సాహితి

సుగంధ జగత్తులో దుర్గంధ జారచోరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన సామాజిక పరిస్థితులను కథానికలు ప్రతిబింబించాలి’ అనేవారు అనేకులు అయినా ‘అంతమాత్రం చాలదు, కథలకు సర్వకాలీనత వుండాలి’ అనేవారూ జగత్తులో ఎక్కువ మందే ఉన్నారు. ఇరుతెగలవారికీ సంతృప్తిని ఇచ్చే కథానిక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి ‘కలుపుమొక్కలు’.
తమ పనులు జరుపుకోవడం కోసం ముఖస్తుతులు చేయడం, లంచాలు ఇవ్వడం, మనుష్యులను ఉపయోగించుకోవడం.. ఇలా ఎన్నో రకాల అసాధ్యమైన పనులు చేయడం మానవ సమాజంలో అనాదిగా వున్నదే కదా అని అందరూ అంగీకరించినా, యిందులో కొందరు ఏకీభావం ప్రకటించలేదు.
స్థూలంగా యిదీ కథ:
జిల్లా బోర్డు ప్రెసిడెంట్ తన మీద దయతలచి, తన కుమారునకు ఉద్యోగం వేయడం లేదనీ, అతనికో సిఫార్సు ఉత్తరం వ్రాసి ఇమ్మనీ, రుూ బీద బ్రాహ్మణ కుటుంబానికి యావజ్జీవమూ అన్నం పెట్టించే పని చేయమనీ, ఆ జిల్లా అంతటిలోనూ అంతటివాడు లేడు అనిపించుకునే వేదం వల్లించిన బ్రాహ్మణుడు ఒకాయన డిప్టీ కలెక్టర్‌ను ఆశ్రయిస్తాడు. బోర్డు ప్రెసిడెంట్ బ్రాహ్మడే అయినా, తమ పనులు చేయడం లేదనీ, రాత్రీ పగలు కూడా వేశ్యావాటికలోనే గడిపివేస్తూ వుంటాడనీ విన్నవించుకుంటాడు. డిప్టీ కలెక్టర్ బ్రాహ్మడు కాదుగనుక, ఆయన సంతోషం కోసం తన బ్రాహ్మణ్యాన్ని కించపరచుకుందుకు జంకడు ఈ వేద ఘనాపాఠి. డిప్టీ కలెక్టర్‌కు ఒక మణుగు నెయ్యి, ఒక డబ్బ తేనెపాకం, ఒక బుట్టెడు బెల్లం, ఈమధ్యనే ఈనిన ఆవును లంచంగా- రహస్యంగా చీకటి వేళలలోనే సమర్పించుకుంటాడు.
‘నెల తిరిగేటప్పటికి యాభయి రూపాయలు గల్లున చేతిలో పడతాయి. మొదటి నెల జీతం పెట్టి ఆవును, రెండో నెల జీతంతో కోడలుకు చీరఒఒ కొంటానని ఆ బ్రాహ్మడు ఊహించుకుంటాడు. డిప్టీ కలెక్టర్ యిచ్చిన గట్టి సిపారసు ఉత్తరం తీసుకుని మరునాడు ప్రెసిడెంట్‌గారి గుమాస్తాను కలుస్తాడు. రుద్రాక్షతావళం తాకట్టుపెట్టి తెచ్చిన అయిదు రూపాయలు ఆయనకు సమర్పించి ఊరుకోకుండా, ఆయన చేతులు పట్టుకుని ‘యివి చేతులు కావు, కాళ్లు’ అంటాడు. బంట్రోతుకు ఒక రూపాయి ఇవ్వటానికి సిద్ధపడతాడు. అయితే గుమాస్తా ఇచ్చిన చల్లని కబురు ఏమిటంటే- డిప్టీ కలెక్టర్‌కు, ప్రెసిడెంట్‌కు పరస్పర సహకార ఉపకారాలు లేవు గనుక, ‘మీ అబ్బాయికి ఉద్యోగం కావాలనుకుంటే మెరక వీధిలోని దుగ్గిరాల శేషాచలం అనే వేశ్యను రప్పించి ఆమె చేత ప్రెసిడెంట్‌గారికి సిపారసు చేయించుకోండి’. వేదం చదువుకున్నవాడిని, యిలాంటి తార్పుడు వ్యవహారాలు నావల్ల కాదు అంటే గుమాస్తా నిర్దాక్షిణ్యంగా- ‘మరి నీ కొడుక్కు కూడా ఆ వేదాలే చెప్పించుకుంటే సరిపోయేది గదా! వేదాలు మీకే, ఉద్యోగాలు మీకే కావాలా?’ అని దబాయించి మరీ చెబుతాడు. బ్రాహ్మడికి శేషాచలాన్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. ఆమె ఆయన పాండిత్యాన్ని అమితంగా గౌరవిస్తుంది. ప్రెసిడెంట్ తన కోసం యిదివరకు ప్రయత్నం చేయడం, తను నిరాకరించడం గుర్తుతెచ్చుకుంటుంది. బ్రాహ్మడికి సహాయం చేయటానికి అంగీకరిస్తూ ‘నేను పతివ్రతను ఎలాగూ కాను. మగనాలిని అంతకంటే కాదు. కనుక దీనివల్ల నాకు కొత్తగా సంభవించే పాతివ్రత్యం కూడా ఏమీ లేదు. పశువుతో సాహచర్యం మాకు పరిపాటే’ అంటుంది. ఆమె వేశ్యాకులాన్ని గురించి అనే మాటలు గమనార్హం. ‘మా వేశ్యాకులం అంత చెడిపోయిందా బాబయ్యా. అగ్రజాతి గృహిణులందరూ మచ్చలేనివారేనా నాయనగారూ! మాలో నన్ను తలదనే్న యిల్లాళ్లూ, సానులయి ....పాతివ్రత్యానికి వరవడి పెట్టేవాళ్లు వేలున్నారు. కాని లోకం గుడ్డిది. పురుషులు మత్తులు. ఇప్పుడిదంతా అప్రస్తుత ప్రశంస!
ఘనాపాటి ప్రెసిడెంట్‌గారి గుమాస్తా దగ్గరకు చేరుకుంటాడు. ఆ గుమాస్తా నైపుణ్యం చూడండి. రెండు వందల రూపాయిలు లంచం యిచ్చిన మనిషితో, ‘కడిగేసినట్టు వొట్టి రూపాయిలా తేవడం? బజారంతా బత్తాయిలు దొర్లుతున్నాయి గాదా. ఒక్క వంద పట్టించుకు వస్తేనేం? పోనీ, నాలుగు చక్రకేళీ గెలలు, వొక్క డజను ఆపిలు పళ్లు, నాలుగు శేర్లుద్రాక్షపళ్లు..’ అని జాబితా చెప్పుకుంటూ పోతాడు.
ధన కనక వస్తు వాహనాలు మాత్రమే కాకుండా, ఇతరేతర సరదాలు కూడా తీర్చుకోవడంలో దిట్ట యితను. ‘విసిరికొట్టిన సానిని లొంగదీశావు. ఏం చేసినా నీ ఋణం తీర్చుకోలేను. నీకేం కావాలో చెప్పు. ఈ క్షణంలో చేసేస్తాను’ అని ఆ ప్రెసిడెంట్ ఈ క్రింది ఆర్డర్లమీద సంతకాలు చేయించేస్తాడు.
రోడ్డు మెటలింగ్ కాంట్రాక్ట్, యాభయి రూపాయల ఉద్యోగం- రెండు మాసాల కాళీలో పాతిక రూపాయల ఉద్యోగం! గుమాస్తా చాకచక్యాన్ని ప్రెసిడెంట్ మురుస్తూ వుండగా, గుమాస్తా యింకా బోర్డు సొమ్ముతో ఒక మేడ కూడా వేయించిపెడతానని, తనను మాత్రం కనిపెట్టి వుండమని విన్నపం చేసుకుంటాడు. గుమాస్తాను ‘ప్రధానమంత్రి అంతటి వాడివి’ అని మెచ్చుకుంటాడు ప్రెసిడెంట్. కథ ముగిసిపోతుంది.
ఈ కథ ఇచ్చే సందేశం బహు ముఖ్యమైనది.
వ్యక్తిగతమయిన సలహాల కోసం ఎటువంటి లంచాలనయినా ఇవ్వటానికి సిద్ధపడేవారు, పుచ్చుకొనేందుకు వెనకపడనివారు, అన్ని రోజులలోనూ ఉన్నారు. కనుక ఇందులో సామాజిక పరిస్థితి యధాతథంగా చిత్రించినట్లు, ఈ వస్తువుకు సర్వకాలీనత వున్నట్లు చెప్పుకోవచ్చును. సానివాళ్లలో నీతిని కూడా స్పష్టంగా చూపించారు. బ్రాహ్మణ్యం ఎట్లా చెడిపోయి భ్రష్టుపట్టిందో చూపించారు. సమాజంలో కుళ్లు ప్రవేశించటానికి అగ్ర కులాల వాళ్లం అని చెప్పుకునేవాళ్లు ఎలా బాటలు వేశారో ఈ కథలో చక్కగా చిత్రీకరించారు శాస్ర్తీగారు. కథా ప్రక్రియ ప్రకారంగా ఇందులో విశిష్టత ఏమంటే కథంతా ‘సంభాషణ’ల రూపంలోనే పాత్రలు చెప్పుకుపోతాయి.
శ్రీ శాస్ర్తీగారు వ్రాసిన పరిపుష్టమైన అనేక కథలలో యిది ఒకటి. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా దీనిని మనం చదువుకుని సుగంధ పరిమళం ఆస్వాదించుకోవచ్చును.