ప్రకాశం

ఘనంగా రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 26 : జిల్లావ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండగను ముస్లింలు జరుపుకున్నారు. రంజాన్ పండగ సందర్భంగా జిల్లాలోని మసీదులన్నీ విద్యుత్‌కాంతులతో కళకళలాడాయి. పవిత్ర రంజాన్‌మాసం సందర్భంగా జిల్లాలోని ముస్లింలు మసీదులకు వెళ్లి పవిత్రంగా ప్రార్థనలు చేశారు. సోమవారం ఉదయం నుండే ముస్లింలతో మసీదులన్నీ కళకళలాడాయి. ముస్లింలకు రంజాన్ పండగ సందర్భంగా హిం దువులు ప్రత్యే క శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని హిందు, ముస్లిం బాయ్‌బాయ్ అంటూ మతసామరాస్యాన్ని చాటుకున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు అన్ని ప్రాంతాల్లోని మసీదుల్లో ఆయా ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు వెళ్లి అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఈద్గా వద్ద వేలాదిమంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఈద్గాకు జిల్లా శాసనమండలి సభ్యుడు మా గుంట శ్రీనివాసులరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముస్లిం సోదరుడు మాదిరిగానే మాగుంట అన్నివర్గాలతో మాట్లాడుతూ అందరితో మమేకం అయ్యారు. ఈకార్యక్రమంలో మాగుంటతోపాటు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్, ఒంగోలు డిఎస్‌పి జి శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారులు సైతం నవాజ్‌కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ సందర్బంగా రాష్ట్రప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌తోఫాను అందచేసింది. ఈతోఫాను ప్రజాప్రతినిధులు ముస్లింలకు అందచేయటం జరిగింది. అదేవిధంగా రంజాన్ పండగ సందర్బంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రుచికరమైన హాలీమ్‌ను తయారుచేశారు. ఈ హలీమ్‌కు ఒంగోలులో మంచిగిరాకి ఏర్పడింది. రంజాన్ పండగ సందర్భంగా ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేపట్టింది. మసీదుల వద్ద మఫ్టీలో పోలీసులను సైతం జిల్లా పోలీసుయంత్రాంగం వినియోగించింది. రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, హిందూమతానికి చెందిన ప్రజానీకం శుభాకాంక్షలు తెలిపింది. రంజాన్ పండగ సందర్భంగా భారీగా బట్టల వ్యాపారంతోపాటు వివిధ రకాల వ్యాపారులు సాగాయి.