రివ్యూ

విసుగు పుట్టించాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * జయదేవ్

తారాగణం: గంటా రవి, మాళవిక, వినోద్‌కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెనె్నల కిషోర్, బిత్తిరి సత్తి తదితరులు
సినిమాటోగ్రఫి:జవహర్‌రెడ్డి
సంగీతం:మణిశర్మ
ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్
మూలకథ:అరుణ్‌కుమార్
రచన:పరుచూరి బ్రదర్స్
నిర్మాత:కె.అశోక్‌కుమార్
దర్శకత్వం:జయంత్ సి.పరాన్జీ

జనరల్‌గా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళడం, రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి రావడం కామనే. ఇప్పుడు అలాంటి సన్నివేశం జయదేవ్ సినిమాతో జరిగింది. ఆంధ్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి.పరాన్జీ రూపొందించిన చిత్రం ‘జయదేవ్’. పోలీస్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. కానీ.. ఏదైనా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు ఆకట్టుకోవడం చూస్తున్నాం. ఎక్కువ శాతం ఓ పోలీసు అధికారి ఓ క్రిటికల్ కేసును పరిశోధించడం, దాని వెనక ఓ పెద్ద రౌడీ లేదా పొలిటీషియన్ ఉండడం ఎన్నో సినిమాల్లో చూసిందే. ఇప్పుడు అదే రిపీట్ అయింది. ఇక ఈ సినిమా విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో రూపొందిన సేతుపతి ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్‌గా వచ్చే పోలీసు స్టోరీలకు భిన్నంగా ఈ చిత్రంలో వున్న అంశాలేమిటి? తన మొదటి సినిమాలోనే పోలీస్ ఆఫీసర్‌గా గంటా రవి ఆ పాత్రకు న్యాయం చేశాడా?
సిన్సియర్ పోలీసాఫీసరైన జయదేవ్ (గంటా రవి) మరో పోలీస్ ఆఫీసర్ హత్య రహస్యాన్ని ఛేదించడానికి కేసు టేకప్ చేస్తాడు. దర్యాప్తులో చాలా విషయాలే తెలుస్తాయి. అయితే హత్య వెనుక లిక్కర్ డాన్ (వినోద్‌కుమార్) ఉన్నాడని తెలుసుకుంటాడు జయదేవ్. తర్వాత జయదేవ్ డాన్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అతన్ని అరెస్ట్ చేశాడా? లేదా? అన్నదే మిగతా కథ. కథలో మనకు కొత్తగా అనిపించే విషయాలు ఏమీ వుండవు. హీరో, విలన్ క్యారెక్టరైజేషన్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. విలన్ చేసే అక్రమాలను వెలికితీయడం, అతనివల్ల నష్టపోయినవారికి న్యాయం చేయడం వంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి కథతోనే రూపొందింది. తన విధి నిర్వహణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాడు హీరో. విలన్‌వల్ల ఎంతో నష్టపోతాడు. తర్వాత తన తెలివితేటలతో ఆట కట్టిస్తాడు. ఈ మాత్రం కథని తమిళం నుంచి దిగుమతి చేసుకోవపమే ఒక పజిల్. ఆ కథని తెరకెక్కించిన విధానం అర్థంగాని మరో పజిల్.
ఇక పోలీస్ ఆఫీసర్‌గా రవి తన పెర్‌ఫార్మెన్స్‌తో ఒక్క శాతం కూడా ఆకట్టుకోలేకపోయాడు. గెటప్ పరంగాకానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ ఎక్కడా కుదరలేదు. ఈ విషయంలో దర్శకుడు ప్రదర్శించిన తెలివే.. హీరోని ఎక్కువ షాట్స్‌లో చూపించకుండా ఉండటం. డైలాగ్స్ చెప్పడంలో, డాన్సుల్లో, ఫైట్స్‌లో ఏమాత్రం ఇన్‌వాల్వ్ అయి చేయలేకపోయాడు గంటా రవి. ఎన్నో భారీ చిత్రాలను, మరెన్నో సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన జయంత్ ఓ కొత్త డైరెక్టర్‌లా ఈ సినిమా చేశాడా? లేక దర్శకుడిగా తాను అన్ని మరిచిపోయాడా? అన్నది అర్థంకాదు. నిర్మాణ పరంగా అన్ని విధాలుగా కాంప్రమైజ్ అయినట్టు కనిపించింది. ఖర్చు కనిపించకుండా సినిమాని చుట్టేశారనిపిస్తుంది.
ఇక హీరోయిన్ వుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చి హీరోతో పాట పాడి వెళ్లిపోతుంది. మిగతా నటీనటుల గురించి చెప్పుకోవాలంటే విలన్‌గా వినోద్‌కుమార్ పాత్ర చాలా అసహజంగా ఉంది. అతని గెటప్స్‌లోకాని, చెప్పే డైలాగ్స్‌గానీ ఆకట్టుకోలేదు. టీవీలో పాపులర్ అయిన బిత్తిరి సత్తి ఆడియెన్స్‌ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. పోసాని, రవిప్రకాష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుప్రీత్, శివారెడ్డిల నటన రొటీన్‌గా ఉంది.
టెక్నీషియన్స్ ఏ ఒక్కరూ ఈ సినిమాకి న్యాయం చెయ్యలేకపోయారు. జవహర్‌రెడ్డి ఫొటోగ్రఫి దారుణం. దానికి తగ్గట్టుగానే మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ స్పీడ్‌గా ఉంది. జయంత్‌కి ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాలో ఒక్క పాటనీ వినసొంపుగా చెయ్యలేకపోయాడు. సన్నివేశాల్లో విషయం లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హైప్ చెయ్యాలనుకున్నాడు. ఈ సినిమాకి ఎంచుకున్న కథ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. జయంత్. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ కథ, పరమ రొటీన్ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.
ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ ఇలాంటి భారీ పాత్రను మోయడమంటే కష్టమే.. పైగా ఎలాంటి ఇమేజ్ లేని హీరో హీరోయిజం చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. ఆయన తన పాత్రలో మెప్పించడానికి కష్టపడినప్పటికీ ఏ మాత్రం ఆసక్తికరంగా లేని నారేషన్, బలమైన సన్నివేశాలు లోపించడం వంటివి సినిమా స్థాయిని కిందికి తీసుకెళ్లింది.

-త్రివేది