రాజమండ్రి

ఎంత అదృష్టమో! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరం నా మిత్రబృందంలో ఒకడు. చాలారోజుల తర్వాత సుందరాన్ని చూడటానికి వెళ్లాను. ఇప్పుడది ఇల్లుకాదు, విల్లా! అందమైన షోకేసులు, వాటిలో సుందరం, వాడి శ్రీమతి ఫొటోలు, కొడుకు వారిని హత్తుకొని ఉన్న భంగిమలు! వాడు కవి కావటం వల్ల ఎన్నో జ్ఞాపికలు, సన్మాన పత్రాలు కూడా అలంకరించి ఉన్నాయి. ‘ఈరోజుల్లోనూ అంత అనురాగం చూ పే పుత్రరత్నాలు ఉన్నారా?’ అని మనసులోనే అనుకున్నా. సంతోషించాను. సుందరం లేచి వచ్చి ఆప్యాయంగా నన్ను హత్తుకుంటూ ‘ఎన్నాళ్లకు నిన్ను చూశానురా. రారా!’.. అంటూ ఆహ్వానించాడు. కుర్చీల్లో తాపీగా కూర్చుని క్షేమసమాచారాలు, ఉద్యోగం వెలగబెట్టిన రోజుల నాటి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ‘ఎలా ఉన్నావురా ఇప్పుడు? బాగున్నావా? ఇప్పుడేం చేస్తున్నావు?’ అని అడిగాను. ‘బాగుండకేం? చూస్తుంటే కనబడటం లేదుట్రా!’ అన్నాడు గంభీరంగా. ‘అదిగో నా బెడ్‌రూము. సరే, ఇది హాలు. వేళకు టిఫిన్, భోజనం నావద్దకే వస్తాయి టంఛనుగా’ అని చెప్పాడు. ‘ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు!’ అన్నాను. ‘అవును! అదృష్టం అంటే నాదేమరి’ అన్నాడు వాడు. ‘ఎక్కడికీ వెళ్లే ఓపిక లేదుకదా! అందుకే నేను పుస్తకాలతో మాట్లాడుతుంటాను. తెల్లకాగితం గాలికి రెపరెపలాడుతూ తుఫాను గాలికి నావైపే చూస్తోంది ఏదో చెప్పాలని, చెప్పింది రాయమని. కలమేమో, ఏం? అట్లా చూస్తావు? ఏదో ఒకటి రాయి.. అన్నట్లుంటుంది. వేళకు వాటిని తాకకపోతే ఇంకేం వాటి ముచ్చట తీర్చినట్లుంటుంది? నాకు కాలక్షేపం ఏమవుతుంది? అని ఏదో రాసుకుంటుంటే రోజు గడిచిపోతుంది’ అన్నా డు. ‘మరి కొడుకూ, కోడలు కనిపించటం లేదేం’ అని అడిగాను. ‘ఉన్నా ర్రా వాళ్లు. సెల్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ ఎవరి గదుల్లో వాళ్లు!’ అన్నాడు. ‘అయితే నేను కూడా నీలాంటి అదృష్టవంతుణ్ణే’ అనుకున్నాను మనసులోనే. ఇం తలో సుందరం ‘ఒరే! మొన్న నాకో కల వచ్చిందిరా! ఎవరో నాకోసం వస్తున్నట్లుగా! పిలిచాను రమ్మని. కలలో వచ్చిన వ్యక్తి ‘నీకోసం కాదు, వేరేవాని కోసం పోతున్నా’నన్నాడు. అయ్యో! అనుకున్నా. విన్నాడేమో ఆ మాట. ‘త్వరపడకు. త్వరలోనే వచ్చి నీతో మాట్లాడి తీసుకుపోతా. తొందరొద్దని అన్నాడు’ అని వివరించాడు. అప్పుడు నేనన్నా ‘ఒరే! వాడొచ్చినప్పుడు నా దగ్గరకు కూడా పంపించరా. ఇద్దరం కలిసి వెళదాం. మరిచిపోకు’ అని చెప్పి వచ్చేశా. సుందరం కబురు కోసం ఎదురుచూస్తున్నా ‘ఒరే! ఆనందరావూ’ అని ఆప్యాయంగా ఎప్పుడు ఆహ్వానిస్తాడా? అని!

- కలవకొలను సూర్యనారాయణ, చరవాణి : 9849268659