హైదరాబాద్

పాదచారులకు భద్రత ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీ కారణంగా పాదచారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా మెట్రోరైలు పనులు జరుగుతున్న పలు ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు పాదచారులు నానారకాల కష్టాలు పడుతున్నారు. ఇప్పటి వరకు రోడ్డు దాటుతూ ఎంతో మంది మృత్యువు బారిన పడిన ఘటనల నేపథ్యంలో పాదచారుల భద్రతపై ఎన్నో ప్రకటనలు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలు ప్రస్తుతం అవన్నీ మరిచిపోయాయి. వాహనదారుల నుంచి చలానాలువసూలు చేసేందుకే ట్రాఫిక్ పోలీసులు, ఆదాయమార్గాల ద్వారా ఖజానాలో కోట్లరూపాయలను నింపుకునేందుకు మాత్రమే బల్దియా అధికారులు పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నగరంలో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవల్సిందే! ఈ క్రమంలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్య కారణంగా పాదచారులు భద్రత కోసం ఇప్పటికే కొన్ని ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసినా, వాటిలో దిల్‌సుఖ్‌నగర్ మినహా మిగిలిన దేన్నీ కూడా ఆశించిన స్థాయిలో ప్రజలు వినియోగించుకోవటం లేదు. లంగర్‌హౌజ్ సమీపంలోని టిపూఖాన్ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ గానీ, ఫుటోవర్ బ్రిడ్జి గానీ నిర్మించాలన్న మిలటరీ అధికారుల వినతిమేరకు మహానగర పాలక సంస్థ అధికారులు ఫుటోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అపుడే నిత్యం రద్దీగా ఉండే నిమ్స్, మహావీర్ ఆసుపత్రుల వద్ద కూడా ఫుటోవర్ బ్రిడ్జిలు మంజూరైనా నేటికి పనులు ప్రారంభం కాలేదు. ఈ రెండు ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులు మందులు, టీ, టిఫిన్ల కోసం నిత్యం రోడ్డు దాటుతుంటారు. ఇప్పటి వరకు కొందరు ప్రమాదాల బారిన పడి మృత్యువు పాలు కాగా, మరికొందరు గాయాలపాలయ్యారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో పాదచారుల కోసం 70 ఫుటోవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి ప్రతిపాదనలు సిద్ధ్దం చేసినా, అందులో కొత్తగా కనీసం ఏడు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. మరికొన్నింటి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నగరంలో రద్ధీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వంద వరకు ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసి వాటికి ఇరువైపులా లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా, ప్రస్తుతం అవి మూలన పడేశారు. కింద నుంచి దాదాపు ఇరవై అయిదు అడుగుల పై వరకు నడిచేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధుల సౌకర్యార్థం లిఫ్టులను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు అర్థాంతరంగా బ్రేక్ పడింది.
స్థల సేకరణకు సమస్య
రద్ధీగా ఉండే ప్రాంతాల్లో లిఫ్టులతో కూడిన ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణే ప్రధాన సమస్యగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని చెబుతున్న అధికారులు నేటికీ ఒక్క ఫుట్‌వర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. క్షేత్ర స్థాయిలో స్థల సేకరణ సమస్యలు తలెత్తితే రోడ్డుకిరువైపులా ఉన్న జిహెచ్‌ఎంసికి చెందిన ఫుట్‌పాత్‌పై పిల్లర్లను ఏర్పాటు చేసి వాటికి లిఫ్టులను అమర్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించి ఏళ్లు గడిచిన ప్రయత్నం ఆచరణ సాధ్యం కాకపోవటం గమనార్హం.

విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఖైరతాబాద్, జూన్ 27: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆలయంలో జరిగే కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన నాలుగేళ్ల పసి బాలుడిని మృత్యు ఒడిలోకి తీసుకువెళ్లింది. సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్ మక్తాలోని రాజ్‌నగర్‌లో నివసించే యాదవ్ లాల్ మనవడు భవేష్ రాజ్(4). తండ్రి మృతిచెందడంతో తాత వద్దే ఉంటున్నాడు. బిఎస్ మక్తాలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం కల్యాణోత్సవ వేడుకలను నిర్వహించారు. వీటిని వీక్షించేందుకు వచ్చిన బాలుడికి ఆలయ నిర్వాహకులు డిజె నిర్వాహణకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన బంధువులు, స్థానికులు హుటాహుటిన వైద్యం కోసం సమీపంలోని వివేకానంద హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందాడని నిర్ధారించారు. కొడుకు మృతిచెంది తీవ్ర నైరాశ్యంలో ఉన్న యాదవ్ లాల్ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆలయ నిర్వాహకుల నిర్లక్షమే తన మనవడిని బలి తీసుకుందని, కారకులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు
అనుమతిలేని డిజేతో..
ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయం నిర్వాహకులు ఏర్పాటు చేసిన డిజేతోనే తన మనవడు మృతిచెందాడని తాత యాదవ్ లాల్ కన్నీరుమున్నీరయ్యారు. నగరంలో డిజేలు ఏర్పాటు చేయాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆలయ నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడంతో అభం, శభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే వందేళ్లు నిండిపోయాయి. బాలుడు మృతికి కారకులపై బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆలయ నిర్వాహకుడు జానకి రామ్ అల్లుడు నాగరాజు, డిజె నిర్వాహకులు శేఖర్, సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా డిజె ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని పంజాగుట్ట ఇన్‌స్పెపెక్టర్ రవీందర్ హెచ్చరించారు.