శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 26: తెలుగుదేశం ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో భాగంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కూడా అదే రోజు అదే నియోజకవర్గంలో నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా మంత్రి పి నారాయణలు వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించి తీర్మానించారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి వివరించారు. జూలై 4న మొదటి బహిరంగ సభను సర్వేపల్లి నియోజక వర్గంలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పార్టీ సభ్యత్వ నమోదుతో ప్రారంభమై విశాఖపట్నంలో జరిగిన మహానాడులో జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబునాయుడు ఎన్నిక కావడం పూర్తయిందన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు సభ్యత్వ నమోదు రెండో స్థానం రావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పార్టీ నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం నూతన గ్రామ మండల కమిటీలు ప్రతినెల 9న గ్రామ కమిటీ సమావేశాన్ని, 14వ తేదీన మండల కమిటీ సమావేశాన్ని, 18వ తేదీన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి గురించి చర్చించి రానున్న రెండు సంవత్సరాల కాలంలో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించారు. రామయ్యపట్నం, దుగరాజపట్నం పోర్టులను ఏర్పాటు చేయాలని, కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, కార్మికులకు చెల్లించాలని బకాయిలను చెల్లించేందుకు మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తీర్మానించారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజక వర్గంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆయన రానున్న పరిశ్రమలను మెట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జువ్వలదినె్నలో షిప్పింగ్ హార్బర్‌ను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని, కోవూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, నియోజక వర్గంలో షిప్పింగ్ జెట్టీస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపారు. కనిగిరి రిజర్వాయర్‌లో పూడిక తీయించాలని, కావలి కెనాల్‌లో నిలిచిపోయిన పనిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, వెంకటగిరిలోని కైవల్య నదిలో పూడిక తీయాలని తరచూ వరదలకు కోట, వాకాడు, గూడూరు స్వర్ణముఖి బ్రిడ్జిలను మరమ్మతులు చేయాలని, పంబలేరు వాగులో పొర్లుకట్టలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. వెంకటగిరిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. కావలిలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించినట్టు వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఎఎఫ్‌సిఓఎఫ్ చైర్మన్ కొండూరు పాల్‌శెట్టి, జడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.