డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమానానికి ఎదురైన ప్రమాదం గురించి అక్కడి వాళ్లందరికీ తెలిసింది. వెంట్రుకవాసిలో తప్పిపోయిన ప్రమాదం అందరిని భయభ్రాంతులకు లోను చేసింది.
వౌళి వెన్నుమీద చేత్తో రాస్తూ ‘‘నేను బాగానే ఉన్నాను. ఐ యామ్ ఓకె. ఐ యామ్ ఓకె’’ అన్నాను.
నా భుజాలు వదిలేసి, బరువుగా ఉన్న బాగ్ అందుకుంటూ నా చూపులు తప్పించుకోవాలని ప్రయత్నించాడు. తడి తడిగా అయిన వాడి కళ్ళు నా దృష్టిని దాటిపోలేదు.
నా దృష్టిలోనే కాదు, పక్కనే నుంచున్న తేజ దృష్టిలో కూడా పడింది. ఆ అమ్మాయి అంతకంటే అదేం చూడనిదానిలా ఎదురుగా చూస్తూ మనం అటు వెళ్ళాలనుకుంటాను అంది.
ఆ అమ్మాయి వంక చూచాను. ఫొటో చూచి ఉండటంతో పరిచయంగానే కనిపించింది. కళ్ళతోనే విష్ చేసి నమస్తే అంది. వౌళి వంక చూడనట్లుగానే నిలబడిపోయింది.
ఆ క్షణంలో ఆ అమ్మాయిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. విచక్షణ ఉన్న అమ్మాయే! లేకపోతే ఏ మగాడికి మాత్రం పెళ్లన్నా అవ్వకుండా తన కళ్ళల్లో నీళ్ళు తిరగడం, కాబోయే భార్య చూడటానికి ఇష్టపడతాడు.
తేజ వంక చూచాను. ఫోటోలో కంటే అందంగా కనిపించింది. వౌళి పెళ్లి చేసుకుందామని నిశ్చయం చేసుకోగానే ఆ అమ్మాయి ఫోటో, వివరాలు అన్నీ పంపించాడు. సన్నగా, పొడుగ్గా, స్కైబ్లూ చుడిదార్, గాలికి ఎగురుతున్న వదిలేసిన జుట్టు, నుదుట చిన్న బొట్టు, సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉంది.
ఫొటో వంక తదేకంగా చూస్తున్న నన్ను చూస్తూ, వదిన ‘‘ఎలా ఉంది కాబోయే కోడలు?’’ అడిగింది.
‘‘బావుంది. కానీ, వౌళి పక్కన కొంచెం తక్కువే’ అన్నాను.
వదిన పక్కున నవ్వుతూ ‘‘అత్త కళ్ళతో చూడకు, అమ్మ కళ్ళతో చూడు’’ అంది.
ఆ మాటలు గుర్తుకు రాగానే పెదిమలమీదకు చిరునవ్వు వచ్చింది నాకు తెలియకుండానే.
అప్పుడే కాస్త తేరుకుని, మామూలుగా అవుతున్న వౌళి అడిగాడు ‘‘ఏమయిందని?’’
‘‘ఏం లేదు’’ అని తల ఊగించాను.
‘‘మనసులో చెలరేగే భావాలు మొహంమీద కనిపిస్తాయి తెలుసా?’’ అన్నాడు. ఎప్పుడో విన్న మాటలు, ఎంతో పరిచయంగా వినిపించింది ఆ కంఠం. ఉలిక్కిపడ్డట్టు చూచాను. వౌళి నా వంకే చిరునవ్వుతో చూస్తున్నాడు.
ఆ నవ్వే! ఓ మై గాడ్! నాకు భగవంతుడిమీద కోపం ఒక్క విషయంలోనే! ఎన్నాళ్ళుగానో మరచిపోవాలని ప్రయత్నిస్తున్న మొహాన్ని మాత్రం మరచిపోనీయదు వౌళి నవ్వు. అచ్చంగా రఘురాం నవ్వుతున్నట్లే ఉంటుంది. దేవుడికి ఎందుకు నామీద ఇంత కక్ష? ఏం చేవానని? ఇలా ఎందుకని రఘుని నా ఆలోచనలోంచి తరిమేయకుండా ఆపుతాడు.
నిజానికి వౌళి అమెరికా వెళ్లిపోయాక నా మనసు చాలా ప్రశాంతత పొందింది. గతించని గతం కొంచెం మరుగున పడిపోయింది. పదే పదే గుర్తుకురావాల్సిన అవసరం అడుగున పడింది.
కానీ, మళ్లీ ఇవాళ రాగానే అవే మాటలు, అదే నవ్వు, ఒక్కసారిగా నిట్టూర్చాను.
‘‘ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం’’ అన్నాను. మరేం అనుకున్నాడో రెట్టించలేదు.
‘‘నువ్వెళ్లి కారు తీసుకురా! నేను, ఆంటీ లగేజ్ పట్టుకొస్తాం. టైం సేవ్ అవుతుంది’’ అంది తేజ ఇంగ్లీష్‌లో.
తల ఊగించి వెళ్లిపోయాడు వౌళి.
కార్ రాగానే లగేజ్ అంతా డిక్కీలో పెట్టి ముందు తలుపు తెరిచింది ఎక్కమన్నట్లు.
‘‘నువ్వు కూచో, నేను వెనక కూర్చుంటాను’’ అంటూ వెనక డోర్ తెరవబోయాను.
‘‘్ఫరవాలేదు. వౌళి పక్కన కూర్చోండి’’.
