ప్రకాశం

జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 26: జిల్లా నూతన ఎస్‌పిగా సత్య యేసుబాబు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా ఎస్‌పిగా పనిచేసిన డాక్టర్ త్రివిక్రమవర్మ ఇటీవల బదిలీపై శ్రీకాకుళం ఎస్‌పిగా వెళ్లటంతో ఆయన స్థానంలో బదిలీపై జిల్లా ఎస్‌పిగా వచ్చిన సత్య యేసుబాబు ఆ మేరకు సోమవారం సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌పి యేసుబాబు మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎంతటి వారైనా సహించేది లేదని ఎస్‌పి హెచ్‌రించారు. పోలీసుస్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాధగా వ్యహారించడంతోపాటు వారికి నూరుశాతం న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి రాజీపడనన్నారు. కానిస్టేబుల్ నుండి ఎస్‌పి వరకు అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిందేనన్నారు. బాధితుని సమస్య పరిష్కారం పట్ల పోలీసు పనితీరు ఎలా ఉందో అన్న విషయాన్ని చూస్తానని అన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ రాజకీయ జోక్యం వలన పోలీసుస్టేషన్లకు వచ్చే బాధితులకు సరిగా న్యాయం జరగటం లేదని, ఈ విధానం పట్ల మీరు ఎలా వ్యవహరిస్తారని ఎస్‌పిని కోరగా స్పందించిన ఎస్పీ సత్య యేసుబాబు మాట్లాడుతూ పోలీసుస్టేషన్ల వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగితే వారు రాజకీయ నాయకులను ఆశ్రయించరన్నారు. పోలీసుస్టేషన్ల వద్దకు వచ్చే బాధితుల పట్ల పోలీసుసిబ్బంది బాధ్యతగా వ్యహరించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. అదే విధంగా జిల్లాలోని పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులు అందరిని సమన్వయం చేసుకుని ప్రజల కేసులను సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్‌పి అన్నారు. అదే విధంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని, దొంగతనాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. కడప జిల్లా ఎస్‌పిగా పనిచేసిన అనుభవంతో జిల్లా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తానని జిల్లా ఎస్‌పి అన్నారు. పోలీసు శాఖకు అవసరాన్ని బట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాని నూతనంగా జిల్లా ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన సత్య ఏసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఎస్‌పి ఉదయరాణి, ఎఆర్ ఎఎస్‌పి టి శివారెడ్డి, పిటిసి ప్రిన్సిపాల్ చాందూ నాయక్, వివిధ సబ్‌డివిజన్ల పోలీసుస్టేషన్ల డిఎస్‌పిలు తదితరులు పాల్గొన్నారు.