Others

ఆటే ప్రాణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటలంటే చిన్నపిల్లలకు మక్కువ. ఆంక్షలు విధించకుండా ఆడనిస్తే వారిలో ఉల్లాసం.. ఉత్తేజం పెరుగుతుంది. ఆ ఉత్సాహమే వారిని ఉన్నతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. పదిహేడేళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్ రిద్ధీ వివేక్ పంగారే కూడా చిన్న ప్పటి నుంచి బాల్‌ను బలంగా కాలితో తనే్నది. కోచ్ గోపినాథ్ దీన్ని గుర్తించి ఆమెను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాడు. ఇదే ఆమెను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మార్చేసింది. ఆ ఆటే మీద ఉండే మక్కువే జాతీయ స్థాయి ఇండియన్ టీమ్‌లో ఆడేటట్లు చేసిందని వివేక్ అంటుంది. వివేక్ పంగారే కాలితో బలంగా బాల్‌ను తన్నితే అది ఎలా వెళుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవలనే జరిగిన ఊర్జా సిఎపిఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నది. తెలంగాణ తరపున ఆడిన ఈ చిన్నారి మొదటి బహుమతి గెలుచుకుని విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన బాలిక వివేక్ మాత్రమే. తెలంగాణ తరపున ఆడిన తొలి జాతీయ స్థాయి పోటీల్లోనే తన సత్తాచాటింది. ప్రధాని నరేంద్ర మోదీ యువ ఫుట్‌బాల్ ప్లేయర్స్‌కు ఇస్తున్న ప్రోత్సాహంతోనే ఎంతోమంది యువ ఆటగాళ్లు ముందుకువస్తున్నారు. వీరిలో వివేక్ ఒకరని చెప్పవచ్చు. గాయపడటం వల్ల ఈ టోర్నమెంట్ ఇతర రౌండ్లలో వివేక్ ఆడలేకపోయింది. ప్రోత్సాహం ఉంటే పసిడి పతకాలు సాధించటం ఏమంత కష్టం కాదు. మెదక్ ఎస్పీ చందనాదీప్తి ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఈ టీమ్‌లో పాల్గొని ఆడగలిగానని చెబుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడే ఫుట్‌బాల్ ఆట మీద మక్కువ ఏర్పడింది. ఆ ఆటతో పాటు రన్నింగ్, జిమ్మాస్టిక్‌లోనూ శిక్షణ తీసుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ ఉమెన్ కాలేజీలో చదువుతున్న రిద్ధీ చెన్నైలోని లాలాజీ మెమోరియల్ ఒమెగా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నపుడు కోచ్ గోపినాథ్ అందించిన ప్రోత్సాహంతో ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టింది. అపుడే తమిళనాడు తరపున పలు రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్న్‌మెంట్లలో పాల్గొంది. కొనే్నళ్ల క్రితం హైదరాబాద్‌కు రావటంతో ఇక్కడ కూడా ఆ ఆట ఆమె జీవితంలో భాగమైంది.
ఆడపిల్లలూ బాగా ఆడుతున్నారు..
ఫుట్‌బాల్ అంటే మగవాళ్ల ఆట అనే నానుడి ఉండేది. కాని నేడు ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అందుకే నేడు ఆడపిల్లలే మగపిల్లల కంటే బాగా ఆడుతున్నారంటుంది రిద్ధీ వివేక్. తాను కూడా అండర్-19 టోర్న్‌మెంట్‌లో పాల్గొన్నానంటే ఇదే స్ఫూర్తి అని చెబుతుంది. చదువుతో పాటు శిక్షణను కూడా చాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళితేనే ఈ ఆటలో రాణించగలుగుతారని చెబుతూ.. వారంలో మూడు రోజుల పాటు కొండాపూర్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటుంటుంది. ఖాళీ సమయంలో డ్యాన్స్ తరగతులకు సైతం వెళుతుంది. ఆటలకంటే చదువుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిల్లలకు నూరిపోసే తల్లిదండ్రులకు రిద్ధీ వివేక్ ఓ కనువిప్పు. ఆటను, చదువును బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది.