్వామ్య హత్యగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అభివర్ణించారు. బిజెపి రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేంరాజ్, శేరి నర్సింగరావు, అంజన్‌కుమార్, వినయ, రాచమళ్ళ నాగేశ్వర్‌గౌడ్, నూనె సురేందర్, రవీంద్రప్రసాద్ దూబే, చింతకింది రవీందర్‌గౌడ్, పోరెడ్డి బుచ్చిరెడ్డి, వసంత్‌కుమార్, నందనం విష్ణుదత్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్‌రెడ్డిని ఎమ్మెల్సీ సత్కరించారు. అనంతరం కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు పార్టీలో చేరారు.