సాహితి

అమర స్థూపాలకు తలవంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరండీ వీరు
ప్రజలూ ప్రభుత్వానికి మధ్య
మధ్యవర్తులట

ప్రశ్న కూడా
ప్రభుత్వ వ్యతిరేకం అంటారు
మాటల్లో ప్రతిసారి అధినాయకుని పేరు
ఏడ నిలబడ్డారో చెప్పకే చెబుతారు
ఐనా మధ్యవర్తినని బుకాయింపు

యంత్రాంగంలో భాగం ఈ పావులు
ద్విముఖ రహస్య సంభాషణ నిపుణత్వం
తానే పుట్టించిన అక్షరాల గుడ్లని
అమాంతం ఆమ్లెట్టేసి కానుకవుతున్నారు

రాజ్యయంత్రంలో అమరిక ఈ మరలు
ప్రజోద్యమాలకు వ్యతిరేకం
అప్పుడూ ఇప్పుడూ
గాయపడింది అక్షరమే

రాజ్యాన్ని ధిక్కరించిన గుంపొకటి
తాయిలాల కోసం
మధ్యవర్తుల దాక్షిణ్యం కోసం
ఒంటి కాలు మీద ఎదురుచూపు
ఇప్పుడు మధ్యవర్తులు ఏ శక్తులు?

విరామ సంగీతం
వినడంలో వీళ్ళంతా బీజీ బీజీ
కమ్మని అవకాయలో మిర్చి
చక్కని చికెన్ కూరలో పసందైన పసుపు
చారులో కలిసిన రుచ్యమైన కందిపప్పు
పండించిన రైతుల మెడచుట్టూ
మధ్యదళారీలు పేనిన ఉరితాడు

రైతు హాహాకారాలు
ఏమీ పట్టని కొత్త మధ్యవర్తులు
పదవులకోసం పాకులాటలు
అక్షరం పలకరింపులేని జనం
పాటని కొంగున కట్టిన రాజ్యం
కన్నుగీటి కులాలకు ఎగదోత

మధ్యవర్తిత్వం - అలీన భుజంగం
అధినేతల మోచేతి కింది సయ్యాటలు
చర్చలెప్పుడూ ప్రభుత్వ లాభసాటి చర్యలే
మధ్యవర్తులందరూ దాని నీడలో సేదలే
చరిత్ర నేర్వని బధిరాంధులకు సలాం!

కలం తన సిరాని తానే ఒలకపోసుకుంది
గళం ఘనధ్వనుల లాలిపాటలై తలలూపింది

గుమికూడిన ఎర్ర చప్పట్ల మధ్య
పోరాటాలకు మధ్యమార్గమై
సైద్ధాంతిక తాత్వికత విచారధారనందిస్తోంది

ప్రజల కోసం జరిగే
పోరాటాల ప్రతిఘటనలోంచి
పాపం! అమర స్థూపాలకి తలవంపులు.

- జయధీర్ తిరుమలరావు, ఫోన్: 9951942242