దక్షిన తెలంగాణ

కథల్లో పాత్రలు ఆరాధనీయంగా మలచాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు, బహుగ్రంథకర్త, తత్వవేత్త, సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ బి.ఎస్. రాములు గారు కథల్లో..పాత్రలు ఆరాధనీయంగా మలచడంలో కథకులు తమ నేర్పరితనం చూపాలని భావిస్తారు. తెలంగాణ బాధలు, వెనుకబాటుతనం, దొరల గడిల్లో ఒకనాడు జరిగిన గుట్టుచప్పుడు కాని వ్యవహారాలు, సంపద వ్యత్యాసాలు మార్క్సిజం, అంబేద్కరిజం, బౌద్ధిజం, గాంధేయవాదం, దళితోద్యమం ముఖ్యంగా మానవత్వం వంటి అంశాలకు పెద్దపీట వేస్తూ వందలాది కథలు రాశారు. పది వరకు నవలలు రాశారు. బీడీ కార్మికుల బతుకు పోరును చూసి.. చిన్నప్పుడు బీడీ కార్మికుల మధ్య పెరిగిన తన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రాసిన ‘బతుకు పోరు’ నవల అత్యంత జనాదరణ పొందింది. ఇవే కాక.. తత్వశాస్త్ర, సామాజికశాస్త్ర రచనలు అనేకం చేశారు. తాను అనేక సాహితీ పురస్కారాలు పొందడమే కాక స్వయంగా ప్రతి ఏటా కథకులకు సత్కరిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో కథకులకు శిక్షణా శిభిరాలను నిర్వహించిన అనుభవం ఆయనకుంది! కథకులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. కథకులకోసం.. కథల బడి, కథా సాహిత్యాలంకార శాస్త్రం అనే గ్రంథాలను వెలువరించారు. ఆయన ఆత్మవిశ్వాసం..్ధక్కారస్వరం..్ధర్యం..సృజనాత్మకత, ఆయనను ప్రసిద్ధ రచయితగా మార్చింది. అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై పాఠ్యాంశాలుగా పెట్టారు. అనేక మంది ఆయన రచనలపై పరిశోధనలు చేస్తున్నారు. రచనల్లో వర్తమాన తెలంగాణ ప్రజల జీవన చిత్రణ జరగాలని భావించే ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖీ వివరాలు మాటల్లోనే..

ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసంగాన్ని
ప్రారంభించారు?
నా 14వ ఏట.. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు..

ఆ మీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి మిమ్మల్ని
ప్రోత్సహించింది ఎవరు?
మాకు చదువు చెప్పిన గురువులు..శ్రీయుతులు భాస్కర్ రెడ్డి గారు, కమలాకర్ రావుగారు, ఆచి శ్రీనివాసాచార్య, ముద్దు రామకృష్ణయ్య గారు, అందె వెంకటరాజం గారు..నాకు రచనల పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. అప్పటి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.ఆర్.నర్సయ్య గారు స్కూల్ మేగజైన్ తీసే సమయంలో..నాతో రచనలు చేయించారు. 1966 లోనే కంద పద్యాలు రాశాను. ఆ రోజుల్లోనే ‘చందమామ’ పత్రిక చదవడం ప్రారంభించాను. మహాకవి భారవి రాసిన కథ నన్ను బాగా ప్రభావితున్ని చేసింది.

ఆ మీ దృష్టిలో వచన కవిత్వం అంటే ఏమిటి?
వచన కవిత్వాన్ని ఒక్క వాక్యంలో నిర్వహించలేము! పద్య ఛందస్సు సంకెళ్ల నుండి బయటపడి స్వేచ్ఛగా పదబంధాల్లో ఒదిగి పోయి రంజింప జేసేది కవిత్వం..అయితే అది ప్రతీకాత్మకంగా చెప్పబడాలి.

ఆ మంచి కథకు ఉండే లక్షణాలు?
పఠన యోగ్యత ఉండాలి. పాఠకుడు ఏకబిగిన చదివేలా వుండాలి. స్పందించేలా ఉండాలి. కథలో రస సృష్టి జరగాలి. కథలో మలుపులు..ఉత్కంఠ..కలిగించే సన్నివేశాలుండాలి. కథనం సాఫీగా సాగాలి. పాత్రలు.. సంఘటనలు..సంభాషణలుండాలి. చక్కని సందేశంతో పాటు.. పాత్రలు వేటికవే చిత్రింపబడి ఆరాధనీయంగా మలచబడాలి.

