వీరాజీయం

రివాల్వర్ రాణి పెళ్లి సంబరం! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదికాలంలో, రుక్మిణిదేవిని శ్రీకృష్ణుడు అమాంతం ఎత్తుకుపోయి పెళ్లిచేసుకున్నప్పటినుంచి- అలోప్మెంటు, కిడ్నాపింగ్, అపహరణ వివాహాలు వగైరా మనకి కథలు కథలుగా వున్నాయి. కాని, అందుకు ఈ ఉదంతం విపర్యాయం. నారీమణి తను వలచిన వరుణ్ణి ఎత్తుకుపోవడం జరిగింది బుందేల్‌ఖండ్‌లో. మొన్న మే నెల పదిహేనో తేదీనాడు బుందేల్‌ఖండ్‌లో అశోక్ యాదవ్ అనే మగమహారాజు పెద్దలు ఏర్పాటుచేసిన వివాహం చేసుకుంటూ వుండగా బందిపోట్ల సినిమాలోలాగే, పెళ్లి పందిట్లో గుఱ్ఱాలు సకిలిస్తూ చొరబడ్డాయి. వరుడు వరమాల పట్టుకు లేచినవాడు పాపం, గుర్రం దిగిన రివాల్వర్ రాణి చేతనున్న తుపాకిని గురిపెడుతూ ఒక్క అరుపు అరిచేసరికి అవాక్కయిపోయాడు. జనం నిశే్చష్టులయిపోయారు. అలా ఎత్తుకుపోయింది బందిపోటు రాణి అనే వర్ష సాహూ తన ప్రియున్ని. కాని పెళ్లికూతురు తండ్రి లల్లూ యాదవ్ (ప్రసాద్ లేదు ఇందులో) ఇంకో మగాడితో ప్రేమాయణం సాగించి- నా కూతుర్ని నన్ను చీట్ చేస్తావా? దగుల్బాజీ అంటూ పోలీసు కేసు పెట్టాడు పెళ్లికొడుకు అశోక్ యాదవ్‌మీద... పోలీసు వాళ్ళు ఈ ప్రబుద్ధున్ని అట్టుకుపోయి కటకటాల వెనుక పడేశారు. ఊరుకుంటుందా రివాల్వర్ రాణి? తన పలుకుబడిని బలాన్ని ప్రయోగించింది. కనీసం కల్యాణ వేడుకలకి అయినా బెయిలు ఇవ్వండి అని ఇప్పించి తన ప్రియున్ని బయటకు లాక్కొచ్చింది. బుందేల్‌ఖండ్‌కి అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న హమీర్పూర్‌లో చావురామాత గుడి చాలా విఖ్యాతం. అందులో ఝామ్మని పెళ్లి ఏర్పాట్లు చేసుకుని వర్ష సాహూ ఉరఫ్ రివాల్వర్ రాణీ ప్రియుడు అశోకుని- ‘‘రారా నా పిరికిపంద ప్రియుడా- నీ జోలికి ఎవరు వస్తారో నేను చూస్తానంటూ రివాల్వర్ పక్కన పెట్టుకుని శాస్త్రోక్తంగా భాజా భజంత్రీలతో తన మెడలో వరమాల వేయించుకుని- మాం గ్మే సింధూర్ పెట్టించుకుంది. వందలాదిమంది అనుయాయులు అభిమానులు హాజరయ్యారు. అక్షింతలు వేశారు. కానీ ఒక్క యాదవుడు అనగా వరుడి బంధువులు ఒక్కరైనా రాలేదు. మరో సంగతి వుంది- పెళ్లి పెద్దలలో శివసేన నాయకులు చాలామంది వున్నారు. పైగా వారు ‘రివాల్వర్ రాణి ఎంజీవో’ అనే పేరిట ఒక నాన్ గవర్నమెంటు సంస్థని స్థాపించారు. ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు చేయించడమే ఈ ‘ఆర్ ఆర్ ఎన్జీవో’ పని! అంతా సినిమాలాగా వున్నదా? స్క్రిప్టు మాత్రం వర్షా సాహూ ఉరఫ్ రివాల్వర్ రాణిదే! శుభం పలకండి!.

ఆడది అక్కడ అడుగుపెట్టరాదు!
ఒకోనిషిమా అని ఏడువందల చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఒక చిత్రమైన నిర్మానుష్యమైన ద్వీపం. శాంత మహాసముద్రంలో జపాన్‌కి పశ్చిమంగా ఉంది. అక్కడ ఏటా మే ఇరవై ఏడో తేదీన భక్తులు అంటే కేవలం మగ భక్తులు మాత్రం వెళ్తారు. అదీ, శరీర శుద్ధి చేసుకుని దిగంబరంగా వెళ్లాలి. 1904-05 సంవత్సరంలో యుద్ధంలో వీరమరణం పొందిన రష్యన్ జపనీస్ సైనికుల ఆత్మలకు తర్పణ చెయ్యడానికి వెళ్లి తిరిగి వచ్చేస్తారు. వస్తున్నపుడు అక్కణ్ణించి గడ్డిపరక కూడా తెచ్చుకోకూడదు. కాగా, ఈ దీవి మీద ఆడప్పురుగు కూడా అడుగుపెట్టరాదు. దీని మీద షిన్తో మతానికి చెందిన పెద్ద దేవాలయం ఉంది. దానిపేరు మునకాతాఇషా. స్ర్తిలకు ప్రవేశం లేదని ఎందుకు అంటే, సరిగ్గా మన దేశంలో అయ్యప్ప దేవాలయం వారు చెబుతున్న కారణమే చెబుతున్నారు పూజారులు. స్ర్తిలకు రుతుసరి సమయంలో రక్తస్రావం అవుతుందని అట. ఇక్కడ రక్తం చుక్కకి కాని, రక్తవర్ణానికి కాని తావు లేదు. పూర్తి నిషిద్ధం. అయితే, మరొక్క కారణం ఈ దీవి అత్యంత ప్రమాద భూయిష్టం- తల్లులు కావాల్సిన ఆడవాళ్లు నగ్నంగా ఈదుకుంటూ రావడమూ తగదు..
ఈ దీవిలో అతి ప్రాచీనమయిన శిథిల వస్తు సముదాయం దొరుకుతున్నది. పదిహేడవ శతాబ్దం నుంచి పేరుకుపోయిన స్వర్ణ్భారణాలు, గాజులు, పూసలు ఉంగరాలు, కెంపులు, ముత్యాలు, విలువైన రంగు రాళ్ళు మొదలైనవి కొరియా, చైనా, జపాన్ వగైరా దేశాలకు చెందినవి- భక్తులు సైనికులు కానుకలుగా వదిలిపోయినవి ఒక ఎనభై వేల దాకా లభించాయి. ఇదొక ‘సాంస్కృతిక వారసత్వపు కాణాచి’ అని పరిశోధకులు నిర్ణయించారు. అందువల్లనే దీనిని యునెస్కో సంస్థ గుర్తించి హెరిటేజి ద్వీపంగా ప్రకటించింది ఇప్పుడే. దీని భద్రతకి అభివృద్ధికి కూడా పణం లభిస్తుంది ఇకమీదట. ఈ వార్తకి స్పందిస్తూ అక్కడి పూజారి ‘మేము నియమాలు మార్చము- స్ర్తిలను, టూరిస్టులను రానివ్వం’ అని ఖండితంగా ప్రకటించాడు- యుద్ధానికి అధిపతులయిన చీనా కొరియా జాతుల అధిదేవతలున్నారు ఇక్కడ అంటున్నారు. అదీ సంగతి.్ధర్నాలు ప్రొటెస్టులు కూడా వీళ్ళల్లో నగ్నంగా చెయ్యాల్సి వుంటుంది మరి!

-వీరాజీ