రాజమండ్రి

మిత్రులనవారు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టసుఖాలతో కలసిమెలసి ఉండాలి
ఒకరికి ఏ ఆపద వచ్చినా
మిగతావారు వారిని ఆదుకోవాలి
అవసరం వస్తే ప్రాణాలను
కూడా లెక్కచేయగూడదు
ఆపదవచ్చినప్పుడు
సమయస్ఫూర్తితో మెలగాలి
ఆపదలలో ఆదుకున్నవాడే
నిజమైన జన మిత్రుడు
స్వార్థం కోసం ఇతరులను
హింసించకూడదు
ఇతర ప్రాణులపట్ల ప్రేమ
దయకలిగి ఉండాలి
మిత్ర లాభానికి మించిన లాభం లేదు
- పంపన సాయిబాబు
తోలేరు, సెల్ : 96528 01014

మైండిట్

అవసరమైన వేళల్లో
అన్యాయాన్ని సహిస్తూ
ఆకాశం నుండి రాలిన చినుకులు
అవనిలో ఇంకిపోయినట్లు
రాలిపోకు
ఆవేశం రంగరించి
అగ్నిలా మండిపడు
అన్యాయాన్ని తగలెట్టు
అప్పుడు గాని నువ్వు
ఆనందంగా బతకలేవు
అప్పుడు గానీ నిన్ను
అందరూ గుర్తించరు
- పురిజాల సుధాకర్,
నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.

చమురు బొమ్మలు
ఉదయం రాత్రిలో కలిసేలా
కాలం కన్నీటి వంతెనపై దుఃఖంతో
నడుస్తున్న బక్క ప్రాణులు
జీవితాల్లో భయం భయం
గ్యాస్ లీకేజీలతో
కోనసీమ మట్టితల్లి గుండెలో మంటలు
పచ్చదనంతో వికసించిన గుమ్మడి పువ్వు
లాంటి సీమలో
ప్రాణాలకు భరోసా లేదు
మొన్న నగరం మృత్యుభయం
ఇంకా జన హృదయాల్లో
ప్రవహిస్తూనే ఉంది వౌనంగా
గుండెలు మండుతున్నా
కాలం పచ్చకాగితాలతో
నవ్వుతోంది
ప్రాణంకన్నా నోటేమిన్నగా
శూన్యంలోని రాజీలు
జ్ఞాపకాల ఎండిన చెట్టు
మళ్లీ నేడు తాటికోన
గ్యాస్ లీకేజ్ వార్తతో
క్షణక్షణం భయం! భయం
పూలవాసన లేదు
గ్యాస్ వాసనే
నిస్సహాయ జీ‘వనం’
చమురు బొమ్మలై
- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501

ఏది అసలైన ప్రేమ?

హలో అంటే పుట్టేది ప్రేమ కాదు
మొదటి చూపులో కలిగే ఆకర్షణ
ప్రేమంటే ఒక డ్రింకులో రెండు స్ట్రాలు కాదు
రహస్య ప్రదేశాల్లో
కోర్కెలు తీర్చుకోవడం కాదు
పెద్దలనెదిరించి లేచిపోవడం కాదు
ప్రేమంటే శక్తి
ప్రేమంటే ఏ ప్రభావాలకు లోను కానిది
ప్రేమంటే వౌన ఆరాధాన
ప్రేమంటే త్యాగం, అంకితం, అనురాగం
ప్రేమంటే ఏ స్వార్ధం లేనిది
ప్రేమంటే అశ్లీలం కాదు
అమలిన శృంగారం ప్రేమ
తీపి అనుభూతి ప్రేమ
రోమియో, జూలియట్,
లైలా, మజ్నూ, సలీం అనార్కలి,
షాజహాన్ ముంతాజ్, కుతుబ్‌షా బేగంల
నిజమైన ప్రేమ ఎన్ని యుగాలైనా
ఎదిరించి నిలిచి ఒకరికై ఒకరు పరితపించేలా చేసేది
నిస్వార్ధంగా ఆత్మసౌందర్యానికి
కట్టుబడి నిలిచేది అసలైన ప్రేమ
జిఎస్‌కె సాయిబాబా,
అనకాపల్లి. సెల్ : 9248173116.