ఆ మీ ‘బతుకుపోరు’ నవలకు ప్రేరణ ఏమిటి?
పేద కుటుంబంలో జన్మించిన నేను..చిన్ననాటి సంఘటనలు నన్ను కదిలించాయి. కలం పట్టేలా చేశాయి. ముఖ్యంగా బీడీ కార్మికురాలిగా మా అమ్మ జీవితం..బీడీ కార్మికుల మధ్య పెరిగిన నా జీవనం..మా ఆవిడ ప్రేరణతో ‘బతుకు పోరు’ నవలను రాశాను.. కుటుంబ బాధ్యతల్లో భాగస్వాములు కావాలన్న బీడీ కార్మికులైన మహిళలు భావించడం..నన్ను ఈ నవలను రాయడానికి ప్రేరణనిచ్చింది.

ఆ మీరు తత్వ, సామాజిక శాస్త్రాల రచనలవైపు
దృష్టి సారించడానికి ప్రేరణ ఏమిటి?
సమాజంలోని సంఘటనలు..దాశరథి రంగాచార్యగారి ‘తిమిరంతో సమరం’, డాక్టర్ అందె వెంకటరాజం గారి ‘నవోదయం’, ఇంకా డాక్టర్ సినారె గారి రచనలు నాపై ప్రభావం చూపాయి! వాటి ప్రేరణతోనే తాత్వికమైన అంశాలపై రచనలు చేశాను.

ఆ మీకు నచ్చిన గ్రంథాలు?
నేను 1967 నుండి 1972 వరకు ఆర్‌ఎస్‌ఎస్ శాఖ ముఖ్య శిక్షక్‌గా పని చేశాను. నా జీవితంలో మలుపు తిరిగే సంఘటనగా భావిస్తాను. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్‌గా పని చేసిన డాక్టర్ మాధవరావు, సదాశివరావు గోల్వర్కర్ (గురూజీ) రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ చదివాను. ఆ గ్రంథం నాకు బాగా నచ్చింది. ఇంకా ఎండ్లూరి చిన్నయ్య రాసిన అంబేద్కర్ జీవిత చరిత్ర’, బోయి భీమన్న రాసిన ‘కుల నిర్మూలన’ గ్రంథాలు బాగా నచ్చాయి.

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం
వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు డాక్టర్ సిధారెడ్డి గారి అధ్యక్షతన సాహిత్య అకాడమి ఆవిర్భవించింది. ఆయన నాయకత్వంలో సలహామండళ్లు ఏర్పాటు చేయాలి. డబ్బుకు కొరత లేకుండా..ఓ 1000 తెలంగాణ కథలతో,500 నవల విడివిడిగా గ్రంథాలు ముద్రించాలి. వాటిని హిందీలోకి అనువదింపజేయాలి. తద్వారా నవలాకారులు, కథకుల పరిచయం, కథలు ఇతర ప్రాంతాలకు తెలిపిన వారమవుతాం.

ఆ తెలంగాణ ఉద్యమకాలంలో రచయితగా మీరు
పోషించిన పాత్ర?
వందలాది సభల్లో మిగతా ఉద్యమ నాయకులతో కలిసి పాల్గొన్నాను..మాట్లాడినాను..తెలంగాణ ఇతి వత్తంతో రచనలు చేశాను. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆపడానికి ‘వయసు పిలిచింది’ కథ రాశాను.
ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాలు బాధ్యతను పెంచుతాయి. అయితే ఎంపికలో పారదర్శకత అవసరం. 1992లో దాశరథి రంగాచార్య గారు వారి సతీమణి కమలమ్మ షష్టిపూర్తి సందర్భంగా వారు అందజేసిన పురస్కారం నాకు, నా శ్రీమతికి సంతోషాన్నిచ్చింది. బాధ్యతను, కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి పురస్కారాలు అవసరం. గ్రహీతల ద్వారా పురస్కారాలకు గౌరవం వచ్చేలా వుండాలి. అలా ఎంపిక జరగాలి.

ఆ మీ రచనలపై జరిగిన పరిశోధనల
గురించి చెప్పండి?
వివిధ విశ్వవిద్యాలయాల్లో 13 మంది ఎంఫిల్ కోసం రిజిష్టర్ చేయించుకున్నారు. ఆరుగురు పూర్తి చేశారు. నా కథలపై ఓ పిహెచ్‌డి అవార్డయింది. ఇంకా నలుగురు పిహెచ్‌డి చేస్తున్నారు.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు సూచనలు?
అధ్యయనంపై దృష్టి పెట్టాలి. కార్యశాలలకు హాజరవ్వాలి. తెలంగాణ గతం గురించి కాక..వర్తమానంపై రచనలు చేయాలి. కీర్తికాంక్ష కోసం కాకుండా సృజనాత్మకతకై రాయాలి. పురస్కారాలకై వెంపర్లాడరాదు. తెలంగాణ రచయితలు పరిమితమైన పరిధి నుండి విస్తృత పరిధిలోకి వచ్చేలా రచనలు సాగించాలి.

బి.ఎస్. రాములు
201, సులేఖ గోల్డెన్ టవర్స్
2-2-186/53/5, రామకృష్ణనగర్
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్-13
సెల్.నం.8331966987

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544