Others

ఉపాధ్యాయుడంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి రాష్ట్రం తన ఆదాయాన్ని పెంచుకుంటేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు జరుగుతాయి. తగినంతగా ఆదాయం లే కుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తే లోటు బడ్జెట్ అనివార్యమవుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మారాలంటే ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా పెంచే విధంగా సరైన మార్గాలు వెతకాలి. సామాన్యునిపై భారం పడకుండా పొదుపుగా ఖర్చు చేసుకునే అలవాటు చేయాలి. అప్పుడే సంక్షేమ కార్యక్రమాల పథకాల ఫలితాలు సామాన్యునికి అందగలుగుతాయి. సంక్షేమ కార్యక్రమాలపై పెట్టిన ఖర్చుకు జవాబుదారీతనం లేకపోవటంతో అవి ఎవరికి అందాలో వారికి అందటం లేదు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై జవాబుదారీ తనాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు ఖర్చు చేస్తేనే పేద ప్రజానీకంలో విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగంపైన ప్రభుత్వం తక్కువ ఖర్చేమీ చేయటం లేదు. విద్యా ప్రమాణాలను పెంచటానికి ఉపయోగపడితేనే ఏ పథకమైనా ‘ప్రొడెక్టివ్’గా మారుతుంది. అది జరగాలంటే ఉపాధ్యాయులు తమ పనిని ప్రాఫిటబుల్‌గా చేయాలి. అంటే ఉపాధ్యాయులలో సేవాభావం ఉండాలి. విద్యారంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. కొత్తగా జ్ఞానాన్ని అవగాహన చేసుకునే స్థాయికి ఉపాధ్యాయ వర్గం ఎదగాలి. వారికి అర్థం అయితే సరిపోదు, తగిన శిక్షణ కూడా ఇవ్వాలి. కొత్త జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలంటే మొదట ఉపాధ్యాయులు దానిని సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవడాన్ని ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయగలిగితేనే అది ఇతరులకు బోధించటానికి దోహదపడుతుంది.
శిక్షణ పొందిన జ్ఞానాన్ని మూసలో పోయటం కాదు. విద్యార్థులలో ఉన్న వైరుధ్యాలను, ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని గమనించి అధ్యాపకుడు విచక్షణా జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించేటప్పుడు సులభతరం చేయాలి. ఉపాధ్యాయుని జ్ఞానం పెరగటం ఎంత ప్రధానమో విద్యార్థి ఆస్వాదించేలా చేయటం అంత కష్టతరమైనది. ఉపాధ్యాయుల్లో ‘లెర్నింగ్ ప్రాసెస్’ (నేర్చుకునే పద్ధతి) పెరగాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఈ ఫలితాలు అందరికీ అందాలి. దానికి సామాజికీకరణ కూడా జరగాలి. ఉపాధ్యాయుడు ప్రొఫెషనల్‌గా ఎదిగే విధంగా ప్రణాళికలు ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిని సేవారంగంగా మలచాలి. కొత్త జ్ఞానాన్ని అనునిత్యం అవగాహన చేసుకోవాలి. దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి. విద్యార్థికి జ్ఞానాన్ని అందించేటప్పుడు దాన్ని జడ్జి చేయగలిగే స్థాయికి ఉపాధ్యాయుడు ఎదగాలి. అంటే ఆ జ్ఞానాన్ని ఎప్పుడు అందించాలి? ఎలా అందించాలి? అన్నది వెతకాలి. లెర్నింగ్ అన్నది కొందరికే కాదు అది అందరిదీ. ఇవన్నీ చేయగలిగితే ఉపాధ్యాయులు ఇంజనీర్లు, డాక్టర్లుగా వృత్తి నైపుణ్యత పొందాలి. ఉపాధ్యాయ వృత్తి డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది కాదు. ఉపాధ్యాయుల మానసిక ప్రవృత్తిలోనూ మార్పు సాధ్యమైతేనే వారు వృత్తికి న్యాయం చేయగలుగుతారు.

-చుక్కా రామయ్య