‘‘లేదు, లేదు. నువ్వు కూర్చో అంటూ వెనక ఎక్కేశాను’’.
వౌళి, తేజ ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ కారు ఎక్కారు. ఆ మహాపట్నంలో ఒక్కొక్క ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ వచ్చినపుడల్లా వౌళియో, తేజయో ఏదో ఒకటి చెప్పి చూపిస్తున్నారు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దూరంగా కనిపించగానే కుతూహలంగా వంగాను. ఆ స్టాట్యూ గురించి చాలా చదివాను. స్వాతంత్య్రానికి చిహ్నం. ఒక టార్చ్ పట్టుకున్న స్ర్తి? దీనికి అర్థం ఏమయి ఉంటుంది? స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడ చూచినా పెద్ద సంఖ్యలో ఉండేది మగవారే! మరి చిహ్నం మాత్రం స్ర్తి! అమెరికాని ఫాదర్‌లాండ్ అంటారు. మనలా మదర్‌లాండ్ అనరు. కానీ అమెరికాలో తొలిసారిగా అడుగుపెట్టి నివాసం ఏర్పరచుకున్న ప్రతివారూ ఈ దారిలోంచే వెళ్లాలి, ఈ స్ర్తిని దర్శించుకుని.
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆ శిల్పి మనసులో ఏముండి ఉంటుందో.. శిల్పి ప్రాన్స్ దేశస్థుడు. లిబర్టీ ఒక రోమన్ దేవత. స్వాతంత్య్రానికి ప్రతిరూపం. కిరీటంలో ఉన్న ఏడు కోరలు ఏడు సముద్రాలకు, ఏడు ఖండాలకు ప్రతినిధులు.
ప్రపంచ చిహ్నం స్ర్తి!
జన్మకు చిహ్నం!
ప్రేమకు చిహ్నం! స్వాతంత్య్రానికి చిహ్నం. ప్రజాస్వామ్యం, అవకాశం, మానవ హక్కులు శాంతిభద్రతలుతో స్వతంత్రం ప్రకటించి వంద సంవత్సరములు పూర్తి అయిన సందర్భంలో అమెరికాకు, ఫ్రెంచ్ దేశంవారు ఇచ్చిన చిరుకానుక.
అంతర్జాతీయ స్నేహానికి ప్రతిరూపం.
స్వాతంత్య్రపు గాలి పీల్చుకోవాలని అర్రులు చాచి, అలసి సొలసి వచ్చిన ప్రతి ఒక్కరికీ వెలుగు చూపించే స్ర్తి! యావత్ప్రపంచ జనావళికి జన్మనిచ్చిన స్ర్తియే స్వాతంత్య్రానికి చిహ్నమా!
చిత్రం! ఈనాటివరకు ఎన్నో దేశాల్లో స్ర్తికి స్వాతంత్య్రం కరువుగానే ఉంది. భద్రతకు, భయంగానే ఉంది. ఆఖరికి సమానత్వం కూడా సందేహమే!
మైగాడ్! మళ్లీ నా మనసు పరి పరివిధాలా పోతోంది. ఇదే రీతిలో నా ప్రయాణం అంతా చేస్తే- నా మనసుకు ఇక హద్దు ఉండదేమో!
దాదాపు గంటన్నర ప్రయాణం చేసి వౌళి అపార్ట్‌మెంట్‌కి వచ్చాం. వౌళి, తేజ కలిసి నా పెట్టెలు అన్నీ అపార్ట్‌మెంట్‌కి చేర్చారు. చిన్న అపార్ట్‌మెంట్. అన్నీ చిన్నవే. కానీ అన్నీ ఉన్నాయి. చిన్న కిచెన్, చిన్న బెడ్‌రూమ్, బాత్రూం, చిన్న లివింగ్ రూం. ఆ మహాపట్నంలో అది పెద్దదే! లోపలకు అడుగుపెట్టగానే ఇంట్లో భారతీయత అంతా కనిపించింది ఘుమఘుమలాడుతున్న వంటవాసనలతో.
వౌళి కనుబొమ్మలు ఎగరేసి, తేజను చూపిస్తూ- నీ కోసం భోజనం సిద్ధం చేసింది, అన్నాడు నవ్వుతూ!
‘‘అయ్యో, నువ్వు చెయ్యడం దేనికి? నే వచ్చాక చూసుకునేదాన్నిగా’’ అన్నాను నొచ్చుకుంటూ!
‘‘ఇంకా నయం- తేజ అమ్మగారు ఫోన్ కింద పెట్టలేదు వంటంతా పూర్తయ్యేవరకూ’’ అన్నాడు వౌళి నవ్వుతూ!
‘‘చాల్లే! నువ్వు టూమచ్ చేస్తావు అన్నీ’’ అంది తేజ.
చొరవగా, బాత్రూంలో అన్నీ ఎలా ఉపయోగించాలో చూపింది.
నేను బాత్రూం వైపు వెడుతూ అన్నాను- ‘‘మామయ్యకి ఫోన్ చెయ్యి, నేను క్షేమంగా చేరానని. నేను తీరిగ్గా తర్వాత మాట్లాడతానని. లేకపోతే కంగారు పడతాడు’’.
‘‘ఎయిర్‌పోర్ట్‌నుంచి చేసేశాను’’ అన్నాడు వౌళి.
తలుపు వేసుకుంటుంటే ఫోన్ మోగింది, ఆగాను ఎవరయి ఉంటారా అని.
తేజ అమ్మ కాబోలు.
-ఇంకాఉంది