రివ్యూ

ఖేల్ ఖతం.. భాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * ఖయ్యూంభాయ్

తారాగణం: తారకరత్న, కట్టా రాంబాబు, చలపతిరావు, బెనర్జి, చిన్నా తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: శారదా చౌదరి
దర్శకత్వం: భరత్

తీసుకుంది రౌడీ షీటర్ కథనం. విలన్‌ను హీరోగా చూపిస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు. కానీ కథ అంతా అతనిదే కావడంవల్ల సినిమాటిక్‌గా ఓ హీరో పాత్ర ఉండాలి. హీరో ఊరికే విలన్‌మీదకు యుద్ధానికి పోడు కదా! అందుకని అతనికో ప్రేయసి ఉండాలి. ఈ పడికట్టు సూత్రాలన్నీ పట్టుబట్టి మరీ ఖయ్యూం భాయ్ కథనంలో కన్పిస్తాయి. తెలంగాణలో రౌడీ షీడర్‌గా అటు రాజకీయ నేతలను, ఇటు జనాన్ని భయపెట్టిన వ్యక్తి కథను తీసుకొని రూపొందించిన సినిమా ఎంతవరకు ప్రేక్షకుడి టిక్కెట్టుకు, సదరు విలన్ కథనానికి న్యాయం చేసింది అనేది చదవాల్సిందే.
చిన్నప్పటినుండి క్రిమినల్ ఆలోచనలతో పెరిగిన ఖయ్యూం (కట్టా రాంబాబు) ఎదుటివారి బాధలను చూసి ఆనందిస్తుంటాడు. పెద్దయ్యాక అది వికృతరూపం దాలుస్తుంది. తన స్వలాభం కోసం అన్నలతో చేరి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. అక్కడ తలెత్తిన గొడవలవల్ల అప్రూవర్‌గా మారి కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవిస్తాడు. తరువాత తనకు నచ్చని అన్నల దాష్టీకాలపై కత్తికట్టి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి ఒక్కొక్క నక్సలైట్‌ను అంతం చేస్తాడు. తరువాత పోలీస్ డిపార్ట్‌మెంట్ వెన్నుదన్నుతో సెటిల్‌మెంట్స్ చేయడానికి సిద్ధమవుతాడు. మనిషికి కావాల్సింది వల్లించటానికి సూత్రాలు కాదని, సుఖంగా బ్రతకడానికి డబ్బే ప్రధానమని చెప్పిన గురువు మాట ప్రకారం డబ్బు సంపాదనే ప్రధానంగా పెట్టుకుని ఎన్ని రకాల అన్యాయాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తుంటాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా చిన్నపాటి రౌడీ షీటర్ చివరికి రాజకీయ నాయకులనే శాసించి వారినుండి సుపారీ తీసుకోవడానికి సిద్ధవౌతాడు. ఓ ప్రముఖమైన రాజకీయ నాయకుణ్ణి 200 కోట్లు ఇమ్మని డిమాండ్ చేయడంతో పాలక పక్షం అతన్ని ఏవిధంగా అంతమొందించింది అన్న కథనమే మనకు తెలిసింది. అయితే హీరో అనే పాత్ర ఉండాలి కనుక ఏసిపి సత్య (తారకరత్న) పాత్రను కల్పించారు. అతని ప్రేయసి రేడియో జాకీగా కార్యక్రమాలు చేస్తుంటే, పోలీసు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే సత్య ప్రేమలో పడతాడు. ఆమెనుండి ప్రేమ సంకేతం అందగానే కలవడానికి వచ్చేసరికి, అప్పటికే ఖయ్యూం భాయ్ గ్యాంగ్ మనుషులు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమె ఎక్కడుందీ, ఎలా వుందీ, చివరికి ఖయ్యూం భాయ్ గ్యాంగ్‌నుండి తప్పించుకొని తన ప్రియుడిని చేరిందా అన్న కథనమే క్లైమాక్స్.
సినిమాలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఖయ్యూం భాయ్‌గా నటించిన కట్టా రాంబాబు ఆ పాత్రలో ఒదిగిపోవడమొక్కటే. అతని చుట్టూ అల్లిన సన్నివేశాలు వాస్తవంగా జరిగినవి ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే దానికి సినిమా టచ్ ఇవ్వలేకపోయారు. ఖయ్యూం భాయ్ ఎంతమందిని ఎందుకు హత్యచేశాడు? అతని చివరి టార్గెట్ ఏమిటి? అనేది మొదటినుండీ చూపించే ప్రయత్నం చేయలేదు. కథ అలా అలా వెళ్లిపోతూ వుంటుంది. ఖయ్యూం అంతర్గత ఆలోచనలు ఏంటి? అనే అంశాలను ఎక్కడా స్పృశించలేదు. పైగా ఖయ్యూం భాయ్ చేసిన ఆగడాలను కొన్నింటిని మాత్రమే ఎంచుకున్నారు. డైలీ న్యూస్‌పేపర్లలో వచ్చిన అంశాలను తీసుకొని కథ అల్లుకున్నా కొన్ని రకాల నేరాలను సినిమాలో పట్టించుకోలేదు. మొదట సత్య ప్రేమకథతో ప్రారంభించి, తరువాత ఖయ్యూం భాయ్ సన్నివేశాల దగ్గరకు వచ్చేదాకా సినిమాలో ఎలాంటి ఫీల్‌ను తీసుకురాలేకపోయారు. సెకెండాఫ్‌లోనే కొద్దో గొప్పో ఫర్వాలేదనిపిస్తుంది. ఖయ్యూం భాయ్ స్ర్తి వేషంలో చేసిన పాటలు పాతవి అవ్వడంతో చప్ప చప్పగా సాగాయి. రొమాంటిక్ ట్రాక్‌ను తారకరత్నతో నడిపే ప్రయత్నం చేసినా ఎక్కడా హీరో హీరోయిన్లు ఇద్దరూ కలవకపోవడంతో ప్రేక్షకుడికి ఆ ఫీల్ దొరకదు. మూడు ఐటెం సాంగ్స్ ఇబ్బంది పెట్టేవే. జీన్ ప్యాంట్ వేసుకొని అన్న ఒక్క పాటను రిచ్‌గా చిత్రీకరించారు. కట్టా రాంబాబు పాత్రకు సరిపోయినా యాక్షన్‌లో మాత్రం వెనుకబడ్డాడు. అతని ముఖంలో క్రూరత్వం ఎక్కడా కనపడదు. చివరిలో క్లైమాక్స్ కూడా గబా గబా చుట్టేసినట్లుగా ఉందిగానీ, స్పష్టత లేదు. ప్రేక్షకులు కూడా చివరలో ఖయ్యూం ఎలా చనిపోయాడు అన్నదాన్ని ఆసక్తిగా గమనించే అంశం. అయితే దాన్ని ప్రేక్షకులకు ఎంత తెలుసో, అంతే చెప్పేవిధంగా చిత్రీకరించారు. ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా తెరపై ఆవిష్కరించడంలో మెరుపులు లేవు. కొత్తగా ఎక్కడా చూపించే ప్రయత్నం జరగలేదు. ప్రజలకు తెలిసిన ఓ గ్యాంగ్‌స్టర్ కథను చూపించేసి ఓ సినిమా లాగించేశామన్న భావనే ఎక్కువగా కనిపించింది. సంగీతం, కెమెరా పనితనం సోసోగా ఉంటాయి.

-సరయు