రివ్యూ

అదే సంపూ.. అదే గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * వైరస్

తారాగణం: సంపూర్ణేష్‌బాబు, గీత్‌షా, నిధిరెడ్డి, వెనె్నల కిషోర్, చమ్మక్ చంద్ర, వివాహర్ష, శ్రీచరణ్
సంగీతం: మీనాక్షి భుజంగ్
నేపథ్య సంగీతం: సునీల్ కాశ్యప్
నిర్మాతలు: సలీమ్ ఎం.డి., వి.శ్రీనివాసరావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ

అంతర్జాలం దాని అనుసంధానిత చట్రంలో, ఫేస్‌బుక్‌ల వినియోగంలో అవలంభిస్తన్న అపసవ్య విధానాలవల్ల యువత చెడిపోతోంది, అలా కాకూడదన్న కీలక ఉద్దేశ్యంతో తయారైన డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్లూ వైరస్.కామ్. అయతే, సినిమా ఆ విషయంపై ఎక్కువ ఫోస్ పెట్టక అనవసర సంఘటనలపై అధికమైన సమయాన్ని వెచ్చించింది.
తాను అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగం చేయడానికి సహకరించిన స్వచ్ఛంద సంస్థ ముఖ్యురాలు అనన్య (నిధిరెడ్డి) అనుమానాస్పద మరణం విషయాన్ని ఛేదించడానికి ఇండియా వస్తాడు కిట్టు (సంపూర్ణేష్‌బాబు). అనన్య అప్పటివరకూ ఉన్న వంశీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లోనే నెట్ కనెక్షన్స్ నిర్వహించే వ్యక్తిగా చేరి అందులోని టెర్రస్‌లోనే ఉంటూంటాడు. అనన్య మరణం వెనుక ఉన్న అసలు విషయాన్ని ఎలా కనుక్కున్నాడన్నది మిగతా కథ. అయితే ఈ ప్రక్రియ అంతా ఏదో ఆషామాషీగా తీసుకుని నడిపినట్లు ఉంది తప్ప ఎక్కడా లాజిక్కికి ఛాన్స్ ఇవ్వలేదు. ఉదాహరణకి కిట్టు అమెరికా వెళ్లి ప్రధానంగా కంప్యూటర్ హేకింగ్ కోర్సు చేసినట్లు చెపుతారు. మరి అంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన అతను ఆ అపార్ట్‌మెంట్‌లోనే వాచ్‌మెన్ బాబా (వెనె్నల కిశోర్) తదితరులు సెల్‌ఫోన్లలో చేసే అశ్లీల అంశాల అప్‌లోడింగ్ వగైరాలపై దృష్టి పెట్టలేడా అన్న అనుమానం సాధారణ ప్రేక్షకుడికి ఆదిలోనే వచ్చింది. అలాగే టాబ్స్‌లో ఇలా అప్‌లోడింగ్, తద్వారా అత్యాచారాలూ చేసే బాబా బృందం కూడా కిట్టు తన టెర్రస్ రూమ్‌లో సిసి కెమెరాలు పెట్టిన వైనం కనుక్కోలేడా అన్నదీ పెద్ద ప్రశ్నగా ప్రేక్షకుణ్ణి వేధించింది.
సి.సి. కెమేరాలు పెట్టి ఫ్లాట్స్‌లో వాళ్ల అక్రమ సంబంధాలు చిత్రీకరించి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు కథానాయకుడు కిట్టు. తిరిగి వాళ్లా పని చేయకుండా ఉండటం కోసమేనని చిత్రాంతంలో చెపుతాడు తప్ప వాస్తవానికి ఆ సంఘటన అనంతరం డబ్బు తీసుకుని తర్వాత ‘నాకేం తెలీదుగా’ అని చెప్పించడం, మళ్లీ అలాంటి సందర్భాలలో ఆయా పాత్రలు వెళ్లినట్లు చూపడం వగైరాలు చూస్తే... సన్నివేశాలపై దర్శకుడి పట్టు తెలిసిపోతుంది. ఇలాంటి గందరగోళాలవల్ల చిత్ర ముఖ్య లక్ష్యమైన ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకూడదు అన్నది ప్రభావవంతంగా తెరపై కన్పడలేదు. అయితే ‘మనం ఛాటింగ్ చేస్తున్నది ఎవరితోనో?’ అన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా ‘అభిమానాలు’ స్థాయికి మించి పెంచుకోవడాలు, చివరకు అలా పంచుకున్నది, పెంచుకున్నదీ తల్లీ, కొడుకులే కావడం, దరిమిలా వాళ్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం మనస్సుని కలుక్కుమనిపించాయి. ఇలాంటివి వాస్తవ జీవితంలో జరుగుతాయా అంటే, పద్ధతి లేకుండా ఛాటింగ్‌లు చేస్తే ఇలాంటివీ తప్పవని మాత్రం అనిపించింది.
పెర్‌ఫార్మెన్స్ పరంగా సంపూర్ణేష్‌బాబు కిట్టు పాత్రలో తన స్టయల్ చూపించేందుకు చేసిన కృషి ‘ఓవర్ యాక్షన్’ అనిపించింది. డైలాగ్సులో మోహన్‌బాబుని, డాన్సుల్లో చిరంజీవినీ అనుకరించిన విధానం చాలాచోట్ల స్పష్టమైంది. మిగతా పాత్రల్లో కిట్టు ప్రేమించిన రుక్కుగా గీత్‌షా సినిమాకు కావాల్సిన గ్లామర్ కోటింగ్‌నివ్వడానికి తన వంతు ప్రయత్నం చేసింది. అనన్యగా నిధిరెడ్డి కన్పడినది తక్కువ సమయం అయినా చక్కగా చేసింది. మాటిమాటికి టమోటా అంటూ చమ్మక్ చంద్ర చేసిన చమక్కులు కొన్నిచోట్లే మెరిసాయి. ఇంతవరకూ కామెడీ యాక్టర్‌గానే మనం ఎక్కువగా చూసిన వెనె్నల కిషోర్‌ని ఇందులో విలన్‌గా కూడా చూస్తాం. ఈ పాత్రలో కూడా పరిధిమేరకు రాణించాడు. మీనాక్షి భుజంగ్ స్వరాల్లో ఉట్టి కొట్టే సన్నివేశంలోని పాట ఓ మాదిరిగా బాగుంది. ఈ పాట చిత్రీకరణ ఎన్నదగినదిగా ఉంది. ప్రత్యేకించి కలర్ కాంబినేషన్‌లో మంచి శ్రద్ధ కనపర్చారు. ‘ఇటు ఫేస్‌బుక్కూ- అటు నోట్‌బుక్కూ, ఎటుపోతుందో లుక్కు’ పాటలో రచయిత పదాలు బాగా కూర్చారు. అలాగే సంభాషణల్లో ‘సావిత్రి ముసుగులో సన్నీలియోన్లు ఉన్నారు’, ‘టెక్నాలజీ టెక్నిక్‌గానే టెరిఫిక్‌గా ఎదుర్కొంటా’ వంటి ప్రాసకోసం డైలాగ్ రైటర్ ఎంతగా ప్రాకులాడాడో అన్నదీ బాగా కన్పడింది. వరల్డ్ వైడ్ విజడమ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) లక్ష్యాన్ని ఉమెన్, వెల్త్, వైన్ విధానాలకు ఉపయోగించడం తగదన్న సినిమా లక్ష్యం నెరవేరేలా ‘వైరస్’ చిత్ర సన్నివేశాలు బలంగా చూపించలేకపోయారు.

-అనే్వషి