డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది క్షణాలు వౌనంని అనుసరించారు. చివరకు నేనే అన్నాను- ‘‘ఇవాళ అంతా చాలా సరదాగా గడిచింది’’.
‘‘అవునండి. మేమూ అదే అనుకున్నాం. రేపు మీరు పొద్దునే్న బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంటికొచ్చి తిని వెళ్ళండి. ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. ఈ అమెరికన్ భోజనాలు మీకేం నచ్చుతాయి’’ అంది.
నవ్వుతూ తల ఊగించాను.
మూర్తిగారు, సావిత్రి వంక చూశారు. ఆవిడ కళ్ళతోనే అంది చెప్పండి అన్నట్లు...
ఒక్క క్షణం వౌళి వంక చూచి, నా వైపు చూచారు. ‘‘చూడండి! ఈ విషయం అసలు ఎలా మీతో డిస్కస్ చేయాలో అన్నది నాకు కొంచెం కష్టమయింది. పెళ్లి వారం రోజులలోకి వచ్చేసింది. ఇప్పుడయినా మీ అభిప్రాయం తెలుసుకోవాలనిపించింది. మేమింతవరకూ వౌళి నాన్నగారు డా.రఘురామ్‌గారిని కాంటాక్ట్ చెయ్యలేదు. ఇన్‌వైట్ చేయలేదు. కనీసం ఒక ఇన్విటేషన్ పంపడం మా బాధ్యత కదా!’’ అని ఆగిపోయారు. నేనేమంటానో అన్నట్లు.
నేను వౌళి వంక చూశాను. వాడు కూడా నా వంకే చూశాడు. ఇద్దరం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అన్నట్లు సందేహంలో పడిపోయాం.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చివరకు నేనే అన్నాను...
‘‘తను ఎక్కడున్నారో మీకు తెలుసా?’’ అని.
లేదన్నట్లు తల ఊగించారు. ‘‘ఆయనలాంటి వ్యక్తిని గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు’’ అన్నారు.
నేను వౌనంగా నా చేతి గోళ్లవైపు చూసుకుంటూ ఉండిపోయాను.
ఇది నా నిర్ణయం కాదు, వౌళిది. వాడు ఏం నిర్ణయించుకున్నా నేను అడ్డు చెప్పదల్చుకోలేదు. కాని వాడు పిలవమని అంటే క్షణం మనసు సందేహించింది. ఇనే్నళ్ల తరువాత మళ్లీ తను కలుసుకోవలసి వస్తే? అదీ తన జీవితంలో ఇంత ఆనందకరమయిన సందర్భంలోనా? ఒక ముల్లు. తను ఎలా హేండిల్ చేయగలుగుతుంది? తనకు ఎలా అనిపిస్తుంది. మనసు పరి పరివిధాల పోబోయింది. అలవాటుగా ఇంకా అతన్ని కలవనే లేదు. కలిస్తే ఎలా ఉంటుందో ఊహిస్తోంది మనసు. వౌళి వంక చూడటానికి సందేహించాను. నా మనసును నా కళ్ళల్లో వాడు చదవడం నాకు ఇష్టంలేదు.
వాడి మనసులో ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు బాగా పెద్దవాడయ్యాడు. బాధ్యతలు పెరిగాయి. పోయిన నాలుగేళ్ళల్లో మెచ్యూరిటీ వచ్చింది. విశాలమయిన దృక్పథంతో ఆలోచిస్తున్నాడు. ఇదే ఇదివరకయితే వౌలి ఏమనేవాడో నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఇప్పుడు వౌళి ఆలోచనలమీద అమెరికన్ ప్రభావం వుంది.
తేజ ప్రభావం ఉంది. పైగా మూర్తిగారు అన్నట్లు, ఇది కనీస బాధ్యత. ఒక విధంగా బంధాలు కలుపుకోవాలంటే శుభకార్యాలకు మించిన తరుణం మరొకటి ఉండదు.
‘‘అమ్మా!’’ అన్నాడు.
తల ఎత్తి చూచాను.
‘‘అంకుల్ ఏదో అడుగు తున్నారు’’ అన్నాడు నా వంక తరచి చూస్తూ!

‘‘నీ ఇష్టం వౌళి’’ అన్నాను వాడి చూపులు తప్పించుకుంటూ!
ఒక్క క్షణం తటపటాయించాడు.
‘‘వద్దు అంకుల్. డా.రఘురాంకి ఇన్విటేషన్ పంపద్దు. వాట్స్ డన్ ఈజ్ డన్. ఐ హావ్ నో డిజైర్ టు రికనెక్ట్’’ అన్నాడు.
మూర్తిగారు ఏదో అనబోయారు. వౌళి చెయ్యెత్తి ఆయన వంక చూస్తూ ‘ప్లీజ్’ అని వారించాడు. ఇంతలో వౌళి ఫోన్ మోగింది. చటుక్కున లేచి వెళ్ళాడు. ఫోన్ ఆన్సర్ చేయబోతూ ‘తేజ’ అన్నాడు.
‘‘హలో- ఎక్కడున్నావు?’’’
అటునుంచి తేజ సమాధానం వింటూ ఇంకో పది నిమిషాలు అన్నాడు. ‘‘మీ అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నారు. ఓకె, వాళ్ళతో చెప్తాను’’ అని ఫోన్ పెట్టేశాడు.
‘‘తేజ వస్తోంది. మీరు ఫోన్ తీయడంలేదుట. తను కారు ఇక్కడ వదిలేసి మీతో వెనక్కు వెళ్లాలని’’ అన్నాడు వౌళి.
‘‘తేజ స్నేహితులు?’’’ అడిగారు మూర్తిగారు. తెలియదన్నట్లు భుజాలు కదిలించాడు వౌళి. మరికొద్ది నిమిషాలలో డోర్ మీద కొట్టినట్లు వినిపించింది. వౌళి వెళ్లి డోర్ తెరిచాడు. తేజ అలసిపోయినట్లు లోపలకు వచ్చి సోఫాలో వాళ్ళమ్మ పక్కన కూలబడింది.
వౌళి రిఫ్రిజిరేటర్‌లోంచి ఒక మంచినీళ్ళ బాటిల్ తీసి ఇచ్చాడు.
వౌళి వంక చూసి థాంక్స్ అని- ఇవాళ ఎయిర్‌పోర్ట్ చాలా బిజీగా ఉంది.
బాటిల్ డస్ట్‌బిన్‌లో పడేసి, వెళ్ళేందుకు లేచి తేజ కారు తాళాలు వౌళికి అందిస్తూ ‘‘లెట్స్ గో డాడ్, ఐయామ్ ఎగ్జాస్టెడ్’’ అంది.
అందుకే నిన్ను వెళ్ళద్దన్నాను ఎయిర్‌పోర్ట్‌కి- సావిత్రి అలవాటుగా కోప్పడింది.
‘‘ఊప్స్! నువ్వు కూడా ఉన్నావని మరచిపోయాను. ఐయామ్ ఫైన్’’ అంది తేజ వాళ్ళ అమ్మ వంక చూస్తూ!
‘‘ఇదండీ వరస’’ సావిత్రి కూతురిపై ఫిర్యాదు చేస్తూ!
వాళ్ళ నాన్న, కూతుళ్ళు ఒక్కటి. ఇంట్లో నా మాటలన్నీ వీళ్ళకు చాదస్తంగా ఉంటాయి అంది సావిత్రి.
నేను నవ్వి ఊరుకున్నాను.
‘‘ఇక ముందు కనీసం వౌళి అయినా నా తరఫున ఉంటాడని ఎదురుచూస్తున్నాను’’ అంది సావిత్రి. మరికొంతసేపు కూచుని అవి ఇవీ మాట్లాడుతూ ఉండి మూర్తి దంపతులు తేజతో సహా వెళ్లిపోయారు. వాళ్ళని సాగనంపడానికి వౌళి కూడా లేచి వాళ్ళతో ఎలివేటర్ దాకా వెళ్ళాడు. నేను రూంలోనే ఉండిపోయాను కాని నా మనసు కాదు.
వౌళి వెనక్కి రాగానే నేను కూడా స్నానం చేసి వస్తాను అంటూ లేచాను.
వౌళి పరధ్యానంగా తల ఊగించి సోఫాలో టీవీకి ఎదురుగా కూచున్నాడు.
వేడి వేడి నీళ్ళు ఒంటిమీద పడుతుంటే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. కానీ, మనసు దాని దోవన అది తవ్వుకుంటూ వెళ్లిపోతూనే ఉంది.
వౌళికి 13, 14 ఏళ్ళు దాటాయేమో! ఒకరోజు వాడు గేమ్స్ నుంచి ఇంటికొచ్చేసరికి నేను టైమ్ మాగజైన్ తిరగేస్తున్నాను. గుమ్మంలో వాడిని చూడగానే చటుక్కున మాగజైన్ మూసేసి లోపలకు వెళ్లిపోయాను.
నా చేతిలో మాగజైన్ వాడి దృష్టిలోంచి దాటిపోలేదు.
‘‘ఏమిటా బుక్’’ అడిగాడు.
‘‘ఏదో మాగజైన్’’ అన్నాను.
ఏమనుకున్నాడో, అప్పుడు రెట్టించలేదు. లోపలకు వెళ్లి స్నానం చేసి భోజనం చేసి హోంవర్క్ చేసుకుంటూ కూచున్నాడు. నేను కంగారుగా దాచేసిన మాగజైన్ మళ్లీ బయటకు తీయలేదు.
హోంవర్క్ స్కూల్ బాగ్‌లో పెట్టుకుని పక్కన మంచంమీద పడుకోబోతూ అడిగాడు- ‘‘నువ్వు సాయంత్రం చదువుతున్నదేమిట’’ని?
సాయంత్రంనుంచి మధనపడుతున్నాను అది వౌళికి చూపించాలా వద్దా అని. నా మనసు రెండువైపులా మొగ్గుతూ ఉయ్యాల ఊగిపోతోంది. ఒక క్షణం చూపించడం రైటు అనిపిస్తోంది. మరో క్షణం ఎందుకు అనవసరంగా వాడి మనసు చిన్నబుచ్చడం అనిపిస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం నాన్న డాక్టర్‌గారి ఇంటికి వెళ్ళారు, అమెరికానుంచి వాళ్ళ అబ్బాయి వచ్చాడని తెలిసి. ఇదివరలో అతని సహాయం కోరారు రఘు వివరాలకోసం.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి