క్రీడాభూమి

భారత్ దూకుడుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీసెస్టర్, జూలై 8: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు దూడుకుడు శనివారం బ్రేక్ పడింది. డేన్ వాన్ నికెర్క్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో, దక్షిణాఫ్రికా 115 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ 158 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లిజెల్ లీ 92 పరుగులతో రాణించింది. వాన్ నికెర్క్ 57 పరుగులు సాధించింది. వీరిద్దరి ప్రతిభతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు చేసింది. శిఖా పాండే 40 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, ఏక్తా బిస్త్ 68 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. దీప్తి శర్మ (60) అర్ధ శతకాన్ని, ఝూలన్ గోస్వామి (43 నాటౌట్) పోరాటాన్ని మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వాన్ నికెర్క్ 22 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్‌ను దారుణంగా దెబ్బతీసింది.
కివీస్ చేతిలో పాక్ చిత్తు
టౌన్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 144 పరుగులకే కుప్పకూలింది. అత్యంత సాధారణమైన ఆ స్కోరును రక్షించుకోలేక, మరో 210 బంతులు మిగిలి ఉండగానే పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్ సనా మీర్ (50) అర్ధ శతకాన్ని మినహాయిస్తే పాక్ జట్టులో ఎవరూ చెప్పుకోదగిన స్కోర్లు చేయలేకపోవడంతో, ఆ జట్టు 46.5 ఓవర్లలో ఆలౌటైంది. నహిదా ఖాన్ 18, అయేషా జాఫర్ 17 పరుగులు చేశారు. హన్నా రోవ్ 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. లీ తహుహు, లీ కాస్పెరెక్, అమేలియా కెర్ తలా రెండేసి వికెట్లు కూల్చారు. కేవలం 145 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 15 ఓవర్లలోనే చేరుకుంది. సోధీ డివైన్ 93 పరుగులు సాధించి, ఆ జట్టును గెలిపించింది. ఓపెనర్ అమీ సాటర్త్‌వెయిట్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

చిత్రం.. భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను డకౌట్ చేసిన డేన్ వాన్ నికెర్క్ (కుడి) ఆనందం