హైదరాబాద్

సినారెకు ‘స్వర నీరాజనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: తెలుగు సినీ సాహిత్య కృషీవలుడు డాక్టర్ సి.నారాయణరెడ్డిని స్మరించుకుంటూ ఆయన రాసిన గీతాలను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో ఆమని సారధ్యంలో గాయకులు రమ్యంగా ఆలపించారు. ‘శివరంజని నవరాగిణి’ అనే గీతంతో ప్రారంభించి సినారె మొదటి గీతం ‘నన్ను దోచుకుందవటే...’ అనే గీతాన్ని వెంకటరావు, ప్రవీణ్, సుభాష్, ఆమని తదితరులు గానం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినారె స్వర నీరాజనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య మాట్లాడుతూ డా.సి.నారాయణరెడ్డి సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటూ ఆయన సాహిత్యంలో పాడిన గీతాలతో గాయకులలో చిరంజీవిగా వుంటారని అన్నారు.
శృతిలయ సంస్థ తరఫున కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రోశయ్య తదితరులను శాలువా, మెమెంటోలతో సత్కరించారు. సీల్‌వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు, ఆర్.ఎన్.సింగ్, జె.బి.రాజు, బొమ్మకంటి మురళి, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బిఎస్ రాములు తదితరులు పాల్గొని సినారె సాహిత్యాన్ని గుర్తు చేసారు. ‘గోరంత దీపం కొండంత వెలుగు’ అనే శీర్షికన డా.సినారెకు స్వర నీరాజనం సమర్పించిన ఈ కార్యక్రమాన్ని గాయని ఆమని నిర్వహించారు.