కరీంనగర్

నాటిన ప్రతి మొక్కను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 3: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను తమ బిడ్డలా రక్షించుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలను రక్షించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు అందుకు తగిన నిధులను, నీటి వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ కరీంనగర్‌పై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నగరంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 12న ఉదయం 11:30 గంటలకు నగరంలో లక్ష మొక్కలు నాటి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. గత రెండు విడతల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించిన సిఎం కెసిఆర్ ఈ సారి మున్సిపాలిటీలు, పట్టణాలలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల రక్షణకు నిధుల కొరత లేదని, మొక్కల రక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరికీ అప్పగించాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో నాటిన మొక్కల రక్షణ బాధ్యతలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, వాటి పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా విద్యాధికారికి అప్పగించాలని ఆదేశించారు. ప్రతి మండల పరిధిలో 8లక్షలు, ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో 40వేల మొక్కలు నాటే విధంగా ఎంపిడిఓలు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో ఎక్కువ మొక్కలు నాటే బాధ్యత అటవీ శాఖ వారిదేనని, వారే పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. నాటిన మొక్క సంక్షరణ కోసం మొక్కకు నెలకు రూ.5 చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములై జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి జోగు రామన్న కోరారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ సారి హరితహారం గొప్పగా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా, మండలం, గ్రామ స్థాయి అధికారులు కలిసి సమన్వయంతో, గత అనుభవంతో లక్ష్యం మేరకు మొక్కలు నాటి విజయవంతం చేయాలన్నారు. ఎన్ని మొక్కలు నాటామన్నది ముఖ్యం కాదని, నాటిన మొక్కలు ఎన్ని బతికాయి అనేది ముఖ్యమన్నారు. సంఖ్య కోసం మొక్కలు నాటవద్దని, పెట్టిన మొక్కను ఒకరికి దత్తత ఇవ్వాలని సూచించారు. ఎల్‌ఎండి డ్యాం, శ్మశాన వాటికలు, రోడ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాట వచ్చన్నారు. నగరంలోని గిద్దెపెరుమాండ్లస్వామి ఆలయం వద్ద ఖాళీ స్థలం చాలా ఉందని, అందులో నాటిన మొక్కలను రక్షించేందుకు ట్రీ గార్డ్స్‌కు బదులు ప్రహారీ గోడ నిర్మిస్తే కొన్ని వేల మొక్కలు బతికించే అవకాశముందని, ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని, నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్, ప్రిన్సిఫల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝూ, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు, డిపిఓ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.