విశాఖపట్నం

వాడు మారడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడెప్పుడో చిన్నప్పుడు కనిపించాడు
మళ్లీ అదేదో ఫంక్షన్లో కనిపించాడు
క్లాస్‌మేటని పేరే గాని
చదువు పూర్తయ్యాక కనిపించనేలేదు
జీవితాల్లోకి పేజరొచ్చింది
అయినా సందేశాల్లేవు
మొబైల్ ఫోనొచ్చింది
అయినా మాటల్లేవు
ఫేసు బుక్కొచ్చింది కానీ
వాడి ఫేసు కనబడదు
ట్విట్టరొచ్చింది
వాడు తప్ప ప్రపంచమంతా
ఏం చేస్తుందో చెప్తాడు
ఇన్సుటా గ్రామొచ్చింది
పిల్లల ఫొటోలు పెడతాడు గాని
వాడి ఫొటో పెట్టడు
సామాజిక మాధ్యమాలెన్నున్నా
వాడంతే
వాడు మారడు
ఇవన్నీ లేనప్పుడే నయం
గలగలా మాట్లాడేవాడు

ఏది అసలైన ప్రేమ?

హలో అంటే పుట్టేది ప్రేమ కాదు
మొదటి చూపులో కలిగే ఆకర్షణ
ప్రేమంటే ఒక డ్రింకులో రెండు స్ట్రాలు కాదు
రహస్య ప్రదేశాల్లో
కోర్కెలు తీర్చుకోవడం కాదు
పెద్దలనెదిరించి లేచిపోవడం కాదు
ప్రేమంటే శక్తి
ప్రేమంటే ఏ ప్రభావాలకు లోను కానిది
ప్రేమంటే వౌన ఆరాధాన
ప్రేమంటే త్యాగం, అంకితం, అనురాగం
ప్రేమంటే ఏ స్వార్ధం లేనిది
ప్రేమంటే అశ్లీలం కాదు
అమలిన శృంగారం ప్రేమ
తీపి అనుభూతి ప్రేమ
రోమియో, జూలియట్,
లైలా, మజ్నూ, సలీం అనార్కలి,
షాజహాన్ ముంతాజ్, కుతుబ్‌షా బేగంల
నిజమైన ప్రేమ ఎన్ని యుగాలైనా
ఎదిరించి నిలిచి ఒకరికై ఒకరు పరితపించేలా చేసేది
నిస్వార్ధంగా ఆత్మసౌందర్యానికి
కట్టుబడి నిలిచేది అసలైన ప్రేమ

తెలుగు వెలుగు

తీపి తేనియ కొమ్మ తెలుగమ్మా నీవు
రవి శశిలతో ఇలను వెలుగమ్మా
పుడమిపై ప్రభవించిన భాషలకు ధీటుగా
జగతిలో వెలసిన జనులకు మేటిగా
రాజాధిరాజులు మెండు మేధావులు ఇచ్ఛంగా
మెచ్చుకుని పలుకు మాటల మూట తెలుగు పదముల కోట
అది కవి కావ్యమున జాలువారిన తెనుగు
బమ్మెరతో కమ్మగా ఒదిగిపోయిన తెలుగు
గురజాడ గళములో గేయమయితివి నీవు
కరుణశ్రీ కరుణతో ఖ్యాతినొందితివి నీవు
గలగల పారేటి సెలయేరు జూచినా
కిలకిలా పలికేటి పక్షులను గాంచినా
పైరు పచ్చని ఇంట పరువాలంట
వర్ణనకు వెలసావు తెలుగు పొదరింట
శ్రీనాథ సీసములో అలరారినావులే
పెద్దన్న జిగిబిగిలో పేరొందినావులే
దేశభాషలయందు లెస్స తెలుగంటూ
రంజింపబడినావు రాయలాస్థానమున

మైండిట్

అవసరమైన వేళల్లో అన్యాయాన్ని సహిస్తూ
ఆకాశం నుండి రాలిన చినుకులు
అవనిలో ఇంకిపోయినట్లు రాలిపోకు
ఆవేశం రంగరించి అగ్నిలా మండిపడు
అన్యాయాన్ని తగలెట్టు
అప్పుడు గాని నువ్వు ఆనందంగా బతకలేవు
అప్పుడు గానీ నిన్ను
అందరూ గుర్తించరు

అమ్మంటే

అమ్మంటే కనిపించే దైవం
అమ్మంటే తొలి గురువు
అమ్మంటే తొలి స్నేహితుడు
అమ్మను మించిన దైవం లేదు
అమ్మ ఒడే సర్వులకూ పదిలం
దైవానికి ప్రతిరూపం అమ్మ