దక్షిన తెలంగాణ

జీవ వైవిధ్యం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరించిపోతున్న
తరతరాల తరగని
అపురూప జీవసంపద
మానవత్వం పరిమళించిన
మంచితనం.. జీవజాతి
శారీరకంగా - మానసికంగా
ఆర్థికంగా - అన్ని రకాలుగా
సాటివారిని - స్వంతవారిని
హింసించి పీడించి
వేధించే రాక్షసత్వం
నేటి మనుష్యుల మనస్థత్వం
రాటుదేలిన రాతిగుండెలు
స్పందన లేని మనసు పొరలు
జాలి, కరుణ కనుమరుగైపోయె
క్రూరమృగాలను మించిన
మనిషిలోని రాక్షసత్వం
ప్రపంచ వ్యాప్తంగా
పదిశాతం కూడా లేని
మానవత్వం - జీవజాతి
భూతద్దమేసి వెతికినా
దొరకని దీన పరిస్థితి
మానవత్వం పరిమళించిన
మంచితనం జీవజాతుల
వారి జీన్స్ మీద పరిశోధించి
మెమోరీ కార్డులో భద్రపరిచి
ముందు తరాల వారికి -
టానిక్‌లా అందించాలి
- కాశపాక శ్రీనివాస్
కరీంనగర్, 9492202822

మానవత్వం!
దేశ భవిష్యత్తులో భాగమైన
పేద ప్రజల సమాధుల మీద
గడ్డి గాదం మొలుస్తూ కనబడుతోంది!
వీళ్లను చదువుకు దూరం చేసి
వీరికి కడుపునిండకుండా చేశారు!
నిత్యం పని పనీ అని
శ్రామిక దోపిడీతో
వీరిని దోచుకున్నారు!
చివరకు.. ఏ కర్రతో మళ్లించినా..
వీళ్లు మల్లుతారు!
కడుపునిండా తిండి లేక
కంటికి నిద్ర కరువై..
జీవశ్ఛవాలుగా బతికారు!
చివరకు..
ప్రకృతి కరుణ మాత్రం లభించింది
వారి సమాధులపై తన
ప్రతి రూపాలను నిలుపుతుంది!
చచ్చినా కూడా సమాధులపై
పచ్చి గడ్డి రూపంలో
పశువులకు గ్రాసంగా మారి
మనిషికి ప్రాణం వున్నా లేకున్నా
మన్నులో మన్నై..
మానవత్వాన్ని చాటుతున్నారు!
- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551

నీ చిరునవ్వే ఓ వరం!

సాలీడు గూడులాంటి
ఈ బాధావలయ ప్రపంచంలో
నీ మదిలో మెదిలే
సంతోష జ్ఞాపకమే ఓ వరం!
మేఘాల వలె కమ్మేసిన
ఈ నిరాశా లోకంలో
నీ మదిని తట్టిలేపే
నీ నమ్మకమే ఓ వరం!
అడుగడుగునా విషం చిమ్మే
ఈ ద్వేషపూరిత లోకంలో
అమృతం వంటి
నీ ప్రేమే ఓ వరం!
ఆకలి కేకల ప్రేవుల
వికటాట్టహాసాల
ఈ పేద ప్రపంచంలో
నీ దగ్గర వున్న విలువైన
నీ చిరునవ్వే ఓ వరం!
- గంజి భాగ్యలక్ష్మి, హన్మకొండ, సెల్.నం.9441993044

కవితా వందనము
గగనగంగా ప్రవాహమై యెగయుచున్న
కవుల సృజనల ధారల గాంచుచుంటి
వాని శీకరముల మున్గిమేనిపైన
హర్షపులకాంకురమ్ములు హాయినొసగె!
వచన కవితయన్న రుచికరమ్మగు ‘ఇడ్లి’
పద్య కవితయనగ ‘పాయసమ్ము’
గేయ కవితయనగ తీయని ‘్భక్ష్యమే’
ఆశు కవిత ‘వేడి దోశ’ గాదె?
పలుకు పువ్వుల నేరుచు పద్యమల్లి
పద్యమాలికన్ గళమున వాసి నిలిపి
హృద్య పఠనముతోడ వరింప నిలుపు
కవి గణంబులకీకృతి ‘కాన్క’యగుత!
- డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

ఆత్మకథ
ఎనుకట ఇక్కడ ఎవరుండక పోతుంటిరి
చిన్న బురదగుంటలా నేనుంటూ..
కాలంలో కలిసిపోయి చెరువునయ్యాను
పరిమాణంలాగే నాలోని సంపదలు
విస్తరించి పోతుండేవి
శ్వాసించే జలప్రాణులు..
శ్వాసనిచ్చే చెట్ల జాతులు
నా శరీరాంతర్భాగాలై నట్లుండేవి
గట్టు వెంట మొదలైన జనజీవనం
పల్లెగా మారి నాకొక నేస్తమైంది
ఆ ఊరిలో కులాలుగా
విభజించబడ్డ వాళ్లంతా
నా దరి చేరి ఒక్కటై
ఆకలి దప్పులు తీర్చుకునేవారు
వెల లేని సుఖదుఃఖాల సంగతులకు
నా ఒడ్డు గొప్ప చిరునామా
మారిన కాలం నాపై కనె్నర్ర జేసిందేమో
అనువుగా రాలని వానలొక వైపు
దురాక్రమణదారుల దాడులొకవైపు
నా అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తుంటే
మళ్లీ నేనొక బురదగుంటనయ్యాను
నాకిప్పుడు జలకాలాడాలని నా కోరిక
ఒక్కసారి మీ మునివేళ్లతో
నా కన్నీళ్లు తుడిచి పూడిక తీయండి
మీ కడుపున పుట్టిన వారిని
నేను కడుపున పెట్టుకుని
చూసుకుంటాను.
- కొత్త అనిల్ కుమార్
జ్యోతినగర్, కరీంనగర్, 9395553393

బతుకులు!
కాలం ఓ పాములా..
ఆగ్రహం, ఆవేశం, ఆవేదన
అస్తవ్యస్తం..
జర జర పాములా
అవిశ్రాంతం!
ఆనందమెక్కడా?
కప్పల్ని మింగే సర్పంలా
కష్టాల్ని మింగే బతుకులు!
అడవిలో దారి తప్పిన వారిలా
అయోమయపు బతుకులు!
మొదలు.. చివరలేని బతుకులు!
సంతోషానికి తావెక్కడ?
ఒక్క చిరునవ్వు
వారి దరి చేరాలంటే..
ఒక దూది పింజలా మారి
ఎగరాలంటే..
ఓ వాన చుక్క
అమృతమై వర్షించాలి!
- రాజావాసి రెడ్డి మల్లీశ్వరి, హైదరాబాద్, సెల్.నం.9866583907

ఓ లేఖకుడా!

ఓ లేఖకుడా!
లేఖా సాహిత్య ప్రేమికుడా!
సంఘహితం కోరడమే
నీ గుణం
‘కలం’తోని రాస్తావు
కనబడిన నిజాలన్నీ
వెలుగు చూడని విషయాలనీ
వెలుగులోకి తెస్తావు!
ఆశించవు ఏమి నీవు
సంఘశ్రేయస్సే నీ అభిమతం
క్లిష్టసమస్యలకు
చక్కని పరిష్కారం చూపిస్తావు!
ఓ లేఖకుడా!
నీకు నీవే సాటి
ఈ పోటీ ప్రపంచంలో
నీవు- ‘ఎదురు లేని మనిషి’వి!
నీ ‘లేఖాసాహిత్యం’-
అజరామరం!
- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031