రివ్యూ

పాత పేరుతో కొత్త లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** రెండు రెళ్లు ఆరు

తారాగణం: అనిల్ మల్లెల, మహిమ, ఐశ్వర్య, నరేష్, రవికాలే, తా.రమేష్, ప్రమోదనీ సరోజ
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాతలు: ప్రదీప్ చంద్ర, మోహన్ అందె
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందు మల్లెల

జీవితంలో మనం అనుకున్నదంతా లెక్కల్లో ప్రకారం వెళ్లదన్న అంతర్లీన అర్థంతో వచ్చిన సినిమా రెండు రెళ్లు ఆరు.
రాజు (నరేష్) రావు (రవికాలే)ల భార్యలు ఒకే ఆసుపత్రిలో మగ, ఆడబిడ్డలను కంటారు. కానీ ‘కార్డియోమయోపతి’ అన్న అరుదైన వ్యాధి కారణంగా ఇద్దరూ ఇరవై రెండేళ్ల తరువాత చనిపోవచ్చని వైద్యులు చెపుతారు. రాజు, రావులిద్దరూ ఈ విషయాన్ని దాచి ఒకరి పిల్లల్ని మరొకరు మార్చుకుంటారు, అవతలి బిడ్డ పూర్తి ఆయుష్కురాలు అన్న నమ్మకంతో. పిల్లలిద్దరూ ఎదురెదురుగా పెరగడంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. అది వివాహాలకు దారితీస్తే కష్టమని భావించి ఒకరిపై ఒకరికి ద్వేషం పెరగడానికి ఇద్దరు తల్లిదండ్రులూ బీజాలు వేస్తారు. అయినా పిల్లలిద్దరూ పెళ్లివరకూ వెళ్తారు. అదీ డాక్టర్లు నిర్ణయించిన ఇరవై రెండేళ్ల వయసప్పుడు. ఇది ఎలా కొలిక్కి వచ్చిందీ అన్నది పతాక సన్నివేశం.
మామూలుగా ఇలాంటి సమస్యతో పుట్టిన పిల్లలపట్ల తల్లిదండ్రులు సాధారణ జాగ్రత్తలకంటే ఎక్కువ జాగ్రత్త పాటించి పెంచుకుంటారు. కానీ ఇందులోలా స్వార్థంతో, పిల్లల్ని వదిలించుకునే తీరులో ప్రవర్తించడం జరగదు. దానికి సంజాయిషీగా నరేష్ పాత్ర ద్వారా చివరలో ‘ఆ క్షణంలో ఏం చేయాలో ఆలోచించే వ్యవధిలేక ఈ పని (పిల్లల మార్పిడి) చేశాను’ అని చెప్పించినా అంత సానుభూతికరంగా లేదు. అందుకే మ్యాగీ (మహిమ) వాస్తవ తండ్రి రవికాలే పాత్రతో ‘నేను మీ వద్దే వుంటే ఇరవై రెండేళ్లు ఈ స్థాయి ప్రేమానుభూతుల్ని ఇద్దరూ పంచుకునేవారం కదా’ అన్న అర్థంతో సంభాషణ అనిపించడం సముచితంగా ఉంది. అయితే వైద్యశాస్త్రం అభివృద్ధి సాధించి ‘కార్డియోమయోపతి’ జబ్బు విషయంలో వ్యక్తి జీవనకాలం పెరగడానికి మార్గాలు వచ్చాయి. దానివైపు వారి తండ్రులు వెళ్లకపోవడం విచిత్రం. అందులోనూ చిత్రంలో రావుగారి సతీమణి ఓ సందర్భంలో మనకి ఊళ్లో ముప్ఫైలక్షల ఆస్థి వదిలి ఇక్కడెందుకుండడం? అంటుంది. మరి అంతటి సంపన్నులూ కనీసం ఆ రీతిలో ఆలోచించరా? అన్నది ఓ ప్రశ్న. దర్శకుణ్ణి బాధించిన అంశం కూడా పాయింట్ చిన్నదవడమే. ఆ బాధ ద్వితీయార్థంలో కనిపించింది. నాయికా నాయకుల మధ్య ప్రేమ పెరగడానికి తూర్పుగోదావరి పర్యటన, తాగుబోతు రమేష్ హాస్యం ఇలాంటి రకరకాల విన్యాసాలు చేయంచటం అందుకే. సన్నివేశాలను బలంగా చూపగలిగే పాయంట్ లోపించడంవల్లే రెండు రెళ్ల.. లెక్క తప్పింది.
అయతే, ఎక్కడా అసభ్యత, హద్దుమీరినతనానికి ఆస్కారమివ్వక పోవడం హర్షణీయం. నాయికా నాయకుల్లో అనిల్ కంటే మహిమ నటనే బావుంది. చాలాకాలానికి నరేష్‌కిందులో రాజుగారి పాత్రలో నటించడానికి అవకాశం లభించింది. దాన్ని ఆయన చక్కగా వినియోగించుకున్నారు. ఇక్కడ కూడా నరేష్ కంటే రావుగారి పాత్రధారి రవికాలేనే ఎక్కువగా అభినందించాల్సి ఉంది. సంభాషణలు పలకడంలో కొంత ఇబ్బంది పడినా, సొంత గొంతుక (రవి కాలే తన పాత్రకు వారే డబ్బింగ్ చెప్పుకున్నారు)తో చెప్పడంవల్ల సహజత్వం వచ్చింది. ‘మా నాన్న రావడంలేదు, నువ్వే మా నాన్నగా రా’ అని రవికాలేని మహిమ తనకొచ్చిన గిఫ్ట్‌ని తీసుకోవడానికి తీసుకువెళ్లిన సన్నివేశంలో నేనే పాప తండ్రినని చెప్పినపుడు తన మొహంలో చూపిన భావం చాలా బాగుంది. తాగుబోతు రమేష్‌కు కూడా ఈ చిత్రం వైవిధ్యమైనదే. ఎందుకంటే ఆయన పాత్ర తాగుబోతుతనంతో లేకపోవడం. ఈ సినిమాలో మాటలకంటే పాటల తీరునే ముందుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ‘అనుకుందంతా జరిగే వీలుందా’ అన్నది హృద్యంగా ఉంది. ‘చీకటి ఒకటే మొదలూ చివరంటా, వెలుగూ మెరుపై వస్తూ పోతుందా’ అన్న పదాల్ని పాట రచయిత వశిష్ట శర్మ ఎంతో విశిష్టంగా రాశారు. ఇదే పాటలో ఇంకోచోట రాసిన ‘జాలి లేదే ఎద మంటకీ, కాలిపోతే చితి మంటకీ’ పదాలూ ఎన్నదగినవే! ‘కష్టపడి రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం ఫ్యాక్షనిస్టుని కాను’, ‘నేను అనుకునే ఇద్దర్ని కలపడం కన్నా, మేము అనుకునే ఇద్దర్ని విడదీయం కష్టం’ అన్న సంభాషణలతో పాటు ‘అమీర్‌పేట వెళ్లడానికి బస్సు డబ్బులడిగితేనే డబ్బులెందుకు ఖర్చు? ఎవర్నైనా లిఫ్టు అడిగి వెళ్లు అనే మా నాన్న, యుఎస్ పంపిస్తానంటే నేనెలా నమ్మను?’ అన్నవి సందర్భోచితంగా బాగా పండాయి. కోనసీమ అందాల్ని కెమెరా ఇంకా బాగా కాప్చర్ చేస్తే బావుండుననిపించింది. అనుకున్న లెక్కలు లెక్కలు ప్రకారం వుండవన్న సత్యాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేసిన ‘రెండు రెళ్లు ఆరు’ చిత్ర కథా లెక్క విషయంలో సహజ జాగ్రత్తలు వహించి ఉంటే ఆడియన్స్ పాయంట్‌లో సినిమా లెక్క సరిపోయఉండేది.

-అనే్వషి