విశాఖపట్నం

ఇంకుడు గుంత (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ రోజుల్లో కథలు, నవలలు ఎవరు చదువుతున్నార్రా?’’ అన్నాడు ఆనందమూర్తి.
‘‘చదివేవాళ్లు ఉండరంటావా?’’ గురుమూర్తి అడిగాడు.
‘‘అలా అనకు కానీ శ్రద్ధగా ఇతని రచనలు బాగుంటాయి. మరిన్ని రాస్తే బాగుండును అనేవాళ్లు తగ్గిపోయారు’’
‘‘సృజనాత్మకశక్తి నశించకపోతే ప్రచురణ అయిన ప్రతి రచనా రచయితను రెచ్చగొడుతుంది. అంతకంటే మంచి రచన చెయ్యాలన్న తపనతో’’
‘‘పిల్లలేం చేస్తున్నారు ఇప్పుడు?’’
‘‘బాబు ఇంజనీరింగ్, పాప ఉద్యోగ ప్రయత్నం’’
‘‘చాలా కాలం అయింది. పేర్లు మరిచిపోయాను వాళ్లవి. సుమారు పాతికేళ్లయిందేమో కదా మనం కలిసి’’
‘‘సెల్‌ఫోన్లు వచ్చాక పేర్లు క్రమంగా మరిచిపోయి నంబర్లు గుర్తుంచుకుంటున్నారు. బాబు పేరు శ్రీనివాస్, పాప పేరు హారతి’’
‘‘ ఇంటి నుండి ఫోనొచ్చింది. వెళ్లాలిరా’’ అన్నాడు ఆనందమూర్తి పార్కు నుండి బయటికి వస్తూ.
‘‘అప్పుడప్పుడు కలుస్తూ ఉండు’’
‘‘అలాగే ఫోన్ చేస్తుండు’’
ఇద్దరూ చెరో వైపు వెళ్లిపోయారు.
గురుమూర్తి ఇంటికి చేరాడు. చుట్టు పక్కల నీళ్ల కోసం గొడవ పడుతున్నారు ఎప్పట్లాగే.
వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువగా ఉంటే ప్రజలందరూ వెంట బడి మరీ పొందుతారు.
ప్రభుత్వానికి ఉపయోగం అంటే వాయిదా వెయ్యడానికి వెనుకాడరు ఎవరూ. ఇదీ మానవ నైజం.
అందుకే ఇంకుడు గుంతలు తవ్వక, నీళ్లు దొరక్క ప్రభుత్వం ఏం చేస్తోందని అనేవాళ్లే గానీ, మనం ఏం సాయం చేయగలం అనేవాళ్లు లేరు.
కథకు ప్లాట్ దొరికింది అనుకుంటూ హుషారుగా ఇంట్లోకి నడిచాడు గురుమూర్తి.

- శ్రీనివాసమూర్తి, శ్రీకాకుళం.