రుచి

గోధుమ పిండితో కొత్త రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమ లు బలవర్ధకమైన ఆహారం. అన్ని వయసులవారికి ఈ ఆహారం మంచిదే. ఈ పిండితో సరికొత్త వంటలు చేస్తే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మార్కెట్లో రకరకాల గోధుమ పిండి లభిస్తున్నా మంచి బ్రాండ్‌ది వాడితే మేలు.

గోధుమ దోశ
కావలసిన పదార్ధాలు :గోధుమ పిండి-2 కప్పు లు, నీరు-మూడుకప్పులు, నూనె- ఒక పెద్ద చెంచాడు, సన్నగా తరిగిన టమాటాలు-1 పెద్దది, సన్నగా తరిగిన ఉల్లిపాయలు-1 పెద్దది, సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, సన్నగా తరిగిన కొత్తిమీర-2 పెద్ద చెంచాలు, సన్నగా తరిగిన అల్లం-1 చిన్న చెంచాడు, జీలకర్ర-అర చిన్న చెంచాడు, ఆశీర్వాద్ ఉప్పు-రుచికి తగినంత
తయారుచేసే విధానం: దోశపిండిని తయారుచేసుకోవడానికి ఆశీర్వాద్ గోధుమ పిండిని, నీటిని ఉండలు లేకుండా బాగా కలపాలి. ఉల్లి ముక్కలు, టమాటా ముక్క, కొత్తిమీర, అల్లం, జీలకర్ర మరియు ఉప్పు ఈ మిశ్రమానికి చేర్చాలి. దోశ పిండి దోశలు వేయడానికి అనువుగా గరిటె జారుగా వుండేలా చూసుకోండి. ఒక నాన్‌స్టిక్ దోశ ప్యాన్‌కి నూనెరాసి బాగా వేడెక్కనివ్వాలి. గరిటెడు దోశపిండిని ప్యాన్‌పై దోశలా వేయాలి. దోశపిండి చక్కగా విస్తరించేలా ప్యాన్‌పై గరిటె వెనుక భాగంతో తిప్పాలి. ఒకవైపున బాగా ఎర్రగా కాలి, దోశపిండి పూర్తిగా ఉడికిపోయే వరకు వుంచాలి. కొబ్బరి చెట్నీతో పిల్లలకి తినిపించండి. చక్కగా రుచిగా ఉంటుంది.

ఆలూ పరాఠా
కావాల్సిన పదార్ధాలు :గోధుమపిండి-200 గ్రాములు, బంగాళా దుంపలు-2పెద్దవి, తరిగిన ఉల్లిపాయలు-1 పెద్దది, ఆవాలు-1 చిన్న చెంచాడు, జీలకర్ర-1 చెంచాడు, ఆశీర్వాద్ ఉప్పు, నెయ్యి-రుచికి తగినంత
తయారుచేసే విధానం: గోధుమ పిండి, ఉప్పు, నీరుపోసి గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. పది నిముషాలు ఉంచాలి. బంగాళా దుంపలు ఉడికించాలి. చల్లారాక తొక్కలు తీసి చిదిమి వుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి, జీలకర్ర, ఆవా లు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్క లు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో చిదిమి ఉంచుకున్న బంగాళా దుంపలు, ఆశీర్వాద్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండిని 4 సమభాగాలుగా చేయాలి. ఈ బంగాళాదుంపల మిశ్రమాన్ని లోపల పూర్ణంలా ఉంచి మూయాలి. మీకు నచ్చినంత మందంగా వీటిని వత్తుకుని వేడిగా వుండే పెనంపై ఆశీర్వాద్ నేయి వేసి కాల్చుకోవాలి. టిఫిన్ ప్యాక్ చేయడానికి ఇవి సిద్ధం.

పూరీ-బంగాళాదుంపల కూర
కావాల్సిన పదార్ధాలు, బంగాళా దుంపల కూరకి, బంగాళా దుంపలు-3 పెద్దవి, తరిగిన ఉల్లిపాయలు-2 పెద్దవి, తరిగిన టమాటాలు-మీడియం సైజుది, సన్నగా తరిగిన అల్లం-చిన్న చెంచాడు, సన్నగా తరిగిన వెల్లుల్లి-1 పెద్ద చెంచాడు, చీల్చిన పచ్చిమిర్చి-3 మిర్చీలు, కరివేపాకు-5 ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర-2 పెద్ద చెంచాలు, ఆవాలు-చిన్న చెంచాడు, జీలకర్ర-1 చెంచాడు, ఇంగువ- చిటికెడు, పసుపు పొడి-అర చిన్న చెంచా, నూనె-5 చిన్న చెంచాలు, ఉప్పు-రుచికి తగినంత
పూరీలకి: గోధుమ పిండి-2 కప్పులు, నీరు-1 కప్పు, ఆశీర్వాద్ ఉప్పు-1 పెద్ద చెంచాడు. నూనె-1 పెద్ద చెంచాడు
తయారుచేయు విధానం: గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు , నూనె అన్నీ చేర్చి పూరీల పిండి కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. బంగాళా దుంపల కూరకి, బంగాళా దుంపలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి ఉంచుకోవాలి. వాటి తొక్కలు తీసి ముక్కలు కోసి ఒక పాత్రలో ఉంచుకోవాలి. ఒక లోతైన ప్యాన్ లేదా కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటనాడనివ్వాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంగువ ఇంకా ఆశీర్వాద్ పసుపు వేయాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి, మంట చిన్నగాపెట్టి ఉడికించుకోవాలి. ఇక బంగాళా దుంప ముక్కలు వేసి అందులో రెండు కప్పుల నీరుపోయాలి. కొన్ని బంగాళా దుంప ముక్కలు చితికి, గ్రేవీగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. పూరీల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి అది వేడెక్కాక గుండ్రంగా వత్తుకున్న పూరీలను నూనెలో వేసి అవి పొంగి, బంగారు రంగుకు వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పూరీలు, బంగాళాదుంపల కూరని టిఫిన్ బాక్స్‌లో ప్యాక్ చేసేయండి.

ఓనామ్ అరటి
పండు పూరీ
కావలసిన పదార్ధాలు: పిండి-200 గ్రాములు, ఉప్పు-రుచికి తగినంత, బాగా పండిన చిన్న అరటిపండ్లు-5 పండ్లు, వాము-1 చిన్న చెంచాడు, తేనె-1 పెద్ద చెంచాడు.
తయారుచేసే విధానం: గోధుమపిండి, ఉప్పు, వాము, నీరు పోసి గట్టిగ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొంతసేపు పక్కన పెట్టాలి. పిండిని ఆరు సమభాగాలుగా చేయాలి. వత్తుకున్న గుండ్రటి రొట్టెను మధ్యలోకి కోసి వుంచుకోవాలి. కడాయిలో నూనెపోసి అది వేడెక్కాక ఈ పూరీలను పొంగేలా ఎర్రగా వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కోసిన అరటిపండ్లు, తేనె మిశ్రమాన్ని ఈ పూరీలో స్ట్ఫ్ చేయాలి. వీటిని టిఫిన్‌కి చక్కగా ప్యాక్ చేయాలి.

కూరగాయల పరాఠా
కావలసిన పదార్ధాలు: గోధుమ పిండి-200 గ్రాములు, ఆవాలు,జీలకర్ర-1 చెంచాడు, తరిగిన కరివేపాకు-15 ఆకులు, తరిగిన ఉల్లిపాయ- 1పెద్దది, తరిగిన టమాటాలు-2 మీడి యం సైజువి, తరిగిన క్యారెట్లు- 1 మీడియం సైజుది, తరిగిన బీన్స్-60 గ్రాములు, పసుపు-1 పెద్ద చెంచాడు, తరిగిన అల్లం-1 చిన్న చెంచాడు, తరిగిన వెల్లుల్లి-1 పెద్ద చెంచాడు, తరిగిన కొత్తిమీర-2 పెద్ద చెంచాలు, గరం మసాలా-1 పెద్ద చెంచాడు, ఉప్పు-రుచికి తగినంత, నెయ్యి-100మిలీ
తయారు చేసే విధానం : గోధుమ పిండి, ఉప్పు, నీరు పోసి గట్టిగా పిండిని కలుపుకోవాలి. పిండిని నాలుగు సమభాగాలుగా చేయాలి. ఈ ఉండలను మడిచి వత్తి అవి పలుచని రేకుల్లా అయ్యేలా వత్తుకుని, వేడి పెనం మీద నెయ్యి వేసి కరకరలాడేలా కాల్చుకోవాలి. కడాయిలో నూనెవేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దను చేర్చి, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తరిగిన టమాటా, ముం దుగా ఉడికించి ఉం చుకున్న కారెట్లు, బీన్స్ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. మసాలా కూడా చేర్చి ఉడకనివ్వాలి. పరాఠాలను పొడవుగా కత్తిరించుకుని కూర మిశ్రమంలో వేయాలి. పైన తరిగిన కొత్తిమీర చల్లి, నిమ్మకాయ రసం పిండి డబ్బాలో ప్యాక్ చేయాలి.