వీరాజీయం

పట్టు వదలని వినియోగ విక్రమార్కుడు! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణుడు పైగా 70 పైబడ్డవాడు. కాని లేఖ్రాజ్‌కి జరిమానా కూడా తగిలించారు. హిమాచల్‌ప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారు గ్రామంలో అతనికి అలాట్ చేసిన ఇంటి సదుపాయాల నిమిత్తం 808 రూపాయలు ప్లస్ 40 రూపాయలు జరిమానా వేసి ‘లకోటా’ కొట్టారు. అంతేనా? పుండుమీద కారం జల్లినట్లు- ఈ మొత్తం కట్టకపోయినన్, కరెంటు, నీళ్లు, డ్రయినేజి సదుపాయం సహా అన్ని ‘ఎక్కలాగేస్తం’ అన్నారు. లేఖ్రాజ్‌గారికి ఈ లేఖని చూస్తూనే వొళ్ళు, గుండె కూడా మండిపోయాయి. అపరాధం చెయ్యకుండా ఫైను కడితే మాత్రం- అందరూ నేరస్తుడు అనే అనుకుంటారుగా.
‘నా నలభయి రూపాయలు నాకు వాపసు పంపించండి’ అని లేఖాస్త్రం సంధించాడు. వృద్ధ పల్లెటూరి బాబాయికి రీఫండు ఇస్తామా? రిప్లయ్ కూడా ఇవ్వం అన్నారు. వినియోగదారుల విచారణ మండలిలో కేసు పడేశాడు, ఘోరమయిన అవమానం ఏ వినియోగదారుడికి జరగకూడదు అని. కాని సిమ్లా కోర్టు దాకా కూడా కేసు వెళ్లినా లేఖ్రాజ్‌కి న్యాయం లభించలేదు. దీని అంతు చూడాల్సిందే అంటూ దేశ రాజధానిలోని అత్యున్నత వినియోగదారుల కోర్టులో అప్పీల్ పడేశాడు. అర్బన్ అధారిటీ వాళ్లు మంచి లాయర్‌ను పెట్టుకున్నారు. వాయిదాల పర్వం మొదలు; అయినా పట్టు వదలలేదు పెద్దాయన. ఢిల్లీకి తన గ్రామంనుంచి పోడానికే నాలుగు వందల ఖర్చు- రానూ పోను ఖర్చులు- లేటు వయస్సులో శ్రమా- ఇవన్నీ లక్ష్యపెట్టకుండా 2016 దాకా పోరాటం సాగించాడు. తీర్పు సరిగా మూడేళ్ళ తరువాత వచ్చింది. న్యాయమూర్తులు లేఖ్రాజ్‌ని అతని పట్టుదలని శ్లాఘిచారు. 40 రూపాయలు పువ్వుల్లో పెట్టి మరీ తిరిగి ఇచ్చివేయమన్నారు. అంతేనా? ఐదువేల రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. కన్నీరు వల వల కారింది సీనియర్ సిటిజనుడికి- ఐతే ఇవి ఆనంద బాష్పాలు అన్నాడు, తుడుచుకుంటూ లేఖ్రాన్.. ఇన్నాళ్ళు కనపడకుండా కారిన కన్నీళ్ళను మరిచిపోతూ..
‘మరదలు మాణిక్యం’ గోవులు!
వడ్డించేవాడు మనవాడు అయితే కడ బంతిన కూర్చున్నా ఫర్వానై.. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగు గారి ప్రభ వెలిగినంతకాలం కుటుంబమంతా అదనపు సుఖం అనుభవించారు. ఆనక సుపుత్రుడు అఖిలేష్ హయాంలో- తమ్ముడు ప్రతీక్ మరదలు అపర్ణ కూడా ప్రత్యేక హోదా అనుభవించారు. మరదలు అపర్ణయాదవ్ మొన్న ఎన్నికల్లో- వెల్లువలో పూచికపుల్లలుగా కొట్టుకుపోయింది గాని, ఆమె ఆధ్వర్యంలో జీవ ఆశ్రయ అనే ఒక ఎన్జీవో (నాన్ గవర్నమెంటు ఆర్గనైజేషన్) పేరు, జీవ ఆశ్రయ అద్భుతంగా గవర్నమెంటు ఊతంతో ఓహోమని సాగింది. దీని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగారి మరదలి గారి సంస్థకే మొత్తం గ్రాంటులో 86 శాతం సొమ్ములు ముట్టాయి. మంజూరు అయిన మొత్తం 9.66 కోట్ల రూపాయలు కాగా, అందులో 8.35 కోట్ల రూపాయలు అపర్ణమ్మ సంస్థలకే దక్కాయి. గత ఐదు సంవత్సరాల కాలంలో భీమునివాటా మరదలమ్మగారి ఆవులకు దక్కింది. 2015లో కన్హ గోశాలకి రెండు కోట్ల ముప్ఫై లక్షల సొమ్ములు ముట్టగా శ్రీపద్ బాబా బృందావన్ గోశాలకి నలభై ఒక్క లక్షల గ్రాంటే అందింది. కాని ప్రభుత్వం మారినాక యోగిగారి హయాంలో గోసంరక్షణకి కోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి కాని ఒక్క పైసా కూడా జీవాశ్రయ్‌కి వెళ్లలేదు. దయోదయ గోశా ల లలిత్పూర్‌కి భీమునివాటి 61 లక్షల రూపాయలు దక్కాయి. అంతేకదా? అస్మదీయులకు వడ్డించకుండా ఎవరు మాత్రం తస్మదీయులకి ముందు వరుసలో కూర్చోబెడతారు? ఈ వివరాలన్నీ సమాచార హక్కు క్రింద రాబట్టుకున్నవే గనుక- పక్కా గవర్నమెంట్ ఫిగర్స్ అనుకోవాలి. యోగం, యోగి దయ వుంటే ములాయం సింగు గారి చిన్నకోడలికి ఫండ్స్ లభిస్తాయి లేదా లేదు.. దావా తెగలరాయెం? కాకపోతే మార్చి నెలాఖరున యోగీజి కన్హ ఉపవన్ సందర్శించి అపర్ణ ప్రతీక్ దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించి మొత్తం రెండు వేల దాకా వున్న పశుగణాన్ని చూసి సలహాలు ఇచ్చాడు. గ్రాంట్సు కూడా వస్తాయేమో అనుకుంటున్నారు ‘యాదవ్’లు!

-వీరాజీ