దక్షిన తెలంగాణ

హృదయాన్ని కదిలించేదే కవిత్వం! (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయాన్ని కదిలించేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ అడువాల సుజాత బీడీలు చుట్టిన చేతులతోనే పిహెచ్‌డి పట్టాను పట్టుకునేలా ఆమె భర్త అందించిన సహకారం అంతా ఇంతా కాదు కొండంత అని సవినయంగా ప్రకటిస్తారు. ‘పరిశోధక కళిక’, ‘సాహిత్యజ్యోత్స్న’, ‘సాహిత్యశ్రీ’ తదితర బిరుదులతో సత్కరింపబడిన ఆమె ‘డాక్టర్ పి.యశోదారెడ్డి కథలు - సమగ్ర పరిశీలన’ అన్న అంశంపై పరిశోధన చేసి..పిహెచ్‌డి పట్టా సాధించారు. ‘తెలంగాణ పోరాట నవలల్లో స్ర్తి’ అన్న అంశంపై ఎంఫిల్ చేశారు. ‘మట్టిమల్లెలు’, ‘కాలమా కాస్త వినుమా’, ‘బతుకమ్మ పాటలు’, ‘దేశభక్తి గీతాలు’ తదితర గ్రంథాలను వెలువరించారు. పలు పత్రికల్లో తెలంగాణ సామెతలపై ప్రత్యేక వ్యాసాలు రాసిన అనుభవం ఉంది. అనేక సాహితీ సంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో క్రియాశీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ యాదగిరిలలో పాల్గొని అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ సంస్థల ద్వారా సన్మాన సత్కారాలు అందుకున్నారు. సాహిత్య పురస్కారాలను పొందారు. కరీంనగర్ మండలం మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమెతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖీ వివరాలు ఆమె మాటల్లోనే...

ఆ మీరు మీ రచనా వ్యాసంగాన్ని
ఎప్పుడు ప్రారంభించారు?
హైస్కూల్ చదివే రోజులలో అప్పుడప్పుడు కవితలు రాసేదాన్ని కానీ అవి పత్రికలకు పంపలేదు. జాగ్రత్త చేయుటలో అశ్రద్ధ చేశాను.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
హృదయాన్ని కదిలించేదే కవిత్వం. ఆనందంలో కావచ్చు, విషాదంలో కావచ్చు, సామాజిక స్పృహలో కావచ్చు ఎన్నుకున్న అంశము ఏదైనా కవిత్వం హృదయాన్ని కదిలించేలా ఉండాలి.

ఆ ఇప్పుడు వస్తున్న కవిత్వంపై
మీ అభిప్రాయం?
ఇప్పుడు కవిత్వం పుష్కలంగా వస్తుంది. కానీ అందులో సమాజహితం ఎంత ఉందనేది కవులు, కవయిత్రులు అంచనా వేసుకోవాలి.
ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
ఒకరో ఇద్దరో కాదు. చాలా మంది ఉన్నారు. కథారచయితలు, నవలా రచయితలు, కవులు కవయిత్రులు ఎందరో ఉన్నారు. ఎవరని చెప్పను?

ఆ మీ పరిశోధనా గ్రంథాల గురించి
రెండు మాటలు చెప్పండి?
డాక్టర్ పి.యశోదారెడ్డి కథలు సమగ్ర పరిశీలన పిహెచ్‌డి గ్రంథం. తెలంగాణ పోరాట నవలల్లో స్ర్తి ఎంఫిల్ గ్రంథము. ఎంఫిల్ గ్రంథములోని నవల ఇతివృత్తము కల్పితము కాదు. ఆ కాలములో తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్వయంగా చూసిన అనుభవాలను సంఘటనలను నవలలుగా మలిచారు రచయితలు. ఈ నవలల్లోని స్ర్తిలు ‘బాంచెను కాల్మొక్కుతా దొరా’ అన్న స్థితి నుండి బందూకులు పట్టుకొని దొరలను ఎదిరించే స్థితికి ఎదిగిన క్రమం ఉంటుంది. సంఘం కార్యకలాపాల ద్వారా ఎదిగిన స్ర్తిలు, గెరిల్లా పోరాటంలో కూడా పాల్గొంటారు. స్ర్తిల ఉన్నతిని, ఆత్మస్థైర్యాన్ని తెలిపే క్రమాన్ని ఈ గ్రంథము వివరిస్తుంది.
ఇక రెండవ గ్రంథం ‘యశోదారెడ్డి కథలపైన పరిశోధన’. ఈ గ్రంథములో తెలంగాణ మాండలిక భాషకు, సామెతలు జాతీయాలకు పెద్ద పీట వేయడం జరిగింది. తెలంగాణ యాసలో కథలు వ్రాసిన మొట్టమొదటి రచయిత్రిగా స్వర్గీయ పాకాల యశోదారెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఆమె తెలంగాణ సాహిత్యానికి ఎనలేని సేవలందించారు. వారి రచనలపై పరిశోధన చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ జీవన సరళికి ప్రతిరూపం ఈ గ్రంథము.

ఆ ఇప్పటి తరాన్ని సాహిత్యం వైపు
మళ్లించాలంటే ఏం చేయాలి?
విద్యార్థి స్థాయి నుండే ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మమ్మ నానమ్మలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పుస్తకపఠనం ప్రాధాన్యత తెలియజెప్పాలి. పిల్లలందరికి బాలసాహిత్యం పట్ల అభిరుచి కలిగేలా చూడాలి. ఇప్పుడున్న లుక్ కల్చర్ పోయి బుక్ కల్చర్ రావాలి.

ఆ మారుతున్న సమాజంలో స్ర్తివాద
కవిత్వం ఇంకా ఆవసరమని
భావిస్తున్నారా?
సమాజం మారింది. స్ర్తికి అన్నింటా భాగస్వామ్యం వచ్చింది. అన్ని రంగాల్లో స్ర్తిలు రాణిస్తున్నారు. ఇప్పుడు కావలసింది స్ర్తివాద కవిత్వం కాదు. మగవారి మానసిక స్థితి మారాలి. స్ర్తిలపై జరుగుతున్న అమానుష చర్యలు ఆగాలి.

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం
వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోనికి రావడానికి సింహద్వారము తెరువబడింది. అది తెలంగాణ సాహిత్య అకాడమి. ఈ అకాడమి ద్వారా మరుగునపడ్డ తెలంగాణ భాషా సాహిత్యాలకు పునరుజ్జీవం, వైభవము కలుగుతుందని ఆశిద్దాం.

ఆ తెలంగాణ ఉద్యమ కాలంలో
కవయిత్రిగా మీరు పోషించిన పాత్ర?
ఉద్యమకాలములో నా వంతు కర్తవ్యంగా అనేక కవితా సమ్మేళనాల్లో పాల్గొన్నాను. ఉద్యమ స్ఫూర్తితో అనేక కవితలు వ్రాసాను. విద్యార్థుల ఆత్మహత్యలు వద్దు. సామూహిక పోరాటం ముద్దు అని తెలిపే కవితలు, వ్యాసాలు రాసాను.

ఆ బీడీ కార్మికురాలు స్థాయి నుండి పిహెచ్‌డి
స్థాయికి ఎదగడంలో మీ శ్రీవారి పాత్ర?
ఎంతైనా ఉంది. నేను ఏం చదువుతున్నా వారించలేదు. విద్యాభ్యాసములో నాకు ఎల్లప్పుడూ తోడు నీడగా వుండి, నేను ఈ స్థాయకి చేరడం మావారి చలవే. ఈ జీవితం బీడీలు చుట్టిన చేతులతోనే పట్టుదలగా పిహెచ్‌డి పట్టాను పట్టేలా చేసింది వారి ప్రోత్సాహమే.

చిరునామా:
డాక్టర్ అడువాల సుజాత
ఇం.నం.2-10-1223
జ్యోతినగర్
కరీంనగర్-505001
సెల్.నం.9989558678

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544