Others

ఉపాధ్యాయుడు తపస్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై ఒకటవ శతాబ్దంలో విద్యార్థికి ‘నేర్చుకోవడమే’ విద్యా కార్యక్రమంలో కీలకం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాకటంలో ఎంత బాధ్యులో, ఉపాధ్యాయుడు కూడా వారిని సమాజంలో నిలిపేందుకు అంత బాధ్యత తీసుకుంటాడు. బోధన సమర్థవంతంగా జరగాలంటే ఉపాధ్యాయుల సేవాతత్పరత అందుకు ఆయువుపట్టుగా నిలుస్తుంది. ఉపాధ్యాయులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని, దాన్ని సులువుగా విద్యార్థులకు అందజేటంలోనే సేవాతత్పరత ఉందని అర్థం చేసుకోవాలి. అదే అతని త్యాగనిరతికి నిదర్శనం. బిడ్డకు అన్నం తినిపించేటప్పుడు ప్రేమతో ఏ విధంగా తల్లి గోరుముద్దలు పెడుతుందో ఉపాధ్యాయుడు కూడా జ్ఞానాన్ని సులువుగా విద్యార్థి మెదడులోకి ఎక్కిస్తాడు. ఇందుకు అతనికి నేర్పరితనం, సేవాతత్పరత ఉండాలి. దీన్ని సమాజం గుర్తించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకిచ్చే సమాన స్థాయిని, గౌరవాన్ని అందించాలి.
21వ శతాబ్దంలో జ్ఞానం వేగంగా పెరుగుతోంది, జ్ఞాన స్వరూపం నిత్యం మారుతోంది. ఉపాధ్యాయుడు నిరంతర అధ్యయనశీలి కావాలి. డాక్టరు ఎంత అధ్యయనశీలి అయితే రోగికి అంతగా మంచి వైద్యం అందుతుంది. విద్యార్థికి కాలానుగుణమైన జ్ఞానం దొరకాలంటే ఉపాధ్యాయుడు అధ్యయనం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఉపాధ్యాయుడు అధ్యయన శీలిగా, వాత్సల్యత కలిగి వుండాలి, చేసే పనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. ఈ మూడు లక్షణాలుంటేనే అది వృత్త్ధిర్మం అవుతుంది. లేకుంటే ఉపాధ్యాయుణ్ణి ఒక ఆయా అని లేదా లైసెన్స్ ఉన్న డ్రైవరు అనుకుంటారు. ప్రొఫెషనల్‌గా మారాలంటే తానొక తపస్వి కావాలి. సమాజానికి కొత్త తోవ చూపించాలి. సమాజ లక్ష్యాలు సాధించటానికి మార్గాలు అంటే- అవి ఎవరో నిర్మించిన రోడ్లు కావు లేదా బాట కాదు. లక్ష్యాల బాటలో విద్యార్థుల్ని నడిపిస్తూ వారిని జ్ఞానమందిరాల వైపు తీసుకుపోవాలి. ఉపాధ్యాయ వృత్తిని సేవారంగం అన్నారే తప్ప ఉద్యోగం అనలేదు. ఉద్యోగంలో కొన్ని నిర్దిష్ట పద్ధతులుంటాయి. పిల్లలను భవిష్యత్ చిత్రపటాలుగా చేయటానికి తీర్చిదిద్దాలి. అందరికీ ఒకే రకమైన గీతలు పనికిరావు. ఈ బాధ్యతను స్వీకరించిన మహామనిషే గురువు.
అధ్యయన రూపం...
ఉపాధ్యాయ వృత్తి ‘వేర్లు’ జ్ఞానరంగంలో పుట్టుకొచ్చినవి. జ్ఞానం ఎంతోమంది మహనీయుల శ్రమ ఫలితంగానే వచ్చింది. అది కొన్ని వందల ఏళ్ల ఫలితం. ఈ వృత్తి ఎన్నో పరీక్షలకు గురైంది. ఎంతోమంది మహనీయులు దానిని విపులీకరించారు, సమీక్ష చేశారు. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో, ప్రయోగశాలల్లో, గ్రంథాలయాల్లో, మ్యూజియంలలో దాగి వున్న జ్ఞానమంతా ఉపాధ్యాయ వృత్తి శ్రమ ఫలితమే. ఉపాధ్యాయులు తరగతికి వెళ్ళేముందు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు. దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరెవరు దానిని ఎట్లా సవరించారో ఎట్లా నిర్మించబడిందో తెలిస్తేనే ఆ పాఠానికి వారు న్యాయం చేయగలుగుతారు. ఉపాధ్యాయుడు ఆ నాలుగు పాఠ్య పుస్తకాలకే పరిమితమైతే జ్ఞాన పునాదులు అవగతం కావు. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థులకు రాబోయే 30 సంవత్సరాలకు కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని అందించగలగాలి. అదే విద్యార్థి, ఉపాధ్యాయుడి జ్ఞాన అభివృద్ధికి కారణమవుతుంది. ఉపాధ్యాయులు అంటే ఒకే పుస్తకం నుంచి మరో పుస్తకానికి వెళ్లే పరికరాలే కదా అనుకునేవారుంటారు. ఉపాధ్యాయుడు పాఠ్యప్రణాళికలను తొలుస్తాడు. గతం ఎంతగా అవగాహన అయితే భవిష్యత్ అంత సుస్థిరంగా ఉంటుంది. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థి సగర్వంగా- ‘నా ఉపాధ్యాయుడు ఫలానా..’ అని చెప్పుకునే పరిస్థితి ఉండాలి. సేవాతత్పరత ఎంత ప్రధానమో ఉపాధ్యాయుడి ఎడ్యుకేషన్ అంతే ప్రధానం. 500 నిమిషాల అధ్యయనం శ్రమతో 50 నిమిషాల్లో తరగతి గదిలో పిల్లలకు పాఠం చెబుతారు. ఉపాధ్యాయ వృత్తి జాబ్ కాదు. ఇదొక వృత్తి. తరగతి గదికివెళ్ళే ముందు ఉపాధ్యాయుడు అధ్యయనంతో అడుగుపెడతాడు. ఇది నాకు తరగతి గది గురించి చెప్పిన మా గురువు తెలిదేవర వెంకట్రావు చెప్పిన ‘తరగతి మంత్రం’.

-చుక్కా రామయ్య