రుచి

పళ్లతో పసందైన హల్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లతో చేసే హల్వాలు ఆరోగ్యరీత్యా మంచివి. తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. యాపిల్, పైనాపిల్, సపోట, సీతాఫలం, కర్బుజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా, పందిరి దోస, పుచ్చ వంటివాటితో హల్వా తయారుచేసుకుంటే పిల్లలు, పెద్దలకు ఎంతో మంచిది.

దానిమ్మతో
దానిమ్మ గింజలు - 4 కప్పులు, పిస్తాపప్పు - 4, బాదం పప్పులు - 6, జీడిపప్పులు - 6, నెయ్యి - 1/2 కప్పు, పంచదార - 1 కప్పు, ఎండుకొబ్బరి - 2 చెంచాలు, నువ్వుల పొడి - 1/2 కప్పు, ఏలకులు - 6
గింజలు వలచి నేతిలో వేయించాలి. పప్పులు అన్నీ నేతిలో వేయించాలి. ఇప్పుడు దానిమ్మ గింజల్ని మిక్సీపట్టి ముద్దగా చేసుకోవాలి. పంచదార పాకం రానిచ్చి దానిలో నువ్వుల పొడి కొబ్బరి పొడి, దానిమ్మ గింజలు ముద్ద వేసి కదపాలి. మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి కలిపి గినె్న నుంచి మిశ్రమం విడిపోతుండగా దింపి పళ్లానికి నెయ్యి రాసి మిశ్రమం పోసి సర్దాలి. చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే ముక్కలు గట్టిగా వస్తాయి.

తర్బుజాతో
తర్జుజా ముక్కలు - 4 కప్పులు, బెల్లం కోరు - 1 కప్పు, నెయ్యి - 1/4 కప్పు, ఏలకులు - 6,కొబ్బరి కోరు - 1 కప్పు, జీడిపప్పులు - 12
విధానం: ముందుగా నేతిలో కొబ్బరి కోరు, జీడిపప్పులు వేయించి తీసిపెట్టాలి. బాణలిలో బెల్లం కోరు, తర్బుజా ముక్కలు చేర్చి ఉడకనివ్వాలి. బాగా మెత్తగా ఉడికాక కొబ్బరి కోరు ఏలకులు చేర్చి కలిపి దింపి పళ్ళానికి నెయ్యి రాసి ముక్కలు చేసి ఆరనివ్వాలి.