తెలుగు వెలుగు

తీపి తేనియ కొమ్మ తెలుగమ్మా నీవు
రవి శశిలతో ఇలను వెలుగమ్మా
పుడమిపై ప్రభవించిన భాషలకు ధీటుగా
జగతిలో వెలసిన జనులకు మేటిగా
రాజాధిరాజులు
మెండు మేధావులు ఇచ్ఛంగా
మెచ్చుకుని పలుకు మాటల మూట తెలుగు పదముల కోట
అది కవి కావ్యమున జాలువారిన తెనుగు
బమ్మెరతో కమ్మగా ఒదిగిపోయిన తెలుగు
గురజాడ గళములో గేయమయితివి నీవు
కరుణశ్రీ కరుణతో ఖ్యాతినొందితివి నీవు
గలగల పారేటి సెలయేరు జూచినా
కిలకిలా పలికేటి పక్షులను గాంచినా
పైరు పచ్చని ఇంట పరువాలంట
వర్ణనకు వెలసావు తెలుగు పొదరింట
శ్రీనాథ సీసములో అలరారినావులే
పెద్దన్న జిగిబిగిలో పేరొందినావులే
దేశభాషలయందు లెస్స తెలుగంటూ
రంజింపబడినావు రాయలాస్థానమున
- సూర్యహర్ష
(డబ్బీరు గోవిందరావు),
సెల్ : 9440642182.

ప్రేమా! ఏదీ.. నీ చిరునామా!

ఈ ప్రపంచంలో
ప్రేమలేని వారెవ్వరు
మనిషై పుట్టినవారికే కాదు
మాయామర్మాలు తెలవని
పశుపక్ష్యాదులకు సైతం
ప్రేమలున్నాయి.. ప్రేరణలున్నాయి

పాశ్చాత్య పోకడలతో
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే
ప్రేమలన్నీ వెలవెలబోతున్నాయి
వెక్కిరింపులకు గురవుతున్నాయి

ముందుగా..
నిన్ను నీవు ప్రేమించుకొని
నిన్ను నీవు ఉన్నతీకరించుకొని
నిన్ను నీవు మనిషిగా పూర్ణించుకొని
నీలో నిలువెల్లా
ప్రేమంటూ ఏమైనా వుంటే
కొంచెం కొంచెంగానైనా
పది మందికి పంచు!
క్షణం క్షణం ద్వేషాల్ని
రగిలించుకొని
మరణం వైపు
పయనించటమెందుకు?
ప్రేమను పంచకపోయినా
ద్వేషాన్ని చిమ్మటమెందుకు..
కుత్సితాలను కుతంత్రాలను
మనసు పొరల్లో మరిగించి
కలుషితమైపోతున్న దేహంతో
ఆపద్ధర్మ ఆలింగనాలెందుకు?
సముద్రమై ప్రవహించే వాడికి
ఆటుపోటుల్లోనూ
ప్రేమ ఆణిముత్యమే!

ప్రేమకాని ప్రేమలకు
ప్రేమ పేరు పెట్టటమెందుకు?
ఉన్మాదపు చర్యలను
ఈ చెలిమికి చుట్టటమెందుకు?
ప్రేమ చిరునామాలను
చరిత్రలో చెరపడమెందుకు?
స్వార్థం లేని ప్రేమల్ని
నీ హృదయ సౌధంలో
పచ్చని మొక్కలై మొలవనీ..
వెనె్నలై స్రవిస్తున్న
మమకార బిందువుల్ని
నీ అంతరంగ ఆకాశంలో
వెచ్చని చుక్కలై వెలగనీ..!
- కటుకోఝ్వల రమేష్,
చరవాణి : 9949083327