సబ్ ఫీచర్

మోడరన్ టాయలెట్లు వచ్చేశాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనశ్శాంతికి అనువైన ఒక మంచి చోటు, అలాగే ఎలాంటి సమస్యకైనా, పరిష్కారం దొరికే చోటు ప్రపంచంలో ఏదంటే? ఆ చోటే ‘టాయిలెట్’. ఆశ్చర్యపడకండి. ఇదే నిజం! మనం రోడ్డుమీద వెడుతుంటాం. అర్జెంటుగా టాయిలెట్‌కి వెళ్లవలసి వస్తుంది. ఆపుకోలేం. అలాగని ఎక్కడ పడితే అక్కడ వెళ్లలేము...ప్రజలు ఇలాంటి అవస్థలు పడకూడదనే డా.బిందేశ్వర్ పాఠక్ నలభై సంవత్సరాలనుంచి తన ‘సులభ్ ఇంటర్నేషనల్’ అన్న సంస్థ ద్వారా దేశం మొత్తం మీద బోల్డెన్ని టాయిలెట్లని నిర్మించడమే కాకుండా కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించారన్నది నిజం! అంతేకాకుండా రకరకాల టాయిలెట్ టెక్నాలజీను కనిపెట్టి అందర్నీ ఆశ్చర్యంలో పడవేస్తున్నారు.
మొట్టమొదట టాయిలెట్‌కి పన్ను విధించినవారు ఎవరో తెలుసా? క్రీ.శక 69లో రోమ్ చక్రవర్తి వెస్‌పానియస్. ఆ తర్వాత పదవికి వచ్చిన ఆయన కొడుకు టైటాస్ ‘్ఛ ఛీ ఇదేం డబ్బు’ అని టాయిలెట్‌పై పన్ను ఎత్తివేసాడు.
చాలామందికి టాయిలెట్‌ల గురించి ఇలా వుంటే బాగుంటాయి, అలాగుంటేబాగుంటాయి అని కొత్త కొత్త ఆలోచనలు వుంటుంటాయి. అలాంటి ఆలోచనల్లో కొన్ని.
ఫ్రాన్సు దేశపు చక్రవర్తి పదమూడో లూయి తన సింహాసనంలోనే టాయిలెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు కష్టసుఖాల్ని చెప్పుకునేటప్పుడు అర్జెంటుగా వచ్చేస్తే సింహాసనం పైన వున్న కవర్‌ని తొలగించి కూర్చునేవాడు.
1920లో ఐరోపాలో వున్న కర్మాగారాలలో టాయిలెట్స్‌ని ఒకదానిపై ఒకటి కట్టేవారు. పైన వున్న టాయిలెట్స్‌ని అధికారులు మాత్రమే ఉపయోగించాలి. కిందవున్న టాయిలెట్లు కార్మికుల కోసం! అప్పట్లో టాయిలెట్లలో కూడా అధికార దర్పం స్పష్టంగా కనపడేది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ టాయిలెట్లలో కూడా మార్పు రాసాగింది. ఐరోపాలో ఒక కంపెనీ తయారుచేసిన టాయిలెట్ బేసిన్ మీద కూర్చోగానే దానిలో వున్న ఎలక్ట్రానిక్ చార్జర్ మీ శరీరంలో వున్న కొవ్వు శాతాన్ని, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని చూపిస్తుందట!
అక్కడే ఇది చూసిన ఇంకో కంపెనీ కొత్తరకం టాయిలెట్‌ని కనిపెట్టింది. అది రాత్రుళ్లు కరెంటు పోయినా చీకటిలో ధగధగా మెరసిపోతుంటుంది. మనిషి వెళ్లగానే బేసిన్ మూత ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది.కూర్చోగానే మంచి మంచి పాటలు వినిపిస్తుంది. ఆ తర్వాత మూత్ర విసర్జన అయిన వెంటనే చకచక లెక్కలు కట్టి మీ ఒంట్లో చక్కెర లెవెల్ ఎంతుందో చెబుతుంది.
ఈ రామాయణం అంతా ఎందుకు మనకెలాగూ చెరువుగట్లూ, పొలం గట్లూ ఉన్నాయిగా అని అనుకుంటున్నారు కదూ!

అమెరికాలో ‘ఇంజినోలెట్’ అని ఒక కొత్తరకం టాయిలెట్‌ని కనిపెట్టారు. దీనిలో నీళ్లు వాడక్కరలేదు. పని పూర్తి అయిన వెంటనే విసర్జనల్ని నిముషంలో బూడిదగా మారుస్తుంది. నీళ్ల కొరత ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి కదూ! కానీ రేటే కొంచెం ఎక్కువ. రెండు లక్షలు మాత్రమే!

సులభ్ మరుగుదొడ్ల ద్వారా దేశంలో పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికిన డా.బిందేశ్వర్ పాఠక్‌ని భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌తో సత్కరించింది. అలాగే 2009లో స్టాక్‌హోం రాటర్‌ప్రైజ్ అవార్డు కూడా పాఠక్‌ని వరించింది. ఢిల్లీలో ఉన్న ఆయన ఆఫీసు భవంతిలో ఒక టాయిలెట్ మ్యూజియం ఉంది.

- వసంతకుమార్ సూరిశెట్